పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు ముగిశాయి. తర్వాత ఎలాంటి కోర్సులు ఎంపిక చేసుకోవాలి? ఆ కోర్సులతో భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే సందేహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉన్నాయి. వీటికి సమాధానం.. కెరీర్ ప్లానింగ్.. సరైన ప్లానింగ్‌తో అడుగులు వేస్తే ఏ కోర్సయినా.. ఏ రంగమైనా.. ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో కెరీర్ ప్లానింగ్ విషయంలో నిపుణులు అందిస్తున్న సలహాలు..
ఆసక్తే ప్రధానం: విద్యార్థులు వ్యక్తిగత ఆసక్తికి అనుగుణంగా కోర్సుల వివరాలు తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి పజిల్స్, సుడోకు వంటివాటిపై ఆసక్తి ఉంటే మ్యాథమెటిక్స్, సైన్స్ విభాగాల్లో రాణించగలరు. జనరల్ నాలెడ్జ్ అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఆర్ట్స్, హ్యుమానిటీస్ కోర్సులు కలిసొస్తాయి.
యాటిట్యూడ్.. ఆప్టిట్యూడ్: విద్యార్థికి వ్యక్తిగతంగా ఉన్న లక్ష్యాలు, వాటిని అందుకునే దిశగా వారి దృక్పథాన్ని పరిశీలించాలి. విద్యార్థులు పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా వారి దృక్పథం ఉందా? లేదా? అని తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
అత్యున్నత అవకాశాలు: ఆయా కోర్సులతో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవాలి. ఇటీవల మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కోర్సులు రూపొందుతున్నాయి. ఇలాంటి అప్‌కమింగ్ కోర్సులు, కెరీర్‌స విషయంలో ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, జాబ్ ట్రెండ్, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ గురించి బేరీజు వేసుకుని ఆచితూచి అడుగులు వేయాలన్నది నిపుణుల సలహా.
కోర్స్ వర్సెస్ కాలేజ్: కెరీర్ ప్లానింగ్‌లో ముఖ్య దశ... తమకు ఆసక్తి ఉన్న కోర్సుకా?లేదా కాలేజ్‌కు ప్రాధాన్యమివ్వాలా? అనే అంశంపై స్పష్టత. ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్ విభాగాలను లక్ష్యంగా నిర్దేశించుకున్న విద్యార్థులు ఈ విషయంలో ఎంతో కసరత్తు చేయాలి. తమకు ఆసక్తి ఉన్న బ్రాంచ్/కోర్సుకు సంబంధించి ప్రతిష్టాత్మక కళాశాలలు, మంచి చరిత్ర ఉన్న కళాశాలలను గుర్తించాలి. కోర్స్ వర్సెస్ కాలేజ్ విషయంలో కోర్స్‌కే ప్రాధాన్యమివ్వాలి అనేది నిపుణుల సూచన.
లక్ష్య సాధన దిశగా: ఏ కోర్సు విద్యార్థులకైనా తుది లక్ష్యం చక్కటి జాబ్ సొంతం చేసుకోవడం. సుస్థిర కెరీర్‌కు మార్గం వేసుకోవడం. ఇంటర్మీడియెట్ తర్వాత పలు బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు తాము లక్ష్యంగా చేసుకున్న కెరీర్స్.. వాటికి లభించే అవకాశాలు.. అందుకు అవసరమైన అర్హతలు తెలుసుకుని వాటిని మెరుగుపరచుకునేందుకు పకడ్బందీ ప్రణాళికతో వ్యవహరించాలి.
కెరీర్ ప్లానింగ్ ఇలా..
Published Thu, Apr 28 2016 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM
Advertisement