సమగ్ర సన్నాహాలతో విదేశీ విద్య.. | bhavita Foreign Education-Academic Info-22-08-13 | Sakshi
Sakshi News home page

సమగ్ర సన్నాహాలతో విదేశీ విద్య..

Published Thu, Aug 22 2013 3:45 PM | Last Updated on Tue, Oct 2 2018 7:58 PM

bhavita Foreign Education-Academic Info-22-08-13

జి. ఆరుళ్ జోసెఫ్, హైదరాబాద్.
 
 విదేశీ విద్య.. ప్రతి విద్యార్థి కల.. గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం పొరుగింటికి వెళ్లొచ్చినంత సులువుగా మారింది.. జాబ్ మార్కెట్లో ఫారెన్ డిగ్రీకి డిమాండ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం, బ్యాంకులు సైతం సులువుగానే రుణాలను మంజూరు చేస్తుండడంతో.. విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య రెట్టింపవుతోంది.. ఈ నేపథ్యంలో మన విద్యార్థులకు టాప్ డెస్టినేషన్స్‌గా నిలుస్తోన్న దేశాలు, అడ్మిషన్ విధివిధానాలు తదితర అంశాలపై ఫోకస్..
 
 
 యూఎస్‌ఏ


 అడ్మిషన్ సెషన్: ఫాల్ (ఆగస్ట్), స్ప్రింగ్ (జనవరి), సమ్మర్ (మే/జూన్). ఇందులో ఫాల్, స్ప్రింగ్ సెషన్‌లలోనే అక్కడి యూనివర్సిటీలు అధిక శాతం అడ్మిషన్లను స్వీకరిస్తాయి. సమ్మర్ సెషన్‌లో తక్కువ శాతంలోనే అడ్మిషన్లు జరుగుతాయి. టోఫెల్, జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌తోపాటు కొత్తగా వచ్చిన పీటీఈ (పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్) పరీక్షల స్కోర్ల ఆధారంగా అక్కడి యూనివర్సిటీలు ప్రవేశం కల్పిస్తున్నాయి. వీటిల్లో ఎంఎస్ కోర్సులకు టోఫెల్/ఐఈఎల్‌టీఎస్, జీఆర్‌ఈ స్కోర్ తప్పనిసరి. బ్యాచిలర్ కోర్సులకు-టోఫెల్, సాట్ స్కోర్ ఉండాలి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ తప్పనిసరి. యూఎస్ వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్, బయోటెక్నాలజీ, ఎంబీఏ, బయాలాజికల్ సెన్సైస్ కోర్సుల్లో చేరుతున్నారు.

 

వసతి విషయానికొస్తే సాధారణంగా యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే వసతి సౌకర్యం లభిస్తుంది. ఈ సౌకర్యం లభించని వారికి అక్కడి వర్సిటీల్లో ఉండే ఇండియన్ స్టూడెంట్స్ లేదా అసోసియేషన్స్‌ను సంప్రదించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవచ్చు. అమెరికాలో యూనివర్సిటీ క్యాంపస్‌లలోనే పార్ట్‌టైమ్ జాబ్ చేసే వెసులుబాటు ఉంటుంది. వారానికి 20 గంటలపాటు పార్ట్ టైమ్ జాబ్ చేయవచ్చు. లివింగ్ కాస్ట్ సంవత్సరానికి 12 వేల యూఎస్ డాలర్లు. అమెరికా వీసా పొందే క్రమంలో ఆ దేశ కాన్సులేట్ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇందుకోసం ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. అమెరికాలో ఫీజులు.. చదువుతున్న స్ట్రీమ్‌ను బట్టి 10 వేల నుంచి 25 వేల డాలర్ల మధ్యలో ఉంటాయి. నెలకు 600 నుంచి 1500 డాలర్ల వరకు ఖర్చవుతుంది.
 వెబ్‌సైట్: www.usa.gov


 
 
 ఆస్ట్రేలియా


 అడ్మిషన్ సెషన్: ఫిబ్రవరి/మార్చి, జూలై, నవంబర్. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు ఫిబ్రవరి/మార్చి, జూలై సెషన్‌లలో పూర్తవుతాయి. నవంబర్ సెషనల్‌లో మాత్రం స్వల్ప సంఖ్యలోనే మాత్రమే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్ (6.5/9) స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్, టోఫెల్ స్కోర్ అవసరం. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు మూడు సెషన్‌లుగా అడ్మిషన్ల ప్రక్రియను చేపడతాయి. ఆస్ట్రేలియాకు సంబంధించి సెన్సైస్ (కంప్యూటర్, ఐటీ), ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్/మెకానికల్), ఏవియేషన్, ఎంబీఏ అక్కడికి పాపులర్ కోర్సులు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. రెండు వారాల్లో(15 రో జులు) 40 గంటలు పార్ట్ టైమ్ జాబ్ చేసే వెసులుబాటును ఆస్ట్రేలియన్ వర్సిటీలు కల్పించాయి. ఆస్ట్రేలియా కాన్సులేట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. ఆస్ట్రేలియాలో యూజీ కోర్సులకు 10,000 నుంచి 16,500 ఆస్ట్రేలియన్ డాలర్లు, పీజీ కోర్సులకు 9,000 నుంచి 18,500 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించాలి. నెలవారీ ఖర్చు.. 1,500 ఆస్ట్రేలియన్ డాలర్లు.
 వెబ్‌సైట్: www.studyinaustralia.gov.au


 
 
 యూకే


 అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, ఫిబ్రవరి/మార్చి లేదా ఏప్రిల్/జూన్. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్/అక్టోబర్ సెషన్‌లలో పూర్తవుతాయి. ఫిబ్రవరి/ మార్చి లేదా ఏప్రిల్/జూన్ సెషన్‌లో మాత్రం స్వల్ప సంఖ్యలోనే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. యూకే యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్ (6.5/9), టోఫెల్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్త్తున్నాయి. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ అవసరం. యూకేకు వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది ఎంబీఏ, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సెన్సైస్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. యూకే వర్సిటీలు వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్ జాబ్ చేసే వెసులు బాటును కల్పించాయి. యూకే కాన్సులేట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది. యూకేలో ఫీజు.. యూజీ కోర్సులకు 9,500 యూరోలు, పీజీ కోర్సులకు 12,000 పౌండ్లు, ఎంబీఏ కోర్సుకు 15,000 యూరోలు. నెలవారీ ఖర్చు 600 నుంచి 1,000 యూరోల మధ్యలో ఉంటుంది.
 వెబ్‌సైట్:www.educationuk.org


 
 
 కెనడా


 అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, జనవరి, మార్చి. ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్/అక్టోబర్, జనవరి సెషన్‌లలో పూర్తవుతాయి. మార్చి సెషన్‌లో కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే అడ్మిషన్లను స్వీకరిస్తాయి. కెనడా యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్ (6.5/9) స్కోర్‌తో ప్రవేశం కల్పిస్తున్నాయి. పీజీ డిప్లొమా కోర్సులకు మాత్రమే జీఆర్‌ఈ స్కోర్ తప్పనిసరి. ఇంజనీరింగ్, సెన్సైస్, మేనేజ్‌మెంట్ కోర్సులను అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. కెనడాలో పార్ట్‌టైమ్ జాబ్ చేయాలంటే మాత్రం వర్క్ పర్మిట్ తప్పనిసరి. ఆ దేశ కాన్సులేట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది.    
 వెబ్‌సైట్:  www.cic.gc.ca


 
 
 ఐర్లాండ్
 అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్, ఫిబ్రవరి


 ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్ సెషన్‌లో పూర్తవుతాయి. ఫిబ్రవరి సెషన్‌లో మాత్రం స్వల్ప సంఖ్యలో మాత్రమే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. ఐర్లాండ్ ఇన్‌స్టిట్యూట్‌లు ఐఈఎల్‌టీఎస్ (6.5/9) స్కోర్‌తో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఐర్లాండ్‌కు వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం మంది కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎంబీఏ, సెన్సైస్ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ దేశ కాన్సులెట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీ సం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది.
 వెబ్‌సైట్:www.thecompleteuniversityguide.co.uk


 
 
 న్యూజిలాండ్
 అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, ఫిబ్రవరి, మే.

ఇందులో అధిక శాతం అడ్మిషన్లు సెప్టెంబర్/అక్టోబర్, ఫిబ్రవరి సెషన్‌లో పూర్తవుతాయి. మే సెషన్‌లో మాత్రం స్వల్ప సంఖ్యలో మాత్రమే అడ్మిషన్లను అక్కడి యూనివర్సిటీలు స్వీకరిస్తాయి. న్యూజిలాండ్‌కు సంబంధించి ఇంజనీరింగ్, ఎంబీఏ, హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పాపులర్. న్యూజిలాండ్ యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్ (6.5/9) స్కోర్‌తో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వారానికి 20 గంటలపాటు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ దేశ కాన్సులేట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది.
 వెబ్‌సైట్: www.immigration.govt.nz


 
 
 జర్మనీ
 అడ్మిషన్ సెషన్: ఏప్రిల్, అక్టోబర్.


 లైఫ్ సెన్సైస్, బయో సెన్సైస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, సంబంధిత కోర్సులకు సరైన వేదిక జర్మనీ. జర్మనీలో మాస్టర్ కోర్సులకు టోఫెల్ (స్కోర్ 80/120), ఐఈఎల్‌టీఎస్ (స్కోర్ 6.5/9) తప్పనిసరి. కొన్ని కోర్సులకు మాత్రం జీఆర్‌ఈ స్కోర్ అవసరం. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి జీమ్యాట్ స్కోర్ ఆవశ్యకం. ఇక్కడ సంవత్సరానికి 90 రోజులు పార్ట్ టైమ్ జాబ్ చేయవచ్చు. కొన్ని యూనివర్సిటీలు మాత్రం సెలవుల్లోనే ఈ సౌలభ్యం కల్పిస్తాయి. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. కొన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు ఫ్రీ ఎడ్యుకేషన్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ట్యూషన్ ఫీజు నుంచి విద్యార్థులకు మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా జర్మనీలో చదవాలనుకునే వారికి జర్మన్ భాష పరిజ్ఞానం తప్పనిసరి అనే నిబంధన అమల్లో ఉంది. జర్మనీలో సెమిస్టర్‌కు ఫీజు 500-
 1,000 యూరోలు, నెలవారీ ఖర్చు 300 నుంచి 400 యూరోలు.
 వెబ్‌సైట్:www.studyin.de


 
 
 సింగపూర్
 అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్/అక్టోబర్, జూలై.

సింగపూర్‌లో ఇంజనీరింగ్, ఎంబీఏ, హోటల్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ కోర్సులు పాపులర్. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ రెండు విధాలుగా వసతి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వారానికి 16 గంటలపాటు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ దేశ కాన్సులెట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది.
 వెబ్‌సైట్: www.singaporeedu.gov.sg


 
 
 స్విట్జర్లాండ్
 అడ్మిషన్ సెషన్: సెప్టెంబర్.


 హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హోటల్ మేనేజ్‌మెంట్, ఎంబీఏ, ఇంజనీరింగ్ కోర్సులను ఇక్కడికి వెళ్లే విద్యార్థుల్లో అత్యధిక శాతం ఎంచుకుంటున్న కోర్సులు. ఇక్కడి యూనివర్సిటీల్లో ప్రవేశం పొందాలంటే ఐఈఎల్‌టీఎస్ (6.5/9) స్కోర్ ఉండాలి. ఆ దేశ కాన్సులేట్‌లోని డ్రాప్‌బాక్స్ ద్వారా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీసా రావడానికి కనీసం రెండు నుంచి మూడు వారాల సమయం పడుతుంది.
 వెబ్‌సైట్: www.crus.ch
 
 దృష్టి సారించాల్సిన అంశాలు
 
 ఫారెన్ ఎడ్యుకేషన్ దిశగా ఆలోచించే ప్రతి విద్యార్థి ముందుగా ‘తనకు అనుకూలమైన కోర్సు.. మంచి కాలేజీతోపాటు దేశం గురించీ తెలుసుకోవాలి. ఏ ఇన్‌స్టిట్యూట్‌కి ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుసుకోవడం చాలా అవసరం. ఇందుకోసం ఆయా దేశాల ఇమిగ్రేషన్ శాఖ వెబ్‌సైట్‌లలోని సమాచారాన్ని పరిశీలించాలి.
 
 అకడమిక్ షెడ్యూల్ ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆ మేరకు వీలైనంత ముందు సన్నాహకాలు మొదలు పెట్టాలి. ఎంచుకున్న దేశం, యూనివర్సిటీని షెడ్యూల్‌ను అనుసరించి కనీసం 8 నుంచి 12 నెలల దరఖాస్తు చేసుకుంటే సంబంధిత ప్రక్రియ ఆటంకం లేకుండా ముగియడానికి, వీసా దరఖాస్తుకు తగిన సమయం లభిస్తుంది.
 
 అమెరికా, కెనడా, జర్మనీ యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్ లెవల్ ప్రోగ్రామ్‌లలో చేరడానికి 16 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. కొన్ని వర్సిటీలు మాత్రమే 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ అర్హతగా బ్రిడ్జ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. మిగతా దేశాల్లో మాత్రం 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ సరిపోతుంది.
 
 విదేశీ వర్సిటీలు అడ్మిషన్ సమయంలో చాలా అంశాలను ఆధారం చేసుకుంటాయి. మెరిట్(అకడ మిక్ రికార్డ్), సాట్/జీఆర్‌ఈ/జీమ్యాట్ వంటి పరీక్షల స్కోర్, టోఫెల్/ఐఈఎల్‌టీఎస్ స్కోర్, ఎస్‌ఓపీ, సమ్మరీ ప్రాజెక్ట్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్, రీసెర్చ్ ఎక్స్‌పీరియెన్స్, వర్క్ ఎక్స్‌పీరియెన్స్, రెజ్యుమె, ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్.. తదితరాలు.
 
 ఫారెన్ ఎడ్యుకేషన్‌లో మరో కీలక అంశం ‘స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్ (ఎస్‌ఓపీ)’. దీని ద్వారా విద్యార్థి లీడర్‌షిప్ స్కిల్స్, సంబంధిత కోర్సుపై అవగాహన, భవిష్యత్ లక్ష్యాలు తదితర విషయాలు తెలుస్తాయి. ఒకే సీటు ఉండి.. ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పుడు ఎస్‌ఓపీ ద్వారానే అడ్మిషన్ కేటాయిస్తారు.
 
 వీసా కోసం.. సమర్పించాల్సిన డాక్యుమెంట్లు..
 పాస్‌పోర్ట్
 వీసా అప్లికేషన్
 వీసా ఫీజు డీడీ
 అడ్మిషన్/కన్ఫర్మేషన్ లెటర్
 అకడమిక్ అర్హతల సర్టిఫికెట్లు
 కోర్సు ఫీజు రసీదులు
 నిర్దేశిత పరీక్షల (జీఆర్‌ఈ తదితర) స్కోర్లు
 ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లు
 సదరు విద్యార్థిని వేరే వ్యక్తులు స్పాన్సర్ చేస్తే.. సంబంధిత స్పాన్సర్ ఇచ్చే లెటర్
 స్పాన్సరర్ ఇన్‌కమ్ ట్యాక్స్ స్టేట్‌మెంట్
 
 అక్రెడిటేషన్
 ఇటీవలి కాలంలో ఫేక్ యూనివర్సిటీల బాగోతం బయటకు వస్తున్న తరుణంలో సంబంధిత
 ఏజెన్సీల అక్రెడిటేషన్‌ఉన్న యూనివర్సిటీలనే ఎంచుకోవాలి. దేశాల వారీగా అక్రెడిటేషన్ సంస్థల వివరాలు..
 అమెరికా-ది కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్
 బ్రిటన్-క్వాలిటీ అస్యూరెన్స్ ఏజెన్సీ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్
 ఆస్ట్రేలియా-కామన్‌వెల్త్ రిజిస్ట్రర్ ఆఫ్
 ఇన్‌స్టిట్యూషన్స్
 న్యూజిలాండ్-న్యూజిలాండ్ క్వాలిఫికేషన్స్
 అథారిటీ
 
 
 కెనడా-అసోసియేషన్ ఆఫ్ కెనడియన్
 యూనివర్సిటీస్+ప్రొవిజినల్ చార్టర్
 జర్మనీ-ఏజెన్సీ ఫర్ సెన్సైస్ అండ్ ఇంజనీరింగ్
 సింగపూర్-నో సెంట్రల్ అథారిటీ (సింగపూర్ క్లాస్-ఏ ప్రైవేట్ ఇనిషియేటివ్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement