'హోదా సాధించడంలో ప్రభుత్వం విఫలం'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం కాకినాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.