ఇంటర్‌తో సీఏ
ఇంటర్మీడియట్ స్పెషల్
కోర్సు: చార్టర్డ్ అకౌంటెన్సీ
అర్హత: ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వెంటనే సీపీటీ ద్వారా కోర్సులో ప్రవేశించొచ్చు. ఒకవైపు బ్యాచిలర్ డిగ్రీ చదువుతూ.. సీపీటీ, ఐపీసీసీలను పూర్తి చేయొచ్చు. చార్టర్‌డ అకౌంటెన్సీ కోర్సులో అడుగుపెట్టిన విద్యార్థులు బ్యాచిలర్ డిగ్రీ మూడేళ్లు, తర్వాత రెండేళ్లు మొత్తం ఐదేళ్లలో కోర్సు పూర్తి చేసుకోవచ్చు.
కోర్సు స్వరూపం
ఫౌండేషన్, ఇంటర్మీడియెట్ (ఐపీసీసీ), ఫైనల్ మొత్తం మూడు దశలుగా ఉండే కోర్సు సీఏ. రెండు గ్రూప్‌లుగా ఉండే ఐపీసీసీ దశలో ఉత్తీర్ణులైతే ఫైనల్‌కు అర్హత లభిస్తుంది. ఐపీసీసీ, ఫైనల్ ఎగ్జామ్స్ మధ్యలో మూడేళ్ల ఆర్టికల్‌షిప్ తప్పనిసరి. ఆర్టికల్‌షిప్ చేసినట్లు ధ్రువీకరణ సర్టిఫికెట్ చూపితేనే ఫైనల్ ఎగ్జామ్స్ రాసేందుకు అర్హత కల్పిస్తోంది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) విద్యార్థుల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలకు పెద్దపీట వేస్తోంది.
ఎవరికి అనుకూలం
కంప్యూటేషన్ స్కిల్స్, న్యూమరికల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు, అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణలో ఆసక్తి, మారుతున్న చట్టాలపై నిరంతర అవగాహన ఏర్పరచుకునే నేర్పు ఉన్న వారికి సీఏ కోర్సు అనుకూలంగా ఉంటుంది.
డొమైన్ స్కిల్స్
అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణ (అకౌంటింగ్, ఆడిటింగ్, ట్యాక్సేషన్)లో నైపుణ్యాలు ఉండాలి. వ్యాపార నిర్వహణ పరంగా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో స్కిల్స్ పెంపొందించుకోవాలి.
ఉపాధి అవకాశాలు..
సీఏలకు వివిధ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలుంటాయి. స్వయం ఉపాధి పొందొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్, సోషల్ నెట్‌వర్క్ ఉంటే కెరీర్‌లో వేగంగా రాణించవచ్చు.
సీఏ సానుకూలతలు, ప్రతికూలతలు
అకౌంటింగ్, ఫైనాన్స్ విభాగాల్లో అపారమైన నైపుణ్యాలు
రెగ్యులర్ అప్‌డేట్స్ అందించే విధంగా మారుతున్న కరిక్యులం
ఇంటర్మీడియెట్ నుంచే కోర్సు అభ్యసించే అవకాశం.
కేవలం ఒక విభాగానికే పరిమితమయ్యే విధంగా కరిక్యులం
సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోణంలో ప్రధాన సమస్యగా మారుతున్న కమ్యూనికేషన్ స్కిల్స్.
ఎంబీఏ ఫైనాన్స్ విద్యార్థులకు.. సీఏల నుంచి పోటీ ఉందనే మాటల్లో వాస్తవం కొంత మాత్రమే. అకౌంటింగ్‌లో సీఏలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంబీఏ విద్యార్థులకు సంస్థల్లో ఆర్థిక విభాగాల్లో అవకాశాలున్నాయి. సీఏలో నిరంతరం కరిక్యులం అప్‌డేట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాం.
- కె. రామచంద్రారెడ్డి, చైర్మన్, ఐసీఏఐ హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్