ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి | First female Chief Justice Delhi High Court | Sakshi
Sakshi News home page

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి

Published Wed, Apr 16 2014 10:03 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి

ఢిల్లీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి

 ఫారెస్ట్ ఆఫీసర్స్
 జీకే - కరెంట్ అఫైర్స్


 ఎన్. విజయేందర్ రెడ్డి
 జనరల్ అవేర్‌నెస్ ఫ్యాకల్టీ,
 హైదరాబాద్
 

 

 1.    2014 ఏప్రిల్‌లో ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారానికి ఎంపికైన భారతీయ అమెరికన్ కవి ఎవరు?
 విజయ్ శేషాద్రి
 
 2.    ‘ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ద మేకింగ్ అండ్ అన్‌మేకింగ్ ఆఫ్ మన్మోహన్ సింగ్’ అనే సంచలనాత్మక పుస్తకాన్ని రాసిందెవరు?
 సంజయ్ బారు
 
 3.    2014 ఏప్రిల్‌లో బ్రిటన్‌లోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన నైట్ గ్రాండ్ క్రాన్ (జీబీఈ) అవార్డు లభించిన భారతీయుడు?
 టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్‌టాటా
 
 4.    ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి మహిళ?
 ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ రోహిణి
 
 5.    1937లో పులిట్జర్ పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయుడెవరు?
 గోవింద్ బిహారీలాల్
 
 6.    2014 ఫిబ్రవరిలో భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ జాతీయ వ్యవసాయ ప్రదర్శన ‘కృషి వసంత్’ను ఎక్కడ ప్రారంభించారు?
 మహారాష్ర్టలోని నాగ్‌పూర్‌లో
 
 7.    1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించిన తొలి తెలుగు వ్యక్తి?
 జస్టిస్ కోకా సుబ్బారావు
 
 8.    2014 సంవత్సరానికి గానూ బాలల నోబెల్ పురస్కారం ఎవరికి లభించింది?
 మలాలా యూసఫ్ జాయ్ (పాకిస్థాన్), జాన్ ఉడ్ (అమెరికా), ఇందిరా రానామగర్ (నేపాల్)
 
 9.    2014 ఫిబ్రవరిలో సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సమావేశంలో ఐసీసీ బోర్‌‌డ చైర్మన్‌గా ఎవరిని నియమించారు?
 ఎన్. శ్రీనివాసన్ (జూలైలో బాధ్యతలు స్వీకరిస్తారు)
 
 10.    2014 ఫిబ్రవరిలో చెన్నైలో జరిగిన ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న భారతీయ క్రీడాకారుడు?
 యుకి బాంబ్రి
 
 11.    2014 ఫిబ్రవరిలో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు?
 ఎన్. రామచంద్రన్
 
 12.    2014 ఫిబ్రవరిలో సోచిలో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ముగ్గురు భారత క్రీడాకారులు?
 శివకేశవన్, నదీమ్ ఇక్బాల్, హిమాంశు ఠాకూర్
 
 13.    సైబర్ భద్రత సమస్యల పరిష్కారానికి ఐక్య రాజ్యసమితి ప్రత్యేక సలహాదారుగా ఇటీవల నియమితుడైన భారతీయుడు?
 వివేక్ లాల్
 
 14.    కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తిరస్కరించిన కుటుంబం?
 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దివంగత జస్టిస్ జె.ఎస్. వర్మ కుటుంబం
 
 15.    సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవోగా ఇప్పటివరకూ ఎంతమంది పనిచేశారు?
 ముగ్గురు (బిల్‌గేట్స్, స్టీవ్ బామర్, సత్య నాదెళ్ల)
 
 16.    2014 ఫిబ్రవరిలో అమెరికాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ విజిటర్‌‌స లీడర్‌షిప్ ప్రోగ్రాం (ఐవీఎల్‌పీ)కు ఎంపికైన భారతీయ మహిళ?
 ఒడిశాకు చెందిన మహిళా సర్పంచ్ ఆరతీదేవి
 
 17.    పెయింట్ల తయారీ సంస్థ బెర్జర్ పెయింట్స్ ఇటీవల ఒక ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నెలకొల్పింది?
 అనంతపురం జిల్లా హిందూపురంలో
 
 18.    2013 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధిక వాహనాలు అమ్మిన రెండో కంపెనీగా అవతరించిన వోక్స్‌వ్యాగన్ ఏ దేశానికి చెందింది?
 జర్మనీ
 
 19.    సవరించిన గణాంకాల ప్రకారం 2012-2013 ఆర్థిక సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు ఎంత?
 4.5 శాతం (క్రితం అంచనా 5శాతం)
 
 20.    ఇటీవల భారత్‌తో జరిగిన వన్‌డే సిరీస్‌లోని ఐదు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు చేసిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్?
 కేన్ విలియమ్‌సన్
 
 21.    భారత్‌లో తొలి మోనోరైలును 2014 ఫిబ్రవరి 1న ఏ నగరంలో ప్రారంభించారు?
 ముంబై
 
 22.    2014 ఫిబ్రవరిలో 28వ సూరజ్‌కుండ్ అంతర్జాతీయ క్రాఫ్ట్స్ మేళాను ఏ రాష్ర్టంలో నిర్వహించారు?
 హర్యానా
 
 23.    2014 ఫిబ్రవరి ఒకటో తేదీన మేఘాలయా రాష్ట్రానికి చెందిన తొలి పద్మశ్రీ అవార్డు గ్రహీత మరణించారు. ఆమె పేరు?
 సిల్వరైన్ స్వేర్ (ఆమె వయసు 103 ఏళ్లు)
 
 24.    ఇటీవల విస్ఫోటం చెందిన సినబంగ్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
 ఇండోనేషియా
 
 25.    1961లో ఆస్కార్ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మాక్సిమిలియన్ షెల్ ఇటీవల మరణించారు. ఆయన ఏ దేశస్థుడు?
 ఆస్ట్రియా
 
 26.    2014 ఫిబ్రవరిలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ‘యూఎన్-ఇండో పిన్’ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది?
 శాసన మండలి చైర్మన్ ఎ. చక్రపాణి
 
 27.    2014 ఫిబ్రవరిలో అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలిచారు?
 ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పి.వి.సింధు
 
 28.    {పస్తుత రంజీ ట్రోఫీ చాంపియన్ కర్ణాటక కెప్టెన్ ఎవరు?
 వినయ్ కుమార్
 
 29.    2013-14 సంవత్సరానికి డీఆర్‌డీవో - రీసెర్‌‌చ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ) డెరైక్టర్ జి. సతీష్‌రెడ్డికి లభించిన అవార్డు?
 హోమీ జె. బాబా స్మారక అవార్డు
 
 30.    {పపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని  ఎప్పుడు నిర్వహిస్తారు?
 ఫిబ్రవరి 4
 
 31.    ఫిబ్రవరి 4, 2014 నాటికి పదేళ్లు పూర్తి చేసుకున్న ఫేస్‌బుక్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తి?
 అమెరికాకు చెందిన మార్‌‌క జుకర్‌బర్‌‌గ
 
 32.    2014 ఫిబ్రవరిలో కెనడాలోని విన్నీపెగ్‌లో డబ్ల్యూఎస్‌ఏ ప్రపంచ టూర్ వింటర్ క్లబ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో టైటిల్ సాధించిన భారత క్రీడాకారిణి?
 జోష్న చిన్నప్ప
 
 33.    2014 ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన జర్మనీ అధ్యక్షుడు?
 జొయాచిమ్ గ్వాక్
 
 34.    రాష్ట్రంలో న్యూక్లియర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్న కొవ్వాడ ఏ జిల్లాలో ఉంది?
 శ్రీకాకుళం
 
 35.    భారతరత్న అవార్డును అందుకున్న ముగ్గురు శాస్త్రవేత్తలు?
 సి.వి.రామన్, అబ్దుల్ కలామ్, సీఎన్‌ఆర్. రావు
 
 36.    బిల్‌గేట్స్ స్థానంలో మైక్రోసాఫ్ట్ కంపెనీకి చైర్మన్‌గా ఎంపికైంది?
 జాన్ థాంప్సన్
 
 37.    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణకు ఉద్దేశించిన ఏడో వేతన సవరణ సంఘానికి చైర్మన్?
 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్
 
 38.    ‘వ్యాస్ సమ్మాన్’ పురస్కారాన్ని 1991లో ఏర్పాటు చేసింది?
 కె.కె. బిర్లా ఫౌండేషన్
 
 39.    రాష్ట్రంలో భారీ ఓడరేవును ఏర్పాటు చేయనున్న దుగరాజపట్నం ఏ జిల్లాలో ఉంది?
 నెల్లూరు
 
 40.    2014 ఫిబ్రవరిలో ఆటో ఎక్స్‌పోను ఎక్కడ నిర్వహించారు?
 గ్రేటర్ నోయిడా
 
 41.    1917 నవంబరు 19న జన్మించిన భారతదేశ మాజీ ప్రధాన మంత్రి ఎవరు?
 ఇందిరాగాంధీ
 
 42.    యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు తొలి అధ్యక్షుడు?
 జార్జి వాషింగ్టన్ (1789-1797)
 
 43.    1815లో వాటర్‌లూ యుద్ధంలో ఓడిపోయిన ప్రముఖుడు?
 నెపోలియన్ బొనాపార్టె(ఫ్రాన్‌‌స)
 
 44.    టెలిస్కోప్‌ను ఎవరు కనుగొన్నారు?
 గెలీలియో
 
 45.    ‘ఇండికా’ పుస్తకాన్ని రచించింది?
 మెగస్తనీస్
 
 46.    జలియన్ వాలాబాగ్ ఊచకోతకు నిరసనగా నైట్‌హుడ్ అవార్డును తిరస్కరించినవారు?
 రవీంద్రనాథ్ ఠాగూర్
 
 47.    ‘ఆముక్త మాల్యద’ ఎవరి రచన?
 శ్రీకృష్ణదేవరాయలు
 
 48.    పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన పార్టీ?
 పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్
 
 49.    మహాత్మాగాంధీకి రాజకీయ గురువు ఎవరు?
 గోపాల్ కృష్ణ గోఖలే
 
 50.    థామస్‌కప్ ఏ క్రీడకు సంబంధించింది?
 బ్యాడ్మింటన్
 
 51.    2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎంత వృద్ధిరేటు ఉంటుందని కేంద్రీయ గణాంక కార్యాలయం (సీఎస్‌వో) అంచనా వేసింది?
 4.9 శాతం
 
 52.    {పపంచంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫార్చ్యూన్ పత్రిక 2014 ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మహిళ?
 జనరల్ మోటార్‌‌స సీఈవో మేరీ బర్రా
 
 53.    ఫార్చ్యూన్ పత్రిక రూపొందించిన ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్తల జాబితాలో స్థానం లభించిన భారతీయులెవరు?
 పెప్సీకో సీఈవో ఇంద్రానూయి (మూడోస్థానం), ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందాకొచ్చర్ (18వ స్థానం)
 
 54.    సెబీ చైర్మన్‌గా మరో రెండేళ్లపాటు ఎవరు కొనసాగనున్నారు?
 యు.కె.సిన్హా
 
 55.    కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) తొలి మహిళా అదనపు డెరైక్టర్‌గా నియమితులైనవారు?
 అర్చనా రామసుందరం
 
 56.    2014 ఫిబ్రవరిలో ఒకే టెస్ట్‌లో రెండు ఇన్నింగ్‌‌సల్లో ట్రిపుల్ సెంచరీ, సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్?
 శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర
 
 57.    ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏవో) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
 కెనడాలోని మాంట్రియల్
 
 58.    2014 ఫిబ్రవరిలో కోఫి అన్నన్ భారతదేశంలో పర్యటించారు. ఆయన?
 ఐక్యరాజ్యసమితి ఏడో సెక్రటరీ జనరల్ (1997 - 2006)
 
 59.    ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
 ఆస్ట్రియా రాజధాని వియన్నాలో
 
 60.    తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
 ఎపికల్చర్
 
 61.    దక్షిణ కొరియా కరెన్సీని ఏమంటారు?
 వొన్
 
 62.    1952 నుంచి 1956 వరకు లోక్‌సభ తొలి డిప్యూటీ స్పీకర్‌గా ఎవరు పనిచేశారు?
 మాడభూషి అనంతశయన అయ్యంగార్
 
 63.    రీగా ఏ దేశానికి రాజధాని?
 లాత్వియా
 
 64.    ఏ దేశ పార్లమెంట్ దిగువ సభను సెజమ్ అని పిలుస్తారు?
 పోలెండ్
 
 65.    ఎంపైర్ సిటీ, ద సిటీ ఆఫ్ స్కైస్క్రాపర్‌‌స అనేవి ఏ నగరానికి పేర్లు?
 న్యూయార్‌‌క
 
 66.    2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తెలుగు వ్యక్తి?
 జస్టిస్ నూతలపాటి వెంకట రమణ
 
 67.    కన్హా జాతీయ పార్‌‌క ఏ రాష్ర్టంలో ఉంది?
 మధ్యప్రదేశ్
 
 68.    1986లో గుర్తించిన భారతదేశంలోని తొలి బయోస్ఫియర్ రిజర్‌‌వ?
 నీలగిరి బయోస్ఫియర్ రిజర్‌‌వ. ఇది తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో నెలకొని ఉంది
 
 69.    1994లో విశ్వ సుందరిగా ఎంపికైన తొలి భారతీయ మహిళ?
 సుస్మితా సేన్
 
 70.    కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగింది?
 ఢిల్లీ (7 స్థానాలు)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement