GENERAL SCIENCE
PAPER-II (Biological Science)
(Telugu Version)
Time: 2.45 Hours Max. Marks: 40
విభాగం - ఐ
సూచనలు: 4 ణ 4 = 16
{పతి ప్రశ్నకు 8-10 వాక్యాల్లో సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.
{పతి ప్రశ్న నుంచి అంతర్గతంగా ఒక ప్రశ్నను ఎన్నుకుని సమాధానం రాయండి.
1. ఆకుపచ్చని మొక్కలను సూర్య కాంతిలో ఉంచినప్పుడు ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. దీన్ని నిరూపించడానికి మీరు ఏ ప్రయోగం చేస్తారు?
(లేదా) మీ టీచర్ పక్కన చూపిన ప్రయోగ నమూనాను తరగతి గదిలో ప్రదర్శించారు. ఈ పటాన్ని పరిశీలించి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) ఈ పటం ఏ ప్రయోగాన్ని తెలియజేస్తుంది?
బి) {పయోగంలో ఉపయోగించిన పరికరాల పేర్లు రాయండి.
సి) {పయోగ విధానాన్ని వివరించండి.
2. డయాలసిస్ అంటే ఏమిటి? దాన్ని ఏ పరిస్థితుల్లో చేస్తారు? ఎలా నిర్వహిస్తారు?
(లేదా)
చిన్న పేగు చుట్టుకొని అనేక ముడతలుగా ఉండటానికి కారణం ఏమైనా ఉందా? జీర్ణక్రియకు అది ఏ విధంగా తోడ్పడుతుంది?
3. లింగ వివక్షత వల్ల ఆడ శిశువుల విక్రయం, బ్రూణహత్యలు అనే వార్తలు తరచూ వింటున్నాం. సైన్‌స విద్యార్థిగా మానవుల్లో లింగ నిర్ధారణ ఎలా జరుగుతుందో ఉదాహరణలతో వివరించండి. మీ గ్రామస్థులను ఏ విధంగా చైతన్య పరుస్తారో తెలపండి.
(లేదా)
{Mిమికీటకాల బారి నుంచి పంటలను, ఆహార పదార్థాలను సంరక్షించడానికి క్రిమి సంహారకాలను ఉపయోగించాలా? వద్దా? ప్రత్యామ్నాయాలు ఉన్నాయా? దీనిపై మీ అభిప్రాయాన్ని సహేతుక కారణాలతో తెలపండి.
4. కింద ఇచ్చిన నీటి పారుదల సౌకర్యాలు- విస్తీర్ణం పటాన్ని గమనించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
ఎ) పటంలో వివిధ నీటి వనరుల శాతాలను పేర్కొనండి.
బి) భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి?
సి) భూగర్భ జల వనరులు వేగంగా తరిగిపోతున్నాయి కదా! దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి?
(లేదా)వివిధ రకాల మొక్కల నుంచి లభించే ఆల్కలాయిడ్లకు సంబంధించిన సమాచారాన్ని ఇంటర్‌నెట్ లేదా గ్రంథాలయం నుంచి సేకరించి నివేదిక తయారు చేయండి.
విభాగం - ఐఐ
సూచనలు: 6 ణ 2 = 12
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
{పతి ప్రశ్నకు 4 నుంచి 5 వాక్యాల్లో జవాబు రాయండి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
5. కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ ఆవశ్యకత తెలిపే కృత్యానికి సంబంధించిన గాజు సీసాలో పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంచకపోతే ఏం జరుగుతుంది?
6. ఊపిరితిత్తుల వ్యాధి నిపుణుడిని కలిసే అవకాశం లభిస్తే శ్వాసక్రియ గురించి ఏయే ప్రశ్నలు అడుగుతారు?
7. కొంతమంది పిల్లలు 15 లేదా 16 ఏళ్లు వచ్చే వరకూ రాత్రిపూట నిద్రలో పక్క తడుపుతుంటారు. కారణమేమిటి?
8. పటంలో ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్ భాగాల పేర్లు రాయండి.
9. కిందివాటిలో నియంత్రిత, అనియంత్రిత అభ్యసిత ప్రతీకార చర్యలను గుర్తించండి.
ఎ) రక్తనాళాల్లో రక్త ప్రసరణ
బి) మంచి ఆహారం చూడగానే నోట్లో లాలాజలం ఊరడం
సి) వందేమాతర గీతం వినగానే లేచి నిలబడటం
డి) పాట పాడటం
10. ‘సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ’ - దీన్ని మీరు సమర్థిస్తారా? ఎందుకు?
విభాగం - ఐఐఐ
సూచన: 7 ణ 1 = 7
అన్ని ప్రశ్నలకు 1, 2 వాక్యాల్లో జవాబులు రాయండి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు.
11. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి కొవ్వులను జీర్ణం చేసుకోలేడు. కారణమేమిటి?
12. కింది గ్రాఫ్ దేన్ని తెలియజేస్తుంది?
13. కాడవర్ ట్రాన్స్‌ప్లాంట్ అంటే ఏమిటి?
14. ఎక్కువ నీరు తాగినప్పుడు వాసోప్రెస్సిన్ ఎందుకు ఉత్పత్తి కాదో తెలపండి.
15. గర్భాశయంలోని ఉమ్మనీటి కోశం విధి ఏమిటి?
16. ‘కార్బన్ డేటింగ్’ పద్ధతిని దేనికి ఉపయోగిస్తారు?
17. ఇంకుడు గుంట, ఇంకుడు చెరువు మధ్య తేడా ఏమిటి?
విభాగం - ఐగ
సూచనలు: 10 ణ 1/2 = 5
అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు.
సరైన సమాధానాన్ని ఎంచుకొని ప్రశ్న సంఖ్య, దాని జవాబును సూచించే అక్షరాన్ని (అ/ ఆ/ ఇ/ ఈ) సమాధాన పత్రంలో రాయండి.
18. రవికి గాయమైన భాగంలో రక్తం గడ్డకట్టడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంది. అతడు ఏ విటమిన్ లోపంతో బాధపడుతున్నాడు?
అ) విటమిన్-ఎ ఆ) విటమిన్-సి
ఇ) విటమిన్-డి ఈ) విటమిన్ - కె
19. ఊపిరితిత్తుల్లో శ్వాసక్రియ క్రమాన్ని గుర్తించండి.
1) రక్తం ద్వారా వాయు రవాణా
2) కణజాలాల్లో వాయు మార్పిడి
3) ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి
4) కణశ్వాస క్రియ
అ) 1, 2, 3, 4 ఆ) 3, 1, 2, 4
ఇ) 4, 2, 1, 3 ఈ) 4, 3, 1, 2
20. ఎఫిడ్లు పోషక కణజాలం నుంచి గ్రహించిన మొత్తం చక్కెరలో కొంత భాగం చిక్కని ద్రవం రూపంలో పాయువు నుంచి వెలువడుతుంది. దీన్ని ఏమంటారు?
అ) మలం ఆ) తేనే
ఇ) మలకబళనం ఈ) చక్కెర
21. మూత్రం ఏర్పడే దశల క్రమం ఏది?
అ) గుచ్ఛ గాలనం- వరణాత్మక పునఃశోషణం -నాళికా స్రావం
ఆ) వరణాత్మక పునఃశోషణం- నాళికా స్రావం- గుచ్ఛగాలనం
ఇ) వరణాత్మక పునఃశోషణం - గుచ్ఛగాలనం- నాళికా స్రావం
ఈ) నాళికా స్రావం- వరణాత్మక పునఃశోషణం - గుచ్ఛగాలనం
22. ఎగబాకే మొక్కల్లో నులి తీగలు సన్నగా, పొడవుగా దారాల మాదిరిగా ఉండి, ఏదైనా ఆధారం వైపు పెరిగి దాని చుట్టూ పెనవేసుకుంటాయి. ఈ ప్రతిస్పందనలను ఏమంటారు?
అ) నాస్టిక్ చలనాలు ఆ) కాంతి అనువర్తనం
ఇ) గురుత్వానువర్తనం ఈ) స్పర్శానువర్తనం
23. పటంలో భాగాన్ని గుర్తించండి.
అ) ప్రథమ కాండం
ఆ) ప్రథమ మూలం
ఇ) పరాగనాళం
ఈ) కేసరదండం
24. కిందివాటిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావం చూపేది ఏది?
అ) సిగరెట్ పొగలోని రసాయనాలు ఆ) ఆల్కహాల్
ఇ) ఔషధాలను అధికంగా వాడటం ఈ) పైవన్నీ
25. కడుపు నిండుగా ఉండి, ఇక ఎలాంటి ఆహారం అవసరం లేదు అనే భావనకు వచ్చినప్పుడు విడుదలయ్యే హార్మోన్ ఏది?
అ) గ్రీలిన్ ఆ) లెప్టిన్ ఇ) ఇన్సులిన్ ఈ) పైత్యరసం
26. చార్లెస్ ఎల్టాన్ ప్రకారం కిందివాటిలో సరైన వాక్యం?
అ) మాంసాహారులు పిరమిడ్ శిఖర భాగంలో ఉంటారు
ఆ) పిరమిడ్ శిఖర భాగంలో ఎక్కువ శక్తి గ్రహీతమవుతుంది
ఇ) పిరమిడ్ శిఖర భాగంలో ఉత్పత్తిదారులు ఉండవు
ఈ) అ, ఇ
27. పక్క పటం దేన్ని సూచిస్తుంది?
అ) తగ్గించడం
ఆ) పునర్వినియోగం
ఇ) పునఃచక్రీయం
ఈ) పదార్థాల నాణ్యత
విభాగం - ఐగ సమాధానాలు
18) ఈ 19) ఆ 20) ఆ 21) అ 22) ఈ
23) ఇ 24) ఈ 25) ఆ 26) ఈ 27) ఇ
సూర సత్యనారాయణ
సబ్జెక్ట్ ఎక్స్‌పర్‌ట
పదో తరగతి మాదిరి ప్రశ్నపత్రం
Published Sat, Apr 4 2015 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM
Advertisement
Advertisement