నాటకీయ పరిణామాల మధ్య కొడాలి నాని అరెస్ట్ | ysrcp mla kodali nani arrested in gudivada | Sakshi
Sakshi News home page

నాటకీయ పరిణామాల మధ్య కొడాలి నాని అరెస్ట్

Published Sun, Nov 15 2015 10:19 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

కొడాలి నాని (ఫైల్) ఫోటో - Sakshi

కొడాలి నాని (ఫైల్) ఫోటో

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయానికి సంబంధించిన భూ వివాదంలో  పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పార్టీ కార్యాలయం నిర్వహిస్తున్న అద్దె భవనానికి ఇటీవల యజమాని తాళం వేయడంతో దాన్ని తొలగించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నించడంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు నానిని అదుపులోకి తీసుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను కైకలూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని బలవంతంగా ఖాళీ చేయిందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్తో పార్టీ కార్యాలయానికి భారీగా పార్టీ కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. గుడివాడలో జరిగిన తాజా పరిణామాలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొడాలి నానితో ఫోన్లో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement