![ఓడీచెరువులో జెడ్పీ సీఈఓ](/styles/webp/s3/article_images/2017/09/4/71478712605_625x300.jpg.webp?itok=Ya7NM1OK)
ఓడీచెరువులో జెడ్పీ సీఈఓ
ఓబుళదేవరచెరువు : జెడ్పీ సీఈఓ రామచంద్ర ఓబుళదేవరచెరువులో బుధవారం పర్యటించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరుకు సంబంధించిన బయోమెట్రిక్‌ను పరిశీలించారు. హాజరైన సిబ్బంది వివరాలను ఎంపీడీఓ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని గదులు, పరిసరాలను ఆయన పరిశీలించారు. కార్యాలయం చుట్టూ అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వాటిని తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా చేపట్టిన ఫారంపాండ్లపై ఆరా తీశారు.