
వన మహోత్సవానికి వైవీయూ సిద్ధం
వైవీయూ:
ఈనెల 29న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా వైవీయూలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వైవీయూ సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయంలో పలు ప్రాంతాలను పరిశీలించి గుంతలు తవ్వడం, కలుపు మొక్కలు తొలగించడం వంటి కార్యక్రమాలను చేపట్టారు. విశ్వవిద్యాలయ రెక్టార్
ఆచార్య ఎం. ధనుంజయనాయుడు, ప్రిన్సిపల్ ఆచార్య సత్యనారాయణరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఆచార్య రాంప్రసాద్‌రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్. ఈశ్వరరెడ్డి, వృక్షశాస్త్ర అధ్యాపకులు డాక్టర్ మధుసూధన్‌రెడ్డి సమావేశమై కార్యక్రమాన్ని విజయవంతం చేసే అంశంపై చర్చించారు. గతంలో నాటిన మొక్కలను జియోట్యాగింగ్‌కు సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. ప్రతి విద్యార్థి వన మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.