బులెటిన్‌ బోర్డ్‌ | Bulletin Board | Sakshi
Sakshi News home page

బులెటిన్‌ బోర్డ్‌

Published Tue, Jan 31 2017 1:29 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

Bulletin Board

ఈసీఐఎల్‌లో 10 పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) వివిధ ఉద్యోగాల నియామకానికి ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ పోస్టులను ఏడాది కాలానికి కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్‌ అవసరాన్ని బట్టి మరో ఏడాది పొడిగించే అవకాశం ఉంది.

ఖాళీలు: టెక్నికల్‌ ఆఫీసర్‌–4, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌–3, జూనియర్‌ ఆర్టిజన్‌–3.

విద్యార్హత: టెక్నికల్‌ ఆఫీసర్‌కు ఫస్ట్‌ క్లాస్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ(ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌). సైంటిఫిక్‌ అసిస్టెంట్‌కి పైన పేర్కొన్న సబ్జెక్టుల్లో ఫస్ట్‌ క్లాస్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా. జూనియర్‌ ఆర్టిజన్‌కు ఐటీఐ (ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రికల్‌/కంప్యూటర్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌) . ఎస్సీ, ఎస్టీలకు సెకండ్‌ క్లాస్‌ (50 శాతం మార్కులు) ఉన్నా సరిపోతుంది. ఠి అనుభవం: సంబంధిత రంగాల్లో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.

 వయసు: 2017 జనవరి 31 నాటికి టెక్నికల్‌ ఆఫీసర్‌కు 30 ఏళ్ల లోపు; మిగిలిన రెండు పోస్టులకు 25 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది. ఠి ఇంటర్వూ్య తేది: ఫిబ్రవరి 11 (శనివారం) ఇంటర్వూ్య వేదిక: ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల్లోని ఈసీఐఎల్‌ జోనల్, బ్రాంచ్‌ ఆఫీసుల్లో జరుగుతుంది.
వెబ్‌సైట్‌:  www.ecil.co.in  

జాతీయ మేధో దివ్యాంగుల సాధికారత సంస్థలో
గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

సికింద్రాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌(ఎన్‌ఐఈపీఐడీ–జాతీయ మేధో దివ్యాంగుల సాధికారత సంస్థ).. హెడ్‌ క్వార్టర్స్‌తోపాటు రీజనల్‌ సెంటర్లలో గెస్ట్‌ ఫ్యాకల్టీ/స్టాఫ్‌ను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఇంటర్వూ్యలు నిర్వహించనుంది. ఈ సంస్థను గతంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్‌(ఎన్‌ఐఎంహెచ్‌)గా పేర్కొనేవారు.

ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (రిహాబిలిటేషన్‌ సైకాలజీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్, సీఆర్‌పీఎం, మెడికల్‌), లెక్చరర్‌ (రిహాబిలిటేషన్‌ సైకాలజీ, స్పెషల్‌/రెగ్యులర్‌ ఎడ్యుకేషన్, సీఆర్‌పీఎం, మెడికల్, ఫిజియోథెరపీ), రిహాబిలిటేషన్‌ థెరపిస్ట్‌/ఫార్మసిస్ట్‌/అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌/స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌/వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్‌/ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, డేటా బేస్‌/నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్, సెక్షన్‌ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (యూడీసీ, ఎల్‌డీసీ లెవల్‌), హెడ్‌ మాస్టర్, టీచర్‌(జనరల్‌).

 కాంట్రాక్ట్‌ కాల వ్యవధి: తొలుత ఆరు నెలల వరకు. తర్వాత మరో ఆరు నెలల వరకు పొడిగించే అవకాశం ఉంది.
విద్యార్హత: పోస్టును బట్టి ఎంఫిల్‌/పీహెచ్‌డీ/ఎంఈడీ/ఎండీ/డీఎం/ఎంఎస్‌/ఎంఎస్సీ/ఎండీఆర్‌ఏ/ఎల్‌ఎల్‌ఎం/ఎల్‌ఎల్‌బీ/ఎంబీఏ/ఎంటెక్‌/డిగ్రీ, అనుభవం. 

ఇంటర్వూ్య తేదీలు: ఫిబ్రవరి 2, 3, 9, 10, 16, 17, 23, 24. ఠి ఇంటర్వూ్య వేదిక: ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, సికింద్రాబాద్‌   www.nimhindia.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement