ramachandra
-
అప్పు చేసి జిరాక్స్ షాప్.. వందల కోట్ల వ్యాపారవేత్త సక్సెస్ స్టోరీ
ఎక్కడ మొదలు పెట్టాం అన్నది ముఖ్యం కాదు.. ఎక్కడికి చేరుకున్నాం అన్నదే ప్రధానం. పట్టుదల, కృషి, తెలివితేటలతో వ్యాపార రంగంలో ఉన్నత శిఖరాలకు చేరిన ఎందరో వ్యాపారవేత్తలు ఉన్నారు. అయితే నడకకు దూరం చేసిన విధికి తన విజయంతో గుణపాఠం చెప్పిన స్ఫూర్తిదాయక వ్యాపారవేత్త విశాల్ మెగా మార్ట్ వ్యవస్థాపకుడు రామచంద్ర అగర్వాల్.పోలియో బాధితుడైన రామచంద్ర తన వైకల్యానికి ఎప్పుడూ కుంగిపోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలన్న కసితో తెలిసినవారి వద్ద అప్పు చేసి 1986లో ఒక చిన్న ఫోటోస్టాట్ దుకాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కోల్‌కతాలో 15 ఏళ్ల పాటు బట్టల వ్యాపారం చేశారు. అక్కడి నుంచి ఢిల్లీకి మకాం మార్చిన ఆయన 2001-02లో విశాల్ రిటైల్ సంస్థను స్థాపించారు. ఆ వ్యాపారంలో విజయం సాధించి క్రమంగా విశాల్ రిటైల్స్ విశాల్ మెగా మార్ట్ గా మారింది.రెండో దెబ్బరూ.1000 కోట్ల ల ఆయన కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. అయితే 2008లో స్టాక్ మార్కెట్ పతనం కారణంగా ఆయన కంపెనీ విశాల్ మెగా మార్ట్ అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో ఆయన తన కంపెనీని శ్రీరామ్ గ్రూపునకు విక్రయించాల్సి వచ్చింది. ఎవరైనా అయితే ఇంత పెద్ద దెబ్బ తగిలితే ఇక్కడితో ఆగిపోతారు. కానీ రామచంద్ర అలా ఆగిపోలేదు.మరోసారి విధి కొట్టిన దెబ్బను తట్టుకుని ముందుకు సాగి వీ2 రిటైల్ సంస్థను స్థాపించి రిటైల్ మార్కెట్లో మరోసారి తనదైన ముద్ర వేశారు. ఆయన కంపెనీ వీ2 రిటైల్ మార్కెట్ ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ కంపెనీలలో ఒకటిగా ఉంది. రూ .800 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. -
కాపు రామచంద్రారెడ్డి రాజీనామాపై పేర్ని నాని రియాక్షన్
-
దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం!
అనంతపురం: పొలానికి వెళ్లేందుకు దాయాదులు దారి విడువక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం రాంపురానికి చెందిన ఆదినారాయణ, సావిత్రమ్మ దంపతుల రెండోకుమారుడు కాయల రామచంద్ర (26)కు సమీప బంధువులతో పొలం రస్తా విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గుత్తి మండలం కొత్తపేట సమీపంలో తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను తొలగించి దిగుబడిని ఇంటికి తరలించేందుకు రామచంద్ర సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న దాయాదులు రస్తాకు అడ్డు వేయడంతో మూడు రోజులుగా ఎద్దులబండి అక్కడే ఆగిపోయింది. ఆదివారం మరోసారి దాయాదులతో రామచంద్ర మాట్లాడాడు. అయినా వారు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రామచంద్ర నేరుగా ఇంటికెళ్లి పురుగుల మందు డబ్బా తీసుకుని పొలం వద్దకు చేరుకుని తాగాడు. అటుగా వెళుతున్న వారు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామచంద్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఏడాదిలో 119 మంది ఖైదీల ఆత్మహత్య -
ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిపోర్టులో కవిత పేరు
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్టులో మరోసారి ఎమెల్సీ కవిత పేరు వచ్చింది. ఆయన కవిత బినామీ అని, ఆమె ప్రతినిధినని ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. కవిత ఆదేశాల మేరకే ఆయన పనిచేసినట్లు చెప్పింది. ఇండో స్పిరిట్ స్థాపనలో రామచంద్ర పిళ్లైదే కీలక పాత్ర అని తెలిపింది. కాగితాలపై రూ.3.5 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు పిళ్లై చూపారని రిమాండ్ రిపోర్టులో ఉంది. అందుకు ప్రతిఫలంగా కవిత ఆదేశాల మేరకు అరుణ్ పిళ్లైకు కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలిపింది. నేరపూరిత నగదు ప్రవాహం గురించి తెలుసుకునేందుకు ఆయనను ఇంటరాగేషన్ చేయాలని ఈడీ రిమాండ్ రిపోర్టు పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి రూ.వందల కోట్లు ఆప్ లీడర్లకు చెల్లించినట్లు పిళ్లై చెప్పారని తెలిపింది. కాగా.. అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. ఇటీవలే ఆయనను రెండు రోజులపాటు ప్రశ్నించిన అధికారులు ఈక్రమంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఈయన అరెస్టుతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వాళ్ల సంఖ్య 11కి చేరింది. ఈడీ కస్టడీలో ఉన్న రామచంద్రపిళ్లై స్టేట్మెంట్ను వీడియో రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది. -
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్!
కాఠ్మాండూ: నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్ర పౌద్యాల్ ఎన్నికయ్యే అవకాశముంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన అభ్యర్థిత్వానికి ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), పుష్పకమల్ దహాల్(ప్రచండ) నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్), మరో ఐదు పార్టీ లు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెల్సిందే. అయితే కూటమి పార్టీ అయిన సీపీఎన్(యూఎంఎల్) బలపరిచిన అభ్యర్థి సుభాష్ నెబాంగ్‌కి కాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థి కి ప్రధానమంత్రి ప్రపంచ మద్దతు పలకడంతో రెండునెలల క్రితమే కొలువుదీరిన ప్రభుత్వం కూలే పరిస్థితులు నెలకొన్నాయి. నేపాల్ పార్లమెంట్లో పార్టీ ల ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ ఎనిమిది పార్టీ లు బలపరిచే అభ్యర్థే వచ్చే నెలలో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. ప్రచండ నిర్ణయంతో ఆగ్రహించిన అధికార కూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ తాము ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్డెన్ ఉపప్ర«దానిగా రాజీనామా చేశారు. కూటమి పార్టీ లు మద్దతు ఉపసంహరిస్తే నెలరోజుల్లోపు పార్లమెంట్లో ప్రచండ విశ్వాస పరీక్షలో నెగ్గాలి. -
బీజేపీలో రామచంద్ర చేరిక వాయిదా
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో చేరికలు పూర్తిస్థాయిలో పుంజుకోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి వివిధస్థాయిల నాయకులు చేరేందుకు ముందుకొస్తున్నా కొన్నిచోట్ల బీజేపీ నేతలే అడ్డుపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్‌నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సోదరుడు రామచంద్ర రాజనర్సింహ పార్టీలో చేరాలనుకొంటే ఇలాంటి అనుభవమే ఎదురైంది. గురువారం బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో పాటు తమ సన్నిహితులు, అనుచరులతో ఆయన జహీరాబాద్ నుంచి బీజేపీ ఆఫీసుకు వచ్చారు. ఈ చేరికకు సంబంధించిన ఫ్లెక్సీలను కూడా పార్టీ కార్యాలయం బయట ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌నుయ్‌ను కూడా కలుసుకున్నారు. అయితే ఈ చేరికపై బీజేపీనేత, మాజీ మంత్రి బాబూమోహన్ అభ్యంతరం తెలపడంతో ఇది వాయిదా పడ్డట్టు సమాచారం. రెండు, మూడురోజుల తర్వాత స్థానిక పార్టీ నేతలతో చర్చించాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నాయకులు చెప్పినట్టు తెలిసింది. ఆంథోల్ వద్దంటే వద్దని చెప్పినా... తాను ఆంథోల్ నుంచి పోటీ చేయనని కాగితం రాసి ఇచ్చేందుకు కూడా సిద్ధమని రామచంద్ర చెప్పినట్టు తెలుస్తోంది. బీజేపీకి చేసుకున్న దరఖాస్తులో జహీరాబాద్ లేదా చేవేళ్ల నుంచి పోటీకి అవకాశం కల్పించాలని ఆయన కోరినట్టు పార్టీవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే..గతంలో దామోదర రాజనర్సింహ భార్య పద్మిని బీజేపీలో ఉదయం చేరి... సాయంత్రానికి రాజీనామా చేశారు. కూకట్పల్లి నేతల చేరిక గురువారం బండి సంజయ్ సమక్షంలో మేడ్చల్ అర్బన్ జిల్లా కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి శ్రవణ్‌కుమార్, సునీల్‌కుమార్‌రెడ్డి, కూకట్పల్లి రెడ్డి సంఘం అధ్యక్షుడు సాధుప్రతాప్‌రెడ్డి బీజేపీలో చేరారు. -
ఎమ్మెల్యే కొనుగోలు కేసులో వాడీ వేడీగా సాగిన వాదనలు
-
ఎమ్మెల్యేల కేసు: రామచంద్ర భారతికి ఊహించని షాక్.. ఉచ్చు బిగుసుకుంటోందా!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులు ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ కేసులో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ కేసులో రామచంద్ర భారతికి ఊహించని షాక్ తగిలింది. ఎమ్మెల్యేల కొనుగోలులో నిందితుడిగా ఉన్న రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో మరో ఫిర్యాదు నమోదైంది. రామచంద్ర భారతిపై సిట్ అధికారి గంగాధర్ ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో ఐఫోన్, ల్యాప్‌ట్యాప్‌లో నకిలీ పాస్ట్‌పోర్ట్ లభ్యమైంది. కర్నాటక అడ్రస్‌తో T9633092 నెంబర్‌తో నకిలీ పాస్‌పోర్ట్ దొరికింది. దీంతో, ఆయనపై 467, 468, 471, ఐపీసీ12(3) పాస్‌పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ
-
దీపం లేని దేవుడు!
సాక్షి, హైదరాబాద్: మనం ఉంటున్న ఇంట్లో వసతులు లేకుంటే ఏం చేస్తాం.. మరో ఇంటికి మారతాం. మరి ఓ దేవుడి గుడిలో సమస్యలు ఏర్పడితే దేవుడు కూడా మరో కోవెలకు మారతాడా! కచ్చితంగా మారేవాడు అంటోంది ఓ శాసనం. ఆలనాపాలనా కరువై ధూపదీప నైవేద్యాలకు ఇబ్బంది వస్తే, ఆ దేవాలయంలోని స్వామివారిని అనుకూ లంగా ఉన్న మరో ఆలయంలోకి మార్చేవారు. అలాంటి స్వామిని బే చిరాగ్ దేవుడిగా పేర్కొనేవారు. అంటే దీపం కరువైన దేవుడని అర్థం. తాజాగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని పెరుమాళ్ల సంకీస గ్రామంలోని శ్రీరామచంద్రస్వామి దేవాలయంలో ఓ రాగి శాసనం వెలుగు చూసింది. 1236 హిజరీ సంవత్సరంగా అందులో పేర్కొన్నారు. అంటే 1820వ సంవత్సరమన్నమాట. ఆలయంలో భద్రపరిచిన ఈ శాసనాన్ని చరిత్ర పరిశోధకుడు కట్టా శ్రీనివాస్ పరిశీలించి దాన్ని వెలుగులోకి తెచ్చారు. శాసనంలోని వివరాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ వెల్లడించారు. వెలుగొందుతున్న ఆలయం.. మన్నెగూడెంకు చెందిన అంకం బాలన్న తూర్పు నుంచి స్వామివారిని తీసుకొచ్చి మంగళగిరి భావనాచార్యుల సహకారంతో మన్నెగూడెంలో కొంతకాలం కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత దీపం పెట్టే దిక్కుకూడా లేకపోవడంతో విక్రమనామ సంవత్సరంలో మంగళగిరి పెదనర్సయ్య భూదానం చేసి ఆ స్వామివారిని సంకీస గ్రామానికి రప్పించారు. ఆ తర్వాతనే గ్రామం పెరుమాళ్ల సంకీసగా మారిందని చెబుతారు. కీర్తి గడించిన ఆ దేవాలయం నాటి నుంచి వెలుగొందుతూనే ఉంది. స్వామివారి ప్రతిష్ట సందర్భంగా భూదానం, అర్చకులకు చెల్లించాల్సిన మొత్తం, స్వామివారి కైంకర్య వివరాలు, ఆలయ ఆదాయం, పులిహోర, ఇతర ప్రసాదాల్లో వాడాల్సిన దినుసుల పాళ్లు తదితర వివరాలను పత్రాల్లో రాశారు. రాగి ప్రతిపై శాసనం ఆ తర్వాత ఆ పత్రాలు జీర్ణమయ్యే పరిస్థితి రావటంతో రాగి శాసనంపై వివరాలు చెక్కించారు. కుంచెడు, అడ్డెడు, మానెడు, తక్కెడు లాంటి నాటి కొలమాన పదాలను అందులో వాడారు. స్వామి కల్యాణానికి 300 గ్రామాల వారు హాజరయ్యారని, ఆడపెండ్లి వారికి అర్ధరూపాయి, మగపెండ్లి వారికి రూపాయి చొప్పున కట్నం చదివించేవారు. శాసనంలో పేర్కొన్న విధంగా పద్ధతులు ఆచరించాలని పేర్కొంటూ అతిక్రమించిన వారికి శాపనార్థాలు పెట్టిన తీరు కూడా అందులో ఉండటం విశేషం. దస్తూరి, సాక్షుల పేర్లు కూడా రాయించారు. శాసనం వేయించినట్టు భావిస్తున్న ముగ్గురు దేశ్‌ముఖ్‌ల పేర్లు యర్రసాని వెంకట తిమ్మయ దేశ్‌ముఖ్, యర్రసాని చిన నర్సయ్య దేశ్‌ముఖ్, యర్రసాని గోపాల రాయుడు దేశ్‌ముఖ్‌ల పేర్లు చివరలో వేయించారు. -
దారి ఘటనలో రాజకీయం లేదు
మదనపల్లె టౌన్ : సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముడు రామచంద్ర(45)పై ఆదివారం సాయంత్రం బి.కొత్తకోటలో జరిగిన దాడిలో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని డీఎస్పీ రవిమనోహరాచారి స్పష్టం చేశారు. ఆయన ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడారు. పీటీఎం మండలం నారాయణపల్లెకు చెందిన భాస్కర్‌రెడ్డి కుమారుడు ప్రతాప్‌రెడ్డి దగ్గర బంధువు ఈ నెల 16న సూరపువారిపల్లెలో మృతిచెందాడని తెలిపారు. అతని కర్మక్రియలకు ప్రతాప్‌రెడ్డి వెళ్లాడన్నారు. తిరిగి వస్తుండగా స్నేహితుడు కుమార్‌రెడ్డి తనతోపాటు వస్తానని కోరాడని పేర్కొన్నారు. దీంతో ప్రతాప్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, మరో ఇద్దరు కారులో సూరపువారిపల్లెకు బయలుదేరారన్నారు. వారు బి.కొత్తకోటకు చేరుకున్నారని పేర్కొన్నారు. అదే సమయంలో మేజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముడు రామచంద్ర బి.కొత్తకోట బస్టాండు వద్ద పండ్ల వ్యాపారి శ్రీనివాసులు వద్దకు వచ్చాడని తెలిపారు. తోపుడు బండి రోడ్డుకు అడ్డంగా ఉండడంతో దారి వదలాలని కారులో ఉన్న ప్రతాప్‌రెడ్డి కోరాడని వివరించారు. ఈ క్రమంలో రామచంద్ర పండ్ల వ్యాపారికి వత్తాసు పలకడంతో గొడవ జరిగిందన్నారు. ఇందులో రామచంద్రకు గాయాలయ్యాయన్నారు. అప్పటికే టీవీల్లో మేజిస్ట్రేట్ తమ్ముడిపై రాజకీయ నాయకుల దాడి అంటూ అసత్య ప్రచారం జరిగిందని తెలిపారు. ఈ దాడిని రాజకీయ కోణంలో చూడకండని తెలిపారు. దాడిచేసిన ప్రతాప్‌రెడ్డి గతంలో టీడీపీ తరఫున ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగిన శివమ్మ కొడుకుగా తేలిందన్నారు. (ఆమె తర్వాత నామినేషన్ ఉపసంహరించుకుంది.) దాడిపై బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేస్తామన్నారు. బాధితుని వాంగ్మూలం ఇదే.. సంఘటనలో బాధితుడు రామచంద్ర బి.కొత్తకోట ఎస్ఐ సునీల్ కుమార్‌కు వాంగ్మూలం ఇచ్చారు. తనపై జరిగిన దాడిలో రాజకీయ ప్రమేయం లేదన్నారు. నల్ల కారులో వచ్చిన వ్యక్తులు హైస్కూల్ సందులోకి వెళ్లేందుకు తోపుడు బండి తీయాలని వ్యాపారికి చెప్పారని తెలిపారు. తనకు పండ్లు విక్రయించి తీస్తానని వ్యాపారి శ్రీనివాసులు చెప్పాడన్నారు. ఆ వెంటనే కారులో నుంచి నలుగురు వ్యక్తులు దిగి పండ్ల వ్యాపారితో వాదించగా తాను కల్పించుకున్నాని పేర్కొన్నారు. దీంతో వారు రాడ్లతో ముక్కు, తలపై, భుజాలు, శరీరంపై కొట్టి గాయపరిచారని తెలిపారు. ఈ మేరకు బి.కొత్తకోట ఎస్ఐ సునీల్‌కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిత్తూరులో అడ్డంగా బుక్కైన టీడీపీ
సాక్షి, చిత్తూరు: సస్పెన్షన్‌లో ఉన్న మేజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముడు రామచంద్ర (45) దాడి ఘటనను రాజకీయం చేస్తున్న టీడీపీ అడ్డంగా దొరికిపోయింది. రామచంద్రపై దాడి చేసింది మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు అని దుష్ప్రచారానికి తెరతీసిన ఎల్లో మీడియా బండారం బయటపడింది. దాడిలో పాల్గొన్నది టీడీపికి చెందిన ప్రతాప్‌రెడ్డి అని తేలింది. ఇదే విషయాన్ని ఆయన పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని ప్రతాప్‌రెడ్డి పోలీసులకు చెప్పారు. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ కేసు వివరాలను మీడియా తెలిపారు. ఈ ఘటనలో పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూశారు. మాజీ జడ్జి సోదరుడు రామచంద్ర మీద దాడి చేసింది టీడీపీ నేత ప్రతాప్‌రెడ్డినే. దాడికి సంబంధించి పక్కా ఆధారాలు లభించాయి. రాజకీయ లబ్ది కోసం తప్పుడు ఫిర్యాదులు చేశారు’అని ఎస్పీ పేర్కొన్నారు. (చదవండి: దారి ఘటనలో రాజకీయం లేదు) కాగా, మేజిస్ట్రేట్ రామకృష్ణ తమ్ముడు రామచంద్రపై బి.కొత్తకోట బస్టాండు వద్ద ఆదివారం సాయంత్రం దాడి జరిగింది. దారి ఇచ్చే విషయంలో పండ్ల వ్యాపారి శ్రీనివాసులు ప్రతాప్‌రెడ్డి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అదే సమయంలో శ్రీనివాసులు వద్ద పండ్లు కొంటున్న రామచంద్ర జోక్యం చేసుకోవడంతో ఘర్షణ జరిగింది. శ్రీనివాసులుకు మద్దతుగా మాట్లాడిన రామచంద్రపై ప్రతాప్‌రెడ్డి దాడి చేయడంతో మొహం, భుజాలపై గాయాలయ్యాయి. బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక గొడవ జరిగినప్పుడు మాజీ జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర మద్యం సేవించి ఉన్నట్టు తెలిసింది. రామచంద్ర మద్యం సేవించి ఉన్నట్లు నిర్ధారణ అయిందని వైద్యులు రిపోర్ట్ ఇచ్చినట్టు సమాచారం. కానీ వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: కుప్పంలో టీడీపీ నేతల దౌర్జన్యం) -
సెలవుపై జెడ్పీ సీఈఓ
అనంతపురం సిటీ : జిల్లా పరిషత్ సీఈఓ రామచంద్ర సెలవుపై వెళ్లారు. త్వరలో బదిలీలు జరగనున్న నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లడం పలు విమర్శలకు తావిస్తోంది. ఈ నెల 8 తేదీ వరకు విధులకు హాజరుకారని తెలిసింది. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక సెలవుపై వెళ్లారా?..లేక వ్యక్తిగత సెలవుపై వెళ్లారా? అన్నది తెలియడం లేదు. డిప్యూటీ సీఈఓ సూర్యనారాయణ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
కొత్తచెరువు : బైరాపురం పంచాయతీ సాయినగర్‌క్రాస్‌కు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రామచంద్రపై టీడీపీ కార్యకర్తలు లింగమయ్య, పోతలయ్యలు దాడి చేశారు. శనివారం రాత్రి నూతన సంవత్సర కేక్ కట్ చేసిన అనంతరం ‘జై జగన్’ అంటూ రామచంద్ర నినాదాలు చేశారు. అక్కడే ఉన్న లింగమయ్య, పోతలయ్యలు గొడవపడగా.. గ్రామస్తులు వారించి పంపించేశారు. ఆదివారం ఉదయం వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యకర్తలను వాహనంలో తీసుకెళుతుండగా మరోసారి రామచంద్రతో గొడవపెట్టుకున్నారు. కార్యకర్తలను వాహనంలో తరలిస్తావా అంటూ దాడిచేశారు. ఈ మేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
ఓడీచెరువులో జెడ్పీ సీఈఓ
ఓబుళదేవరచెరువు : జెడ్పీ సీఈఓ రామచంద్ర ఓబుళదేవరచెరువులో బుధవారం పర్యటించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఉద్యోగుల హాజరుకు సంబంధించిన బయోమెట్రిక్‌ను పరిశీలించారు. హాజరైన సిబ్బంది వివరాలను ఎంపీడీఓ నాగరాజును అడిగి తెలుసుకున్నారు. కార్యాలయంలోని గదులు, పరిసరాలను ఆయన పరిశీలించారు. కార్యాలయం చుట్టూ అపరిశుభ్రంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. వాటిని తొలగించి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మండల వ్యాప్తంగా చేపట్టిన ఫారంపాండ్లపై ఆరా తీశారు. -
వైకల్యాన్ని జయించాడు
అందరిలాగే బాల్యంలో ఆడుతూపాడుతూ పెరిగాడు. ఐదు సంవత్సరాల వయసులో అమ్మనాన్నతో కలిసి విహారయాత్ర ముగించుకుని ఇంటికి వస్తుండగా వాహనం రోడ్డు ప్రమాదానికి గురయింది. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాస్త కోలుకోవడానికి నెలలు పట్టింది. విధి వైకల్యాన్ని ప్రసాదించినా అతడు కుంగిపోలేదు. తనకంటూ ఓ ప్రత్యేకత కోసం పాటుపడ్డాడు. సంకల్పానికి ఏదీ అడ్డురాదంటూ నిరూపించాడు. కరాటే, క్రికెట్ పోటీల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి ఎన్నో పథకాలు, సర్టిఫికెట్లు, ప్రశంసలు పొంది పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. అతడే రామచంద్ర. హిందూపురం పరిధిలోని కిరికెర పంచాయతీలో సిరికల్చర్ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, వెంకటరమణల కుమారుడు రామచంద్ర. తల్లి కూలి పనికి వెళ్తుండగా, తండ్రి ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. బాల్యంలో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తల ఒక వైపునకు ఒంగి, నడవడానికి, కూర్చోవడానికి వీలుకాని పరిస్థితి ఏర్పడింది. కరాటే నేర్చుకుంటే అవయవాలపై పట్టు సాధించవచ్చని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో శరీరం సహకరించకపోయినా అతడు కరాటేలో శిక్షణ తీసుకున్నాడు. అలాగే క్రికెట్లో సైతం ప్రవేశం పొందాడు. 10వ తరగతి వరకు చదివి ఆర్థిక పరిస్థితులు, వైకల్యంతో ఉన్నత చదువులకు వెళ్లలేకపోయాడు. 1999 నుంచి కరాటే, క్రికెట్‌పై దృష్టి సారించాడు. మెలకువలు తెలుసుకుని పట్టు సాధించాడు. ప్రస్తుతం కరాటేలో బ్లాక్ బెల్ట్ 4వ డాన్‌గా అంతర్జాతీయ స్థాయికి, క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపర్‌గా ఆల్‌రౌండ్ ప్రతిభ సాధించి జాతీయస్థాయికి ఎదిగాడు. ఇప్పటి వరకు 100కి Sపైగా పతకాలు, సర్టిఫికెట్లు సొంతం చేసుకున్నాడు. 14 సార్లు కరాటేలో నేషనల్ స్థాయిలో గోల్డ్‌మెడల్స్‌ను సాధించాడు. ప్రస్తుతం జిల్లా వికలాంగుల క్రికెట్ సెలెక్షన్ కమిటీ సభ్యుడిగా, కుంగ్ ఫూ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ప్రతిభ ఉన్న వారిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి ఆరోగ్యం కోసం అభ్యసించిన కరాటే ఆత్మ విశ్వాçÜం పెంచింది. డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాను. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగిన వికలాంగుల క్రికెట్, కరాటే పోటీల్లో ఎన్నో పతకాలను, అవార్డులను సొంతం చేసుకున్నప్పటికీ ప్రతిభకు సహకారం లభించడం లేదు. ప్రతిభ ఉన్నవారిని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రోత్సహించాలి. – రామచంద్ర, డ్రాగన్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ వ్యవస్థాపకుడు -
టీకాలు వేయించండి
– పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ రామచంద్ర అనంతపురం అగ్రికల్చర్ : గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మరో 11 రోజులు గడువు పొడిగించినందున పశువులు, ఎద్దులకు టీకాలు వేయించుకోవాలని స్థానిక పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (అనిమల్ డిసీసెస్ డయాగ్నస్టిక్ ల్యాబ్–ఏడీడీఎల్) సహాయ సంచాలకులు డాక్టర్ ఎన్.రామచంద్ర తెలిపారు. గత నెల 20న ప్రారంభమైన ఫ్రూట్ అండ్ మౌత్ డిసీసెస్– ఎఫ్ఎండీ) టీకాల కార్యక్రమం 19న (నేడు) ముగియాల్సివుండగా మరో 11 రోజులు అంటే నెలాఖరు వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇంకా పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించని రైతులు ఎక్కడికక్కడ పశువైద్యులు, ఇతర పారావెటర్నరీ సిబ్బందిని సంప్రదించాలని సూచించారు. వ్యాధి వ్యాపించిన తర్వాత చికిత్స చేయించడం కన్నా ముందస్తు చర్యలతో సమర్థంగా నివారించుకోవచ్చని తెలిపారు. గాలికుంటు లక్షణాలు వైరస్ వల్ల సోకే అంటువ్యాధి కావడంతో మరణాలు తక్కువైనా ఆవులు, గేదెల్లో పాల ఉత్పత్తులు తగ్గిపోవడం, ఎద్దులు బలహీనంగా తయారై పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగానూ, బలహీనంగా ఉండే యుక్తవయస్సు పశువుల్లో వ్యాధి వేగంగా వ్యాపిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం ఉంటుంది. గిట్టల మధ్య పుండ్లు ఏర్పడుతాయి. నోటిలోపల, నాలుక మీద, ముట్టె లోపల భాగంలో బొబ్బలు ఏర్పడుతాయి. 24 గంటల్లోగా చిక్కిపోయి అల్సర్‌కు గురవుతాయి. మేత మేయవు. చొంగ కారుస్తాయి. గిట్టల మధ్య పుండ్ల కారణంగా సరిగా నడవలేవు. గర్భంతో ఉన్న పశువులు ఆబార్షన్‌కు గురవుతాయి. ఒక్కోసారి పొదుగుపై కూడా బొబ్బలు రావడం వల్ల పొదుగువాపు వ్యాధి వస్తుంది. బ్యాక్టీరియా చేరి చీము వస్తుంది. చీము కారడం వల్ల ఇతరత్రా రోగాలు వ్యాపించే అవకాశం ఉంటుంది. అలాగే చీముపై ఈగలు వాలి గుడ్లు పెట్టడం, వాటి నుంచి వచ్చిన లార్వాలు కండరాలకు చేరి మాంసాన్ని తినడం వల్ల పెద్ద పెద్ద గాయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. వ్యాధి సోకిన పశువుల పాలను తాగడం వల్ల దూడలు మరణిస్తాయి. ఇలా నివారించుకోవాలి వ్యాధి సోకిన పశువులను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో గిట్టలు, పుండ్లను శుభ్రం చేయాలి. బోరోగ్లిజరిన్ పూత పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, నిమ్లెంట్, లారాజెంట్ లాంటి మందులు వాడాలి. పశువైద్యాధికారి సిఫారసు మేరకు యాంటీబయాటిక్ మందులు తాపించాలి. వ్యాధి సోకిన పశువులకు రోజూ 50 గ్రాములు అయొడైజ్డ్ ఉప్పు దాణాతో ఇస్తే కొంత ఉపశమనం. అలాగే 30 గ్రాములు ఎముకలపొడి పచ్చిమేతతో కలిసి రోజూ ఇస్తే త్వరగా కోలుకుంటాయి. పశుశాఖ ద్వారా ఉచితంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. -
మలేరియా జ్వరంతో మహిళ మృతి
నల్గొండ జిల్లా రామన్నపేట మండలం జనంపెల్లిలో ఓ మహిళ మలేరియా జ్వరంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన వరికుప్పల ఆండాలు(53) గురువారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే.. జనవరి 31న ఇదే కుటుంబానికి చెందిన రామ చంద్ర అనే వ్యక్తి సైతం మలేరియా జర్వంతోనే మృతి చెందారు. వారం రోజుల్లోనే ఇద్దరు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో.. గ్రామంలో విషాదం నెల కొంది. -
సాహితీ దురంధరుడు రామచంద్ర
ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన స్వాతంత్య్ర సమర యోధుడాయన. 1947కి పూర్వం నలభైయేండ్ల తన స్వీయ అనుభవాలను తెలుపుతూ రాసిన ‘హంపీ నుండి హరప్పాదాకా’ అనే గ్రంథం పేరు వినగానే సాహితీ ప్రియులకు గుర్తుకు వచ్చే తెలుగు భాషా సేవకుడు డా. తిరుమల రామచంద్ర. 1913 జూన్ 13న అనంతపురం జిల్లాలో జాన కమ్మ, శేషాచార్యులకు జన్మించారు తిరుమల రామచంద్ర. గాంధీజీ పిలుపు మేరకు స్వాత్యంత్య్రోద్యమంలో పాల్గొని ఎన్నోసార్లు జైలు శిక్షను అనుభవించాడు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయ గోపురం అయిదో అంతస్తులో ఉన్న బొమ్మలకు త్రివర్ణ పతాకం కట్టి ఎగరవేసి జైలుపాలయ్యారు. తిరుపతిలో మొదటి సత్యాగ్రహిగా సంవత్సర కాలంపాటు జైలుకెళ్లి తిరిగి కమ్యూనిస్టుగా బయటకు వచ్చారు. తర్వాత ఆయన నడక తెలుగు సాహిత్యంవైపు మళ్లింది. తెలుగు భాషతోపాటు సంస్కృతం, ప్రాకృతం, కన్నడం, తమిళం, హిందీ, ఆంగ్లభాషలలో గొప్ప పాండిత్యాన్ని సంపాదిం చారు. తెలుగు ప్రాకృత భాషల మధ్య పదాలలో ఉండే సమన్వయాన్ని వివరిస్తూ గాధాసప్తశతిలో తెలుగుపదాలు, ప్రాకృత వాజ్మయంలో రామకథ వంటి రచనల ద్వారా తెలుగువారికి ప్రాకృత మాధుర్యాన్ని రుచి చూపారు. తెలుగులో ఎన్నో ఆత్మకథలు, స్వీయ చరిత్రలు వచ్చినప్పటికీ, తన స్వీయ అనుభవాలను తెలుపుతూ రాసిన ‘హంపీ నుండి హరప్పాదాకా’ అనే గ్రంథం ఎంతో విలక్షణమైంది. నవలకన్నా వేగంగా, ఆసక్తిభరితంగా సాగే స్వీయ చరిత్రాత్మక కథనం ఇది. మనిషి జీవితంలో లిపి పుట్టుక, దాని ప్రాధాన్యత, పరిణామాల ను గురించి తెలుపుతూ ‘మన లిపి పుట్టుపూర్వోత్తరాలు’ పేరుతో గ్రంథస్తం చేశారు. తెలుగు భాషా నుడికారాన్ని, పదబంధాలను గూర్చి వివరిస్తూ నుడి-నానుడి పేరుతో వ్యాస సంకలనం చేశారు. వివిధ పత్రికల్లో వచ్చిన స్వీయరచనల సంకలనం ‘బృహదారణ్యకం’, భారతి పత్రికలో రాసిన రచనలు కలిపి ‘సాహితీ సుగతుని స్వగతం’ వంటి వ్యాస సంకలా న్ని ప్రచురించారు. మహా మేధావుల జీవితాల్లోని వెలుగు- చీకట్లను తెలుపుతూ మరుపురాని మనిషి వంటి శీర్షికలతో ఆయన నిర్వహించిన ఇంటర్వ్యూలు నేటికీ తెలుగు సాహిత్యంలో ఎంతో మందికి ఆదర్శనీయంగా ఉన్నాయి. కొన్ని వందలకు పైగా పుస్తకాలకు పీఠికలు, వేల పుస్తకాలకు సమీక్షలు రాశారు. స్వాతంత్య్రానికి, సాహి త్యానికి యావజ్జీవితాన్ని అర్పించిన, తిరుమల రామచంద్ర 1997 అక్టోబర్ 12న పరమపదించారు. - (నేడు తిరుమల రామచంద్ర 21వ వర్థంతి) సి. శివారెడ్డి, సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కడప -
'సవరణలు ఎమ్మెల్సీ సంఖ్యకు పరిమితం కావడం బాధాకరం'
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టసవరణ కేవలం ఎమ్మెల్సీల సంఖ్య పెంచేందుకు పరిమితం కావడం బాధాకరమని ఎంపి వినోద్, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర అన్నారు. విభజన చట్టానికి అనేక సరవరణలు ప్రతిపాదిస్తున్నట్లు వారు తెలిపారు. వాటన్నిటిపై ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలన్నారు. పోలవరం ముంపు మండలాలు, భద్రాచలం ఆస్తులు తదితర అంశాలపై సవరణలు చేయాలని వారు కోరారు. -
అన్ని భాషల్లోనూ ‘లిపి’ రావాలి
రవ్వా శ్రీహరి =వేడుకగా ‘తిరుమల’ శతజయంతి సదస్సు సాక్షి, కల్చరల్ కరస్పాండెంట్: తిరుమల రామచంద్ర అపూర్వ రచన ‘లిపి : పుట్టుపూర్వోత్తరాలు’ అన్ని భారతీయ భాషాల్లోనూ రావాలని టీటీడీ పబ్లికేషన్స్ పూర్వ ఎడిటర్-ఇన్-చార్జ్ రవ్వా శ్రీహరి అన్నారు. సుప్రసిద్ధ పత్రికా రచయిత, పండితుడు, బహు భాషావేత్త తిరుమల రామచంద్ర శతజయంతి సందర్భంగా సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సింపోజియం నిర్వహించారు. సాహిత్య అకాడమీ సలహా సంఘం సభ్యుడు ఎన్.గోపి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీహరి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దక్షిణాది భాషలు-ఉత్తరాది భాషలు-సంస్కృతం మాత్రమే తెలిసినవారు తెలుగు భాష పుట్టుపూర్వోత్తరాలు చెప్పలేరన్నారు. సంస్కృతానికి సైతం పూర్వభాష అయిన ప్రాకృతంలో తెలుగు పదాలున్నాయని తిరుమల మాత్రమే చెప్పగలిగారని కొనియాడారు. ‘ప్రాకృత అకాడమీ’ ఎంతో అవసరం సంస్కృతం, ప్రాకృత భాషలు ఒకే పువ్వులోని రెండు రేకలుగా అభివర్ణించే రామచంద్ర, రుగ్వేదంలోని చందోబద్ధ గీతాలు ప్రాకృత భాషవేనని నిరూపించారని ప్రొఫెసర్ చౌడూరి ఉపేంద్రరావు పేర్కొన్నారు. తిరుమల ఆకాంక్ష అయిన ‘ప్రాకృత అకాడమీ’ని, కేంద్ర సాహిత్య అకాడమీకి అనుబంధంగా ఏర్పరచాలని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో చౌడూరి పేర్కొన్నారు. ఆయన ‘తిరుమల రామచంద్ర: పాళి-ప్రాకృత పరిశోధన’ అంశంపై పరిశోధనాపత్రం సమర్పించారు. సూర్యుడు అస్తమిస్తున్నా కిరణాలు ఉన్నతంగానే ఉంటాయన్నట్టు తిరుమల రామచంద్ర ఉన్నతమైన జీవితాన్ని గడిపారని ‘తిరుమల రామచంద్ర-కలం చిత్రాలు’ పరిశోధనా పత్రం సమర్పించిన సీనియర్ జర్నలిస్ట్ ఏబికే ప్రసాద్ అన్నారు. రాజరాజ నరేంద్రుడు కాలాన్ని ‘నన్నయ లిపి’, కాకతీయుల పరిపాలనా కాలాన్ని ‘తిక్కన లిపి’, రెడ్డిరాజుల పరిపాలనా కాలాన్ని ‘శ్రీనాథ లిపి’ అంటారని డాక్టర్ ఎం.నారాయణశర్మ పేర్కొన్నారు. ఈ విషయాలను రామచంద్ర ఆయా కాలాల్లో లిపిలో చోటుచేసుకున్న మార్పులను వివరించారన్నారు. అనంతరం ‘లిపి-పుట్టు పూర్తోత్తరాలు’పై ఆయన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. భారత ఉపఖండంలో పర్యటించి దేశీ నాటకలన్నీ చూసి రాసిన పండితుడు తిరుమల రామచంద్ర అని కల్లూరి భాస్కరం కీర్తించారు. గాథా సప్తశతిలో ‘నాటకం’ ఉందని తిరుమల వెల్లడించినట్టు చెప్పారు. అనంతరం ఆయన ‘తిరుమల రామచంద్ర సాహిత్య వ్యాసాలు-పరిశీలన’ అంశంపై పరిశోధన పత్రం సమర్పించారు. తన ఇంటిలోని గుండ్రాయి గురించి అమ్మను-నాయనమ్మను-తాతను అడిగి తెలుసుకున్న విషయాల ద్వారా తెలుగు వారి చరిత్రను చెప్పిన రామచంద్ర, స్వభావరీత్యా ఆధునికుడని ‘హంపి నుంచి హరప్పాదాకా- ఆత్మ కథాంశాలు’పై పరిశోధనా పత్రం సమర్పించిన ఆర్.వి.రామారావు పేర్కొన్నారు. పేదరికం ఆయన వ్రతం.. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో రోగిగా చేరిన తిరుమల.. పారితోషికం కోసం వీధిదీపం వెలుతురులో పత్రికలకు వ్యాసాలు రాశారని ‘వ్యక్తిగా తిరుమల రామచంద్ర’ అంశంపై పరిశోధనా పత్రం సమర్పించిన జి.చెన్నయ్య పేర్కొన్నారు. ఆయన పేదరికాన్ని వ్రతంగా స్వీకరించారని అభివర్ణించారు. భావాన్ని తెలియజేయాలనే లక్ష్య సాధనకు పదాలు పనిముట్లని ‘పాత్రికేయుల రచనలు-పలుకుబడి’పై పరిశోధనా పత్రం సమర్పించిన టి.ఉడయవర్లు అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ, బెంగళూరు ఇన్-చార్జ్ ఎస్.పి.మహాలింగేశ్వర్ స్వాగతోపన్యాసం చేసిన ఈ సదస్సులో తిరుమల రామచంద్ర కుటుంబ సభ్యులు, వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు, నందిరాజు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.