శ్రీనివాసరావు
బెజ్జంకి/మంకమ్మతోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శనివారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నాయకులకు స్థానం కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోయినిపల్లి శ్రీనివాసరావును నియమించారు.
బెజ్జంకి/మంకమ్మతోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శనివారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నాయకులకు స్థానం కల్పించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బోయినిపల్లి శ్రీనివాసరావును నియమించారు. బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన బోయినిపల్లి శ్రీనివాసరావు యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడుగా, తోటపల్లి గ్రామ పెద్ద చెరువు చైర్మన్‌గా, గ్రామ ఎంపీటీసీగా బాధ్యతలు నిర్వహించారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చే రి జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడుగా, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడుగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2014 ఎన్నికలల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా వ్యవహరించారు. తాజాగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డిలకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ పార్టీ పటిష్టతకు తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
మరో ఇద్దరికి చోటు..
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా నుంచి మరో ఇద్దరికి స్థానం కల్పించారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పారుపెల్లి వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడుగా సందమల్ల నరేష్‌ను నియమించారు.