
విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం చేసిన దుండుగుడు శ్రీనివాస్ బంధువు విజయదుర్గ, స్నేహితుడు చైతన్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఇద్దరినీ సిట్ అధికారులు విశాఖకు తీసుకెళ్లారు. అంతకు ముందుకు శ్రీనివాస్‌ను పోలీసులు, న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చడంతో నవంబర్ 9 వరకు రిమాండ్ విధించారు.
Comments
Please login to add a commentAdd a comment