ఏపీ విభజన చట్టసవరణ కేవలం ఎమ్మెల్సీల సంఖ్య పెంచేందుకు పరిమితం కావడం బాధాకరమని ఎంపి వినోద్, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర అన్నారు.
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టసవరణ కేవలం ఎమ్మెల్సీల సంఖ్య పెంచేందుకు పరిమితం కావడం బాధాకరమని ఎంపి వినోద్, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్ర అన్నారు. విభజన చట్టానికి అనేక సరవరణలు ప్రతిపాదిస్తున్నట్లు వారు తెలిపారు. వాటన్నిటిపై ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించాలన్నారు.
పోలవరం ముంపు మండలాలు, భద్రాచలం ఆస్తులు తదితర అంశాలపై సవరణలు చేయాలని వారు కోరారు.