పెన్నానదిలో గుర్తుతెలియని మృతదేహం
నెల్లూరు (క్రైమ్): రంగనాయకులపేట పొర్లుకట్ట పినాకిని పార్కు సమీపంలోని పెన్నానదిలో బుధవారం గుర్తుతెలియని(30) మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వీఆర్వో కాకి భాస్కర్‌కు సమాచారం అందించారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెడ్‌కానిస్టేబుల్ బీవీ నరసయ్య స్థానికుల సహాయంతో మృతదేహాన్ని నదిలో నుంచి వెలికితీయించారు. మృతుడు బులుగు రంగు జీన్స్ ఫ్యాంటు, గోధుమ రంగు చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉబ్బిపోయి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.