1. చైల్డ్ డెవలప్‌మెంట్, పెడగాగీ (మార్కులు: 30)
1. భాషను విశ్వవ్యాప్తిత వ్యాకరణ సూత్రాల ఆధారంగా అవగాహన చేసుకోవాలని పేర్కొంది?
1) పియాజే 2) కోల్బర్గ్ 3) చామ్‌స్కీ 4) రోజర్స్
2. విద్యపై సాంఘిక, ఆర్థిక స్థితి ప్రభావాన్ని కనుక్కోవడానికి జరిపే పరిశోధనలో స్వతంత్ర చరం ఏది?
1) వయసు 2) ప్రజ్ఞ
3) సాంఘిక, ఆర్థిక స్థితి 4) విద్య
3. ఒక తరగతిలోని విద్యార్థులను ఉపాధ్యాయుడు మూడు సమూహాలుగా విభజించాడు. అందులో మొదటి సమూహం వారికి ఇంటిపని చేసుకొని వస్తే బహుమతి ఇస్తానని ప్రకటించాడు. రెండో సమూహం వారికి ఇంటిపని ఇచ్చాడు. కానీ, దండన, బహుమతి ప్రకటించలేదు. మూడో సమూహం వారికి ఇంటిపని చేసుకొని రాకపోతే దండన ఉందని తెలిపాడు. ఇందులో నియంత్రిత సమూహం ఏది?
1) ఒకటో సమూహం 2) రెండో సమూహం
3) మూడో సమూహం 4)ఒకటి,మూడు సమూహాలు
4. తప్పు చేస్తే దేవుడు క్షమించడు. మంచి పనులే చేయాలి అని అంతర్గతంగా ప్రేరేపితమైన పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో ఏ స్థాయికి చెందుతాడు?
1) ఉన్నత సంప్రదాయ స్థాయి
2) ఉత్తర సంప్రదాయ స్థాయి
3) పూర్వ సంప్రదాయ స్థాయి
4) సంప్రదాయ స్థాయి
5. కిందివాటిలో కచ్చితంగా కొలవగలిగేది?
1) విద్యార్థి నైతికత 2) విద్యార్థి ఉద్వేగాలు
3) విద్యార్థి పెరుగుదల 4) విద్యార్థి జ్ఞానం
6. {పజ్ఞా సృజనాత్మకతలకు సంబంధించి సరైనది కానిది?
1) {పజ్ఞ ఉన్న వ్యక్తులందరూ సృజనాత్మకంగా ఉండాలని లేదు.
2) సృజనాత్మకత గల వారందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది.
3) సృజనాత్మకంగా ఉండాలంటే ప్రజ్ఞ అవసరమే లేదు.
4) విభిన్న ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది.
7. వైయక్తిక భేదాలకనుగుణంగా బోధించే విద్యా ప్రణాళిక
1) ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య
2) విద్యార్థి కేంద్రీకృత విద్య
3) పాఠ్యగ్రంథ కేంద్రీకృత విద్య
4) పాఠశాల కేంద్రీకృత విద్య
8. {ఫాయిడ్ మనోలైంగిక వికాసం ప్రకారం సరికాని జత?
1) మౌఖిక దశ-శైశవ కాముకత నోటి ద్వారా తీరుతుంది.
2) శిశ్న దశ - ఎడిపస్ కాంప్లెక్స్
3) ఆసన దశ - ఎలక్ట్రా కాంప్లెక్స్
4) గుప్త దశ - తాదాత్మీకరణం
9. వినోద్‌కు మైదానానికి వెళ్లి ఆడుకోవాలని ఉంటుంది. అదే సమయంలో సైన్సు క్లాసు వినాలని ఉంటుంది. ఇది ఏ రకమైన సంఘర్షణ?
1) ఉపగమ - ఉపగమ 2) పరిహార- పరిహార
3) ఉపగమ - పరిహార 4) ద్వి ఉపగమ - పరిహార
10. ఈక్వల్లీ అప్పియరింగ్ ఇంటవల్ స్కేల్ ఈ అంశాన్ని మాపనం చేస్తుంది?
1) మూర్తిమత్వం 2) సహజ సామర్థ్యాలు
3) వైఖరులు 4) ప్రజ్ఞ
11. {పమాదాలు అనే విపత్తు సంభవించే దశ?
1) శైశవ దశ 2) పూర్వ బాల్య దశ
3) ఉత్తర బాల్య దశ 4) కౌమారం
12. ఒక విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు. అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు. ఆ పొగడ్తకు ప్రేరేపితమైన విద్యార్థి పదేపదే ఆ మంచి పనిని చేశాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం?
1) సంప్రదాయక 2) కార్యసాధక
3) యత్నదోష 4) అంతర్ దృష్టి
13. ఔౌఠ్ఛి అనే పదం చూసినప్పుడు జ్ఛుఠీ అనే అర్థరహిత పదాన్ని ప్రయోజ్యుడు జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆ ప్రక్రియనేమంటారు?
1) స్మృతి - విస్మృతి 2) ద్వంద్వ సంసర్గులు
3) గుర్తింపు 4) రెడిన్టెగ్రేటివ్ స్మృతి
14. ఉపాధ్యాయుడు.. విద్యార్థులకు వారి వయసుకు మించిన అంశాలను బోధించాడు. ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన నియమం?
1) సంసిద్ధతా నియమం 2) ఫలిత నియమం
3) అభ్యసన నియమం 4) పునర్బలన నియమం
15. బ్లాక్‌బోర్డ్ - చాక్‌పీస్, పుస్తకం - పెన్, విద్యార్థి - ఉపాధ్యాయుడు ఇటువంటి భావనలు ఒక దానివెంట ఒకటి వెంటనే తటస్థపడినప్పుడు అది థారన్‌డైక్ సిద్ధాంతంలో ఏ నియమం?
1) సాదృశ్య నియమం 2) సామీప్యతా నియమం
3) పాక్షిక చర్య నియమం 4) సంబంధిత నియమం
16. నేడు రవి ఉన్నత స్థాయిలో ఉండటానికి రేపు ఏ స్థాయిలో ఉండాలో నిన్ననే ఆలోచించుకుని ఉండడమే రవిలో కలిగిన ప్రేరణ?
1) భవిష్యత్ ప్రేరణ 2) బహిర్గత ప్రేరణ
3) సాధన ప్రేరణ 4) అంతర్గత ప్రేరణ
17. మాతృ భాషలో అభ్యసించిన విద్యార్థికి ఆంగ్ల భాష ఉచ్ఛారణలో అవరోధం కలిగితే?
1) అనుకూల బదలాయింపు
2) ప్రతికూల బదలాయింప
3) శూన్య బదలాయింపు 4)ద్విపార్శ్వ బదలాయింపు
18. మాస్లో ప్రకారం అవసరాలను ఆరోహణ క్రమంలో గుర్తించండి?
1) శారీరక రక్షణ, గుర్తింపు, ప్రేమ సంబంధిత,
ఆత్మ ప్రస్థావన
2) శారీరక, ప్రేమ సంబంధిత, రక్షణ, గుర్తింపు,
ఆత్మ ప్రస్థావన
3) శారీరక, రక్షణ, ప్రేమ సంబంధిత, గుర్తింపు,
ఆత్మ ప్రస్థావన
4) శారీరక, గుర్తింపు, రక్షణ, ప్రేమ సంబంధిత,
ఆత్మ ప్రస్థావన
19. విద్యార్థులు ఇంటర్‌నెట్ ద్వారా విషయ జ్ఞానం పొందడం దేని ఆధారంగా వివరించవచ్చు?
1) శాస్త్రీయ నిబంధనం 2) కార్యసాధక నిబంధనం
3) యత్నదోష అభ్యసనం 4)అంతర్‌దృష్టి అభ్యసనం
20. టైపు నేర్చుకున్న వ్యక్తి, కంప్యూటర్ కీబోర్డ్ సులువుగా నేర్చుకోవడం థారన్‌డైక్ గౌణ నియమాల్లో ఏ నియమం?
1) సామీప్యతా నియమం 2) సాదృశ్య నియమం
3) సంబంధిత నియమం
4) బహుళ ప్రతిస్పందన సూత్రం
21. జ్ఞానం నిర్మించాలి. అది సాంస్కృతిక, సాంఘిక పరిసరాల ద్వారా నిర్మించాలి అని పేర్కొంది?
1) వైగోట్ స్కీ 2) పియాజె
3) కొహలర్ 4) థారన్ డైక్
22. బోధన యంత్రాలను, కంప్యూటర్ విద్యను ప్రభావితం చేసిన అభ్యసన సిద్ధాంతం?
1) శాస్త్రీయ నిబంధనం 2) కార్యసాధన నిబంధనం
3) యత్నదోష అభ్యసనం
4) అంతర్‌దృష్టి అభ్యసనం
23. హెర్బర్ట్ సోపానాలలో సరైన క్రమం?
1) సన్నాహం, సంసర్గం, ప్రదర్శనం అన్వయం, సాధారణీకరణం, సింహావలోకనం
2) సన్నాహం ప్రదర్శనం, అన్వయం, సంసర్గం, సాధారణీకరణం, సింహావలోకనం
3) సన్నాహం ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, సింహావలోకనం, అన్వయం
4) సన్నాహం ప్రదర్శనం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, సింహావలోకనం
24. కిందివాటిలో అభ్యసన వైకల్యతకు సంబంధించి సరైన ప్రవచనం కానిది?
1) అగ్రాపియా - రాతపరమైన వైకల్యం
2) శ్రవణ వచోఘాతం -గణితపరమైన అసామర్థ్యం
3) అలెక్సియా - పఠన వైకల్యం
4) అఫేసియా - భాషణ - భాషా వైకల్యం
25. {పత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని చెప్పిన కమిటీ?
1) 1986 జాతీయ విద్యా విధానం
2) కొఠారి కమిషన్ 3) సెకండరీ విద్యా కమిషన్
4) యశ్‌పాల్ కమిటీ
26. శిశు కేంద్రీకృత విద్యా విధానాన్ని ప్రోత్సహించే విద్యా విధానం?
1) సహిత విద్య 2) సమగ్ర విద్య
3) ప్రత్యేక విద్య 4) విలీన విద్య
27. ఇతరుల మాటకు విలువనిచ్చే ఉపాధ్యాయుడు ఈ రకమైన నాయకత్వానికి చెందినవాడు?
1) సహ భాగి నాయకత్వం
2) నిర్దేశక నాయకత్వం 3) అనుజ్ఞ నాయకత్వం
4) సాధనోన్ముఖ నాయకత్వం
28. సహాయార్థికి సమస్యను పరిష్కరించుకునే ప్రజ్ఞ లేనప్పుడు ఈ రకమైన మంత్రణం అవసరం?
1) దార్శనిక మంత్రణం 2) అనిర్దేశక మంత్రణం
3) నిర్దేశక మంత్రణం 4) మిశ్రమ మంత్రణం
29. ఉత్తమ బోధన పద్ధతి అతి ముఖ్యమైన లక్షణం?
1) స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించాలి.
2) ఉపాధ్యాయుడు తేలికగా బోధించేందుకు అనువుగా ఉండాలి.
3) తరగతిలోనే విద్యార్థులు అభ్యసించగ లిగి ఉండాలి.
4) సిలబస్ సకాలంలో పూర్తి చేసేందుకు దోహదం చేయాలి.
30. రాజు అనే విద్యార్థి సమాధాన పత్రాన్ని నలుగురు ఉపాధ్యాయులు దిద్దినప్పటికీ ఆ విద్యార్థికి 50 మార్కులే వచ్చాయి. ఆ విద్యార్థికిచ్చిన ప్రశ్నపత్రానికున్న ల క్షణం?
1) వ్యక్తి నిష్టత 2) వస్తు నిష్టత
3) సప్రమాణత 4) విశ్వసనీయత
2. {పథమ భాష - తెలుగు (30 మార్కులు)
31-35: కింది అపరిచిత గద్యాన్ని చదివి 31 నుంచి 35 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించండి?
ఆంగ్ల ప్రభావం వల్ల ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక మార్పులు వచ్చాయి. వాటిలో చెప్పుకోదగ్గవి సంస్కరణలని మేధావులు, రచయితలు, విమర్శకులు గుర్తించారు. భారతదేశంలో మతం పేరుతో జరుగుతున్న అరాచకాల్ని, మూఢ విశ్వాసాల్ని, కర్మకాండల్ని, అగ్ర వర్ణాల ఆధిపత్యాన్ని తీవ్రంగా నిరసిస్తూ భక్తి ఉద్యమం వచ్చింది. ఈ ఉద్యమం మానవతావాదాన్ని ప్రబోధించింది. ఇది సంస్కరణ ఉద్యమంలో భాగమే. శివ కవులు మతం ఆధారంగానే కొంతవరకు సంస్కరణకు ప్రయత్నించారు. ఆ తర్వాత అన్నమయ్య, రామదాసు, వేమన, పోతులూరి వీరబ్రహ్మం లాంటివారు సంస్కరణ భావజాలాన్ని ప్రచారం చేశారు.
పాశ్చాత్య విద్య వల్ల ఈ ఉద్యమం కార్యరూపం ధరించింది. రాజారామ్‌మోహన్‌రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, వివేకానందుడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం వంటివారు సంస్కరణ ఉద్యమానికి సారధ్యం వహించారు. బీఆర్ అంబేద్కర్, ఇ.వినాయకర్, గోరా వంటి వారి పాత్ర ఈ ఉద్యమంలో ప్రముఖమైంది. మధ్యయుగాల నాటి భక్తి ఉద్యమం, వేమనలాంటి కవుల సంస్కరణ భావజాలం తెలుగు సాహిత్యానికి సంఘ సంస్కరణ పూర్వ రంగాన్ని కలుగజేశాయి.
31. ఆధునిక తెలుగు సాహిత్యంలో అనేక మార్పులు దేని ప్రభావం వల్ల జరిగాయి?
1) సంస్కృత ప్రభావం 2) ఆంగ్ల ప్రభావం
3) హిందీ ప్రభావం 4) ఉర్దూ ప్రభావం
32. భక్తి ఉద్యమ ఆవిర్భావానికి కారణం?
1) మూఢ నమ్మకాల నిరసన
2) కర్మకాండల నిరసన
3) అగ్ర వర్ణాల ఆధిపత్య నిరసన 4) పైవన్నీ
33. భక్తి ఉద్యమం దేన్ని ప్రబోధించింది?
1) అహింసావాదాన్ని 2) మానవతావాదాన్ని
3) మూఢ నమ్మకాల్ని 4) కర్మ కాండల్ని
34. సంస్కరణ ఉద్యమానికి సారధ్యం వహించినవారు?
1) రాజారామ్‌మోహన్‌రాయ్
2) రఘుపతి వెంకటరత్నం నాయుడు
3) వివేకానందుడు 4) పైవారందరూ
35. తెలుగు సాహిత్యానికి సంఘసంస్కరణ పూర్వ రంగం కలిగించినవారు?
1) శివ కవులు 2) కందుకూరి వీరేశలింగం
3) వేమన 4) బీఆర్ అంబేద్కర్
36 నుంచి 40 ప్రశ్నలకు కింది పద్యాన్ని చదివి సమాధానాలు గుర్తించండి?
దానము చేయగోరిన వదాన్యున కీయగ శక్తి లేనిచో
నైన పరోపకారమునకై ఒక దిక్కున తెచ్చియైన యీ
బూనును మేఘుడంబుధికి పోయి జలంబుల తెచ్చి యీయడే
వాన, సమస్త జీవులకు వాంఛితమింపెసలార! భాస్కరా!
36. ఈ పద్య రచయిత?
1) బద్దెన 2) మారయ వెంకయ్య
3) కంచర్ల గోపన్న 4) ఏనుగు లక్ష్మణ కవి
37. వదాన్యుడు పదానికి అర్థం?
1) వక్త 2) లోభి 3) దాత 4) పిరికిపంద
38. ‘మేఘుడంబుధి’ పదాన్ని విడదీసి రాస్తే
1) మేఘుడు + అంబుధి 2) మేఘుడ + అంబుధి
3) మేఘుడౌ + అంబుధి 4) మేఘుడై + అంబుధి
39. ఈ పద్యంలో ఛందస్సు?
1) మత్తేభం 2) శార్దూలం
3) ఉత్పలమాల 4) చంపకమాల
40. శక్తి లేకున్నా పరోపకారంతో దానం చేసే గుణానికి కవి చెప్పిన దృష్టాంతం?
1) సముద్రుడు వానను కురిపించడం
2) మేఘుడు వాన కురిపించడం
3) మేఘుడు సముద్రుని యాచించి జలాలు తెచ్చి వాన కురిపించడం
4) మేఘుడు చింతించడం
41. గురజాడ పూర్ణమ్మ, దిద్దుబాటు ఏ ప్రక్రియలకు చెందిన రచనలు?
1) కావ్యం - నాటకం 2) గేయం - కథానిక
3) కథానిక - నవల 4) నాటిక - కథానిక
42. ‘ముక్కంటి’ ఏ సమాసం?
1) ద్విగువు 2) విశేషణ పూర్వపద కర్మధారయం
3) రూపకం 4) బహువ్రీహి
43. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, చాలామందికి పారతంత్య్రం పోలేదు’ అనే వాక్యంలో అసమాపక క్రియ?
1) శత్రర్థక క్రియ 2) కర్త్రర్థక క్రియ
3) అనంతర్యార్థక క్రియ 4) అప్యర్థక క్రియ
44. ‘ఉభయకవి మిత్రుడు’ అనే బిరుదున్న కవి ఎవరు?
1) నన్నయ 2) తిక్కన 3) ఎర్రన 4) శ్రీనాథుడు
45. ‘ఈ రోజు వాన కురిసింది’- ఇది ఏ వాక్యం?
1) సంభావనార్థక వాక్యం 2) సంశయాత్మక వాక్యం
3) నిశ్చయార్థక వాక్యం 4) ఆశ్చర్యార్థక వాక్యం
46. ‘కృష్ణ తన పనేదో తాను చేసుకుంటానన్నాడు’ అనేది ఏ వాక్యం?
1) ప్రత్యక్ష వాక్యం 2) పరోక్ష వాక్యం
3) కర్మణి వాక్యం 4) క్రియా రహిత వాక్యం
47. వర్ణమాల ప్రకారం వీటిలో సరైన క్రమం?
1) బ, ఫ, భ, ప, మ 2) ప, భ, బ, ఫ, మ
3) ప, ఫ, బ, భ, మ 4) ఫ, ప, భ, బ, మ
48. హిరణ్యకా! కొనియాడదగినవాడవుగదా! నేను నీతో సఖ్యము గోరి వచ్చితిని అనే వాక్యానికి ఆధునిక భాషా రూపం?
1) హిరణ్యకా! కొని ఆడేవాడివిగదా!
నీతో సఖ్యం కోసం వచ్చాను.
2) హిరణ్యకా! మెచ్చుకోదగ్గవాడివిగదా!
నేను నీతో స్నేహం కోసం వచ్చాను.
3) హిరణ్యకా! కొన్ని ఆటలాడేందుకు
నీ స్నేహం కోసం వచ్చాను.
4) హిరణ్యకా! మెచ్చుకోదగ్గ
నీ స్నేహం కోసం వచ్చాను.
49. వీటిలో కర్త్రర్థక వాక్యం?
1) కాళిదాసుచే మేఘ సందేశం రచింపబడింది.
2) మేఘ సందేశం కాళిదాసు విరచితం
3) కాళిదాసు మేఘ సందేశం రచించాడు.
4) మేఘ సందేశం కాళిదాసు కృతం
50. వీటిలో అర్థోత్కర్ష జరిగిన పదం?
1) ఛాందసుడు 2) సభికులు
3) చెంబు 4) సూది
51. ధనుస్సు అనే మాటకు పర్యాయపదాలు?
1) కోదండం- శరాసనం - పుప్పొడి
2) విల్లు - అమ్ము - వల్లరి
3) చాపం - కార్ముకం - సింగిణి
4) కార్ముకం - వల్లరి - లత
52. కప్ప అనే పదానికి పర్యాయపదం కానిది?
1) దర్దురం 2) భీకం 3) బంధురం 4) మండూకం
53. విరియాల కామసాని గూడూరు శాసనంలో వృత్తాలు?
1) మూడు ఉత్పలమాలలు - రెండు మత్తేభాలు
2) మూడు చంపకమాలలు- రెండు ఉత్పలమాలలు
3) మూడు శార్దూలాలు - రెండు చంపకమాలలు
4) రెండు చంపకమాలలు- మూడు ఉత్పలమాలలు
54. ‘అక్కాచెల్లెళ్లు ఏడుస్తారు, అయితే దగ్గరకు చేరలేరు’ ఈ పొడపు కథకు అర్థం?
1) కాళ్లు 2) చేతులు 3) కళ్లు 4) చెవులు
55. భారతదేశంలో త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1956 2) 1966 3) 1974 4) 1981
56. అధికార భాషా సంఘం తొలి అధ్యక్షులు?
1) శ్రీమతి టి.అనసూయమ్మ 2) సి.నారాయణరెడ్డి
3) శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య
4) శ్రీమతి పి.యశోదారెడ్డి
57. మాక్స్‌ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం?
1) పూపూ వాదం 2) భౌభౌ వాదం
3) డింగ్ - డాంగ్ వాదం 4) ధ్వన్యనుకరణవాదం
58. గద్య బోధనలో ప్రయోజనకరమైన పద్ధతి?
1) ప్రశ్నోత్తర పద్ధతి 2) చర్చా పద్ధతి
3) ఉదాహరణ పద్ధతి 4) ఉపన్యాస పద్ధతి
59. సాంకేతిక ఉపకరణాలను ఉపయోగించే సందర్భంలో ఉపయోగించే ఉపకరణాలు?
1) తోలుబొమ్మలు 2) వ్యంగ్య చిత్రాలు
3) కృత్రిమ యంత్రాలు 4) ప్రొజెక్టర్లు
60. విద్యార్థి అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగపడే మూల్యాంకనం?
1) నిరంతర మూల్యాంకనం
2) నిర్మాణాత్మక మూల్యాంకనం
3) సమగ్ర మూల్యాంకనం
4) నికష మూల్యాంకనం
3. Second Language English (30 Marks)
61. "Our class consists of twenty pupils."
(Choose the collective noun from the given sentence.)
1) pupils 2) our 3) class 4) twenty
62. The teacher said, "The Sun rises in the East." (Change the given sentence into indirect speech.)
1) The teacher said that the sun rised in the east.
2) The teacher said that the sun rises in the east.
3) The teacher said that the had rised in the east
4) The teacher said that the sun had been rising in the east.
63. Choose the correct Direct speech of the given sentence.
"Sita said that her brother had been writing a story."
1) Sita said, "Brother had writing a story."
2) Sita said, "My brother is writing a story."
3) Sita said, "Her brother was writing a story."
4) Sita said, "My brother was writing a story."
64. They had enhanced the honour of the village. (Change the given sentence into passive voice.)
1) The honour of the village had been enhanced by them.
2) The honour of the village had enhanced by them.
3) They enhanced the village honour.
4) They had been enhancing the honour of the village
65. All this will not have forgotten by you by tomorrow." (Choose the correct active voice of the given sentence.)
1) You will have forgotten by tomorrow by all this.
2) You will not have forgotten all this by tomorrow.
3) You will not have by tomorrow forgotten all this.
4) You will not have been forgotten all this by tomorrow.
66. I loved her. (Supply a question tag)
1) don't I 2) do I 3) didn't I 4) did I
67. She is ………….. un tidy girl.
(Choose the correct article)
1) a 2) an 3) the 4) no article
68. Do not cry …………….. spilt milk.
(Choose the correct preposition)
1) over 2) on 3) from 4) after
69. "Will you walk …………. my parlour?", said beautician.
1) through 2) in 3) to 4) into
70. "He writes a novel." (Convert the given sentence into past perfect tense.)
1) He wrote a novel.
2) He was writing a novel
3) He had written a novel4) He had been writing a novel
71. She will have ………….. the glasses.
1) break 2) broke 3) broken 4) breaking
72. America is one of the richest countries in the world.
(Choose the positive degree of the given sentence.)
1) America is one of the richest countries in the world.
2) Very few countries in the world are as rich as America.
3) America is richer than any other countries in the world.
4) No other countries in the world as richest as America.
73. She bought a saree which was very costly.
(Choose the correct simple sentence of the given sentence.)
1) She bought a very costly saree.
2) The saree she bought was very costly.
3) She bought a saree and it is costly.
4) The saree she bought is very costly
74. Material (Choose the correct antonym.)
1) aerial 2) watery
3) hollow 4) spiritual
75. Magnify (Choose the correct synonym)
1) exaggerage 2) glorify
3) 1 & 2 4) Electrify
76. Rama is sick. He cannot come to school.
(Combine to form a compound sentence.)
1) Rama is sick and he cannot come to school.
2) Rama can come to school if he is not sick.
3) Rama is sick and not come to school.
4) Rama is sick so he absent to school.
77. Thieves ……………………. his house.
(Choose the correct phrase.)
1) break down 2) break up
3) broke into 4) broke to
78. Choose the suitable subscription for business letters.
1) Yours affectionately
2) Yours faithfully
3) Yours lovingly 4) Yours sincerely
79. Sensational news ……….. important for T.V. Channels.
1) are 2) is 3) have 4) will
80-84. Read the following passage carefully and answer the following questions.
Bees can talk! They don't use words, of course. They explain all this by means of a dance. When a bee finds food, it flies pell-mell back to its hive. The stay-at-homes crowd round it. Then it starts its dance. The food might be quite close-less than a hundred yards away. If so, the bee will dance in a circle. What if the food is farther away? In that case, the bee does a figure-eight step. During part of this last dance, it wags its tail. The other bees watch with care. The scout bee is telling them which way to go. They must fly in the same direction it runs when it wags its tail in the dance. Sounds are part of the dance too. The dancing bee makes a noise like this "thiththrrr". When the other bees hear this, they make a "beep" sound. This means, "We understand". Then they fly off to find the food.
80. What does a bee do when it finds food?
1) eats the food 2) flies back to its hive
3) dance for a long time
4) makes 'beep' sound
81. The code of "We understand" in the passage is ………………….
1) a figure eight step 2) thiththrr
3) beep 4) dance in a circle
82. Bees follow the scout bee's ……………. to know the direction of the food.
1) wings 2) sound 3) circles 4) tail
83. How can bees talk?
1) like ants 2) by means of dance
3) by showing signals
4) by touching their parts
84. Bee's dance in a circle means …………..
1) Food is more than 1000 yards away.
2) Food is not available within 100 yards
3) Food is greater than 100 yards away.
4) Food is less than 100 yards away.
85. The stress mark on 'record' when used as a verb is ………
1) 'record 2) re'cord
3) recor'd 4) 'recor'd
86. What is wrong in case of English subject?
1) It is a content based subject
2) It comes through habit formation only
3) It is a skill based subject.
4) Achieving LSRW abilities is important
87. As per RTE & NCF government introduced CCE. CCE means …………
1) Co-Curricular Education
2)Classification and Control in Evaluation
3) Continuous Comprehensive Evaluation
4) Coordinating Computer Education
88. Micro teaching is started at ……………..
1) Columbia University
2) Leipzig University
3) Stanford University
4) Cambridge University
89. The earliest theories of learning a language were put forth by ……………..
1) structuralists 2) behaviourists
3) gestalists 4) pragmatists
90. The oldest method of teaching English is ?
1) Communicative approach
2) Structural approach 3) Direct method
4) Grammar translation method
4. మ్యాథమెటిక్స్ (30 మార్కులు)
91. అంకమూలం 7గా గల సంఖ్య చిచిచి
1) 223 2) 304 3) 727 4) పైవన్నీ
92. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5, ఆ రెండు సంఖ్యలకు 10 కలిపితే వాటి నిష్పత్తి 5:7 అయితే ఆ సంఖ్యల మధ్య తేడాచిచిచి
1) 15, 25 2) 40 3) 10 4) 12
93. ఒక పేజీ చదవడానికి లతకు 41/2 ని॥పట్టింది. ఆమె 36 నిమిషాలలో చిచిచి పేజీలు చదవగలదు.
1) 5 2) 7 3) 8 4) 9
94. కిందివాటిలో ఏది నిజం?
1) ఒక సమతలం, అంతరాళ ఉపసమితి
2) ఒకే తొలి బిందువు గల రెండు కిరణాల సమ్మేళనాన్ని కోణం అంటారు
3) రెండు పూరక కోణాల కొలతలు సమానమైన, ప్రతికోణం కొలత 450
4) పైవన్నీ
95. కిందివాటిలో ఏది నిజం?
1) 1 చదరపు డెకామీటర్ వైశాల్యాన్ని ఏర్ అంటారు.
2) 1 హెక్టారు = 100 ఏర్‌లు
3) 100 హెక్టార్లు = 1 చ.కి.మీ
4) పైవన్నీ
96. ఒక వృత్తాన్ని కొన్ని సెక్టార్లుగా విభజిస్తే ఏర్పడే చిత్రాన్నిచిచిచి అంటారు.
1) పిక్టోగ్రామ్స్ 2) హిస్టోగ్రామ్
3) వృత్తరేఖా చిత్రం 4) పైవన్నీ
97. ఒక గంట 5 సెకనులకొకసారి, రెండోది 6 సెకన్లకు, మూడోది 8 సెకన్లకు ఒకసారి మోగుతుంది. అవి అన్నీ ఒకేసారిగా ఉదయం 8 గంటలప్పుడు మోగితే మళ్లీ ఏ సమయంలో మోగుతాయి.
1) 10 గంటలకు 2) 8 గంటల 2 నిమిషాలకు
3) 8 గంటల 12 సెకన్లకు
4) ఏదీకాదు
98. కిందివాటిలో ఏది నిజం?
1) రెండు అకరణీయ సంఖ్యల మధ్య పరిమిత అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ఈ ధర్మాన్ని సాంద్రత ధర్మం అంటారు.
2) అనేది మిశ్రమ ఆవర్తిత దశాంశ భిన్నం
3) అవధి 23 4) ఏదీకాదు
99. ఒక సైనిక శిబిరంలో 120 మంది సైనికులకు 8 వారాలకు సరిపడే ఆహార పదార్థాలు ఉన్నాయి. 3 వారాల తర్వాత అదనంగా 30 మంది సైనికులు శిబిరానికి వచ్చారు. ఉన్న ఆహార పదార్థాలు చిచిచి వారాలకు సరిపోతాయి.
1) 2 2) 3 3) 4 4) 5
100. కిందివాటిలో ఏది నిజం?
1) ఒక రేఖా ఖండానికి ఒక సౌష్టవాక్షం ఉంటుంది.
2) ఒక రేఖ అనంత సౌష్టవాక్షాలను కలిగి ఉంటుంది.
3) వృత్తం అనంత సౌష్టవాక్షాలను కలిగి ఉంటుంది
4) పైవన్నీ
101. ఒక దీర్ఘ ఘనం ఘన పరిమాణం 720 ఘ॥దాని పొడవు, వెడల్పులు వరుసగా 12 సెం.మీ, 10 సెం.మీ. అయితే దాని ఎత్తు?
1) 6 సెం.మీ 2) 7 సెం.మీ
3) 8 సెం.మీ 4) 9 సెం.మీ
102. ఒక విద్యార్థికి ఆంగ్లంలో 40 శాతం, గణితంలో 70 శాతం, విజ్ఞాన శాస్త్రంలో 50 శాతం, సాంఘిక శాస్త్రంలో 20 శాతం మార్కులు వచ్చాయి. ఈ దత్తాంశాన్ని చూపే వృత్తాకార రేఖాచిత్రంలో గణితం మార్కులను చూపే సెక్టారు కోణం?
1) 140ని 2) 70ని 3) 100ని 4) 40ని
103. దశాంశ సంఖ్యామానంలో 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి?
1) 1000 2) 999 3) 990 4) 900
104. 2030 నుంచి ఏ కనీస ధన సంఖ్యను తీసిన అది సంపూర్ణ వర్గం అవుతుంది?
1) 5 2) 6 3) 7 4)8
105. ఒక దీర్ఘ చతురస్రాకారపు మైదానం పొడవు 4 మీ, వెడల్పు 3 మీ. దాని పొడవును 2 మీ., వెడల్పును 1మీ. పెంచితే మైదానం వైశాల్యంచిచిచిశాతం పెరుగుతుంది.
1) 40% 2) 50% 3) 75% 4) 100%
106. 5 గంటలప్పుడు గడియారపు ముళ్ల మధ్య కోణం కొలత?
1) 100ని 2) 120ని 3) 150ని 4) 180ని
107. ఒక చతురస్రం చుట్టుకొలత 280మీ. దాని వైశాల్యం చిచిచి హెక్టార్లు?
1) 4,900 2) 490 3) 49 4) 0.49
108. ఒక సంస్థ వివిధ పద్దుల కింద చేసే ఖర్చును సూచించడానికి ఉపయోగించే చిత్రం?
1) పట చిత్రం 2) దిమ్మ చిత్రం
3) వృత్త రేఖాచిత్రం 4) పైవన్నీ
109. ఒక తరగతిలో నలుగురు బాలుర మొత్తం మార్కులు 262. ముగ్గురు బాలుర మొత్తం మార్కులు 175. ఐదుగురు బాలికల మొత్తం మార్కులు 235. ఆ 12 మంది విద్యార్థుల సరాసరి మార్కులు చిచిచి
1) 56 2) 86 3) 49 4) 64
110. ఒకరు రెండు పుస్తకాలను ఒక్కొక్కటి *50లకు అమ్మాడు. మొదటి పుస్తకంపై 20 శాతం లాభం, రెండో పుస్తకంపై 20 శాతం నష్టం వచ్చింది. మొత్తం మీద లాభమా, నష్టమా, ఎంత శాతం?
1) లాభనష్టాలు ఉండవు 2) 4 శాతం లాభం
3) 4 శాతం నష్టం 4) ఏదీకాదు
111. అంతం కాని, ఆవర్తితం కాని దశాంశ భిన్నాలను చిచిచి సంఖ్యలు అంటారు?
1) పూర్ణ సంఖ్యలు 2) సహజ సంఖ్యలు
3) అకరణీయ సంఖ్యలు 4) కరణీయ సంఖ్యలు
112. ఒక త్రిభుజం రెండు భుజాల పొడవులు 6 సెం.మీ., 11సెం.మీ., కిందివాటిలో ఏది మూడో భుజం పొడవు?
1) 2 సెం.మీ 2) 3 సెం.మీ
3) 4 సెం.మీ 4) 7 సెం.మీ
114. ఒక స్కోరు పెన్నుల ఖరీదు రూ.240. ఒక డజను పెన్నుల ఖరీదు చిచిచి
1) రూ.144 2) రూ. 120 3)రూ.60 4) రూ. 180
115. అంక, బీజ, రేఖాగణితాలను సమీకృతం చేయడానికి ‘సమితి భాష’ వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చింది?
1) ఈశ్వరీభాయి కమిషన్ 2) సైమన్ కమిషన్
3) కొఠారీ కమిషన్ 4) జాతీయ విద్యా విధానం
116. ఒక విద్యార్థి సమితి అ= (2,3,6,7) అని రాశాడు. అతనిలో లోపించిన లక్ష్యం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
117. జ్ఞాన, మానసిక, చలనాత్మక రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ బోధన జరిపే పద్ధతి?
1) ప్రకల్పన 2) అన్వేషణ
3) ప్రయోగశాల 4) విశ్లేషణ
118. ప్రతిభావంతులైన విద్యార్థులకు బోధనలో అనుసరించాల్సిన పద్ధతులు?
1) ఆగమన, నిగమన 2) విశ్లేషణ, సంశ్లేషణ
3) అన్వేషణ, విశ్లేషణ 4) ప్రయోగశాల
119. సమతల జ్యామితిలోని ఏ అంశాన్నయినా సరే బోధించడానికి ఉపయోగపడేది?
1) జియోబోర్డు 2) గ్రిడ్ పేపరు
3) నల్లబల్ల 4) పెగ్ బోర్డు
120. సహపాఠ్య కార్యక్రమాలు, ఆటపాటలు ఉపన్యాసాలు మొ॥జరిగే ప్రదేశం?
1) గణిత గ్రంథాలయం 2) గణిత పాఠశాల
3) గణిత క్లబ్బు 4) పైవ న్నీ
5. ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్ (30 మార్కులు)
121. కిందివాటిలో తప్పుగా జతపర్చబడినది ఏది?
1) స్వతంత్ర నాడీ వ్యవస్థ - అసంకల్పిత చర్యల నియంత్రణ
2) పరిధీయ నాడీ వ్యవస్థ - మెదడు ఆదేశాల చేరవేత
3) మెడుల్లా అబ్లాంగేటా - శ్వాస, హృదయ స్పందన నియంత్రణ
4) అనుమస్తిష్కం - ఆలోచనను, వినడాన్ని, మాట్లాడడాన్ని నియంత్రణ
122. కిందివాటిని పరిశీలించండి?
ఎ) కళ్లలో దుమ్ము, ధూళి పడినప్పుడు కన్నును నలపకుండా చల్లని శుభ్రమైన నీటితో కడగాలి.
బి) దంతాలను శుభ్రం చేయడానికి వేప పుల్ల, గానుగ పుల్లలను వాడకుండా బ్రష్ మాత్రమే వాడాలి.
సి) గాయాన్ని శుభ్రం చేయడానికి స్పిరిట్, డెట్టాల్ అందుబాటులో లేనప్పుడు ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేసి, అయోడిన్ పూయాలి.
డి) మూత్ర పిండ్రాలు చిక్కుడు గింజల ఆకారంలో ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
పై వాటిలో సరైన వాటిని గుర్తించండి?
1) ఎ, సి 2) బి, డి 3) ఎ, బి, డి 4) పైవన్నీ
124. జెస్సీ ఓవెన్స్.. లజ్‌లాంగ్‌కు ఎందుకు కృతజ్ఞతాభివందనాలు తెలిపాడు?
1) నల్లజాతివాడినని కూడా చూడకుండా తనలో స్ఫూర్తి నింపినందుకు
2) హిట్లర్‌కు కూడా భయపడకుండా తనను ప్రోత్సహించినందుకు
3) ఆటలో ప్రత్యర్థి అయినప్పటికీ తన భుజం తట్టి, తన గెలుపుకు కావాల్సిన ధైర్యం ఇచ్చినందుకు
4) తాను ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెలవడానికి అతను చేసిన త్యాగానికి గుర్తుగా
125. వీటిలో ‘సర్వభక్షకి’
1) తొండ 2) కోడి 3) బల్లి 4) సాలెపురుగు
126. పత్రం విధికానిది?
1) శాఖీయోత్పత్తికి తోడ్పడుతుంది.
2) చెరకు, ఉల్లిలాంటి మొక్కల్లో పత్రం ఆహారాన్ని నిల్వ చేస్తుంది.
3) బాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీరు, లవణాల రవాణాను క్రమబద్ధీకరిస్తుంది.
4) ఆక్సిజన్, కార్బన్ డై ఆక్సైడ్ వాయువుల వినిమయాన్ని క్రమబద్ధీకరిస్తుంది.
127. వైరస్ వల్ల వచ్చే ట్రిస్టిజ అనే వ్యాధి వేటికి వస్తుంది?
1) పాడి పశువులు 2) గొర్రెలు
3) నిమ్మ, కొబ్బరి 4) చీనీ, బత్తాయి
128. నిర్జలీకరణ ప్రక్రియ దేనిలో ఉపయోగపడుతుంది?
1) కూరగాయలను వరుగులుగా నిల్వ చేయడం
2) కూరగాయలను ఊరగాయలుగా నిల్వ చేయడం
3) పండ్లను రసాలుగా నిల్వ చేయడం
4) పండ్లను జామ్‌గా నిల్వ చేయడం
129. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ రోజు నుంచి అమలు చేస్తున్నారు?
1) జూన్ 12, 2002 2) సెప్టెంబర్ 5, 2002
3) జనవరి 2, 2003 4) నవంబర్ 14, 2003
130. నిటారుగా నుంచుని ఒక వ్యక్తి అయస్కాంత దిక్సూచిని పట్టుకున్నాడు. దానిలోని ఎర్రని రంగు గల సూచీ అతని వైపే చూపిస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏ దిక్కుకు అభిముఖంగా నిల్చున్నాడని చెప్పొచ్చు?
1) తూర్పు 2) పశ్చిమ 3) దక్షిణం 4) ఉత్తరం
131. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కింది వాయువులను ప్రమాదకరమైనవిగా గుర్తించింది?
1) కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్
2) సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ డై ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్
3) కాల్షియం కార్బొనేట్, సల్ఫర్ ట్రై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్
4) సల్ఫర్ డై పాస్ఫేట్, అమ్మోనియం సల్ఫైడ్, క్లోరో ఫ్లోరో కార్బన్స్
132. ‘జలుబు’ వ్యాధికారకం?
1) రినో వైరస్ 2) వెరిసెల్లా వైరస్
3) ఆర్థోమిక్సో వైరస్ 4) పారా వైరస్
133. భూమి తన చుట్టు తాను తిరగడానికి పట్టే కాలం?
1) 23 గంటల 56 నిమిషాల 6 సెకన్లు
2) 23 గంటల 56 నిమిషాల 8.05 సెకన్లు
3) 23 గంటల 56 నిమిషాల 7 సెకన్లు
4) 23 గంటల 56 నిమిషాల 4.09 సెకన్లు
134. రేఖాంశాలను మధ్యాహ్న రేఖలని ఎందుకంటారు?
1) సూర్యుడి వెలుతురు వల్ల భూగోళంపై రేఖాంశాలు మధ్యాహ్నం స్పష్టంగా కనపడడం వల్ల
2) సూర్యుడికి ఎదురుగా వచ్చే రేఖాంశం పోయే ప్రాంతంలో మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలు అవుతుండటం వల్ల
3) సూర్యుడికి ఎదురుగా వచ్చే రేఖాంశంపై ఉన్న ప్రాంతంలో మధ్యాహ్నం అధికంగా ఉండటం వల్ల
4) భూమిపై నిర్ధారించిన రేఖాంశం ప్రాంతంలో సూర్యుడి ప్రభావం మధ్యాహ్నం ఎక్కువగా ఉండటం వల్ల
135. భారతదేశాన్ని‘ఉప ఖండం’ అని ఎందుకు పిలుస్తారు?
1) దేశ జనాభా అధికంగా ఉండటం, ప్రత్యేకమైన శీతోష్ణస్థితులు ఉండటం వల్ల
2) విభిన్న జాతులతో, మతాలతో, భాషలతో, సంస్కృతులతో, కులాలతో నిండి ఉండటం వల్ల
3) ఖండానికి ఉండే ల క్షణాలను కలిగి ఉండి, పరిమాణంలో చిన్నవిగా ఉండటం వల్ల
4) ఆసియా ఖండం పెద్దగా ఉండటం వల్ల, భారత్ చుట్టుపక్కల ప్రాంతాలతో ఉమ్మడిగా ఉండటం వల్ల భారతదేశాన్ని ఉప ఖండం అని అంటారు.
136. నల్లరేగడి నేలలు ఈ రాష్ట్రాలలో బాగా ఉన్నాయి?
1) మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక
2) ఉత్తర ప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్
3) మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్
4) తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్
137. మన జాతీయ జెండాలోని కాషాయ వర్ణం త్యాగానికి, తెలుగు రంగు పవిత్రతకు, ఆకుపచ్చ రంగు సంపదకు, చక్రం అభివృద్ధికి సంకేతాలని అభిప్రాయపడినవారు?
1) గాంధీ 2) పింగళి వెంకయ్య
3) నెహ్రూ 4) రాధాకృష్ణన్
138.‘బాలకార్మికుల హక్కు’ఏ ప్రాథమిక హక్కులో భాగం?
1) సమానత్వపు హక్కు 2) స్వాతంత్య్రపు హక్కు
3) పీడనాన్ని నిరోధించే హక్కు
4) రాజ్యాంగ పరిహార హక్కు
139. ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యాలలో లేనిది?
1) {పపంచంలో మూడో ప్రపంచ యుద్ధం రాకుండా నిబంధనలు రూపొందించడం
2) దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించడం
3) {పపంచ ప్రజలందరికీ మానవ హక్కులను కల్పించడానికి చర్యలు చేపట్టడం
4) {పపంచ దేశాలలో సాంఘిక, సాంస్కృతిక ఆర్థికాభివృద్ధి సాధించడానికి కృషి చేయడం
140. మన రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’కు సంబంధించి సరైనవి?
ఎ) ధైర్యం ఉన్న పక్షి
బి) దట్టమైన అడవులలోకైనా నేరుగా ఎగురుతూ వెళ్తుంది
సి) గాలిలోకి నేరుగా పైకి దూసుకెళ్లలేకపోయినా, చిన్నగా ఎగురుతూ ఆకాశంలో విహరిస్తుంది.
డి) దీనిని నీలకంఠ అని కూడా పిలుస్తారు.
1) ఎ, సి 2) బి, డి 3) ఎ, డి 4) బి, సి
141. కిందివాటిలో గ్రామ పంచాయితీ విధి కానిది?
1) గ్రామంలో రహదారులు నిర్మించడం
2) గ్రామీణ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం
3) గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం
4) పాఠశాలకు కావలసిన వసతులను సమకూర్చడం
142. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులలో ఉన్న వ్యక్తులు విధులను నిర్వర్తించలేని స్థితిలో ఎవరు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యహరిస్తారు?
1) ప్రధానమంత్రి 2) సీనియర్ గవర్నర్
3) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
4) లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్
143. మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో ‘రాజ్యం’ అవతరించింది?
1) సింధు నాగరికత 2) ఆర్య నాగరిక త
3) మగధ వంశం 4) సింధు ప్రజల పూర్వీకులు
144. కిందివాటిని అవి జరిగిన కాలాన్ని బట్టి ఆరోహణ క్రమంలో అమర్చండి?
ఎ) చంపారన్ సత్యాగ్రహం; బి) సహాయ నిరాకరణోద్యమం; సి) హోమ్‌రూల్ ఉద్యమం; డి) ఉప్పు సత్యాగ్రహం; ఈ) వందేమాతర ఉద్యమం
1) ఈ, సి, ఎ, బి, డి 2) ఎ, సి, ఈ, డి, బి
3) సి, డి, ఎ, ఈ, బి 4) బి, ఈ, డి, సి, ఎ
145. ప్రాథమిక స్థాయి పాఠ్య ప్రణాళికలో పరిసరాల విజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలని సూచించినవారు?
1) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
2) కొఠారీ కమిషన్ 3) రాధాకృష్ణన్ కమిటీ
4) సెకండరీ విద్యా కమిషన్
146. విద్యార్థులు, మొక్కలు, జంతువుల మధ్య పోలికలను ఉదాహరణలతో సహా వివరించారు. దీని ద్వారా వారు సాధించిన లక్ష్యం?
1) జ్ఞానం 2) అవగాహన
3) వినియోగం 4) నైపుణ్యం
147. కిందివాటిలో మంచి బోధన పద్ధతి లక్ష్యం కానిది?
ఎ) విద్యార్థి స్వీయ అభ్యసనకు అవకాశం కల్పించేదిగా ఉండకూడదు.
బి) ఉపాధ్యాయుడు విద్యార్థుల అభ్యసనాశక్తికి అనుకూలంగా తన బోధన విధానాలు మార్చుకోవడానికి దోహదపడాలి.
సి) తక్కువ సమయంలో లక్ష్యసాధన జరగడానికి వీలుగా ఉండరాదు.
డి) విద్యార్థుల్లో సృజనాత్మకతను వ్యక్తపరచడానికి ఆటంకంగా ఉండకూడదు.
1) ఎ, బి 2) బి, సి 3) సి, డి 4) ఎ, సి
148. సులువుగా తయారుచేయడానికి వీలైన గ్రాఫ్?
1) బార్ గ్రాఫ్ 2) వలయ గ్రాఫ్
3) సచిత్ర గ్రాఫ్ 4) రేఖా చిత్ర గ్రాఫ్
149. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానాల్లో ‘మదింపు’ కు సంబంధించని అంశం?
1) అభ్యసనం కోసం మదింపు
2) అభ్యసనం యొక్క మదింపు
3) అభ్యసనంపై మదింపు
4) అభ్యసనంతోపాటు మదింపు.
150. మంచి టీచర్‌కు ఉండకూడని కార్య నిర్వర్తణ సామర్థం?
1) అనుసరణీయత 2) దివ్యదృష్టి
3) నిర్దేశన 4) ఉపాయశీలత్వం
సమాధానాలు
1) 3; 2) 3; 3) 2; 4) 3; 5) 3; 6) 3; 7) 2; 8) 3; 9) 1; 10) 3; 11) 2; 12) 2; 13) 2; 14) 1; 15) 2; 16) 3; 17) 2; 18) 3; 19) 2; 20) 2; 21) 1; 22) 2; 23) 3; 24) 2; 25) 2;
26) 1; 27) 1; 28) 3; 29) 2; 30) 2; 31) 2; 32) 4; 33) 2; 34) 4; 35) 3; 36) 2; 37) 3; 38) 1; 39) 3; 40) 3; 41) 2; 42) 4; 43) 4; 44) 2; 45) 3; 46) 2; 47) 3; 48) 2; 49) 3; 50) 2; 51) 3; 52) 3; 53) 2; 54) 3; 55) 2; 56) 3; 57) 3; 58) 1; 59) 4; 60) 3; 61) 3; 62) 2; 63) 4; 64) 1; 65) 2; 66) 3; 67) 2; 68) 1; 69) 4; 70) 3; 71) 3; 72) 2; 73) 1; 74) 4; 75) 3;
76) 1; 77) 3; 78) 2; 79) 1; 80) 2; 81) 3; 82) 4; 83) 2; 84) 4; 85) 2;
86) 1; 87) 3; 88) 3; 89) 2; 90) 4; 91) 4; 92) 3; 93) 3; 94) 4; 95) 4;
96) 3; 97) 2; 98) 4; 99) 3; 100) 4; 101) 1; 102) 1; 103) 4; 104) 1; 105) 4;
106) 3; 107) 4; 108) 3; 109) 1; 110) 3; 111) 4; 112) 4; 113) 4; 114) 1; 115) 3;
116) 2; 117) 1; 118) 3; 119) 1; 120) 3; 121) 4; 122) 1; 123) 4; 124) 3; 125) 2;
126) 2; 127) 4; 128) 1; 129) 3; 130) 3; 131) 2; 132) 1; 133) 4; 134) 2; 135) 3;
136) 1; 137) 4; 138) 3; 139) 1; 140) 3; 141) 2; 142) 3; 143) 2; 144) 1; 145) 1;
146) 2; 147) 4; 148) 1; 149) 3; 150) 2.
మోడల్ పేపర్ రూపకర్తలు:
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాగీ: మోజెస్
తెలుగు: పీవీ సుబ్బారావు
ఇంగ్లిష్: డి. హనుమంతరావు
గణితం: యార్లగడ్డ వనంరాజు
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్: బొమ్మనబోయిన శ్రీనివాస్