
సాక్షి, విజయవాడ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్‌కు సంబంధించి సోమవారం అతని తరఫు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. అతని తరఫు న్యాయవాదులు సలీం, మట్టాజయకర్‌లు గురువారం రాజమండ్రి సెంట్రల్ జైల్లో శ్రీనివాస్‌ను కలిశారు. ప్రాణానికి ప్రమాదముందని లాయర్లు చెప్పినా, ఏమైనా పర్లేదు బెయిల్ మాత్రం కావాలని శ్రీనివాస్ పట్టుబట్టాడు. తనను బయటకి తీసుకురావాలని శ్రీనివాస్ లాయర్లని కోరాడు. ధానేలంకలో శ్రీనివాస్ తల్లిదండ్రులతో అతడి తరఫు లాయర్లు మాట్లాడారు. రేపటితో శ్రీనివాస్ రిమాండ్ గడువు ముగియనుంది. ఎన్‌ఐఏ కోర్టులో శ్రీనివాస్‌ను పోలీసులు హాజరుపరచనున్నారు.