
గణిత శాస్త్రం- మెథడాలజీ టెట్ + డీఎస్సీ పేపర్ - 1,2
1. జియోబోర్డు ద్వారా చేయలేని కృత్యం?
1) వృత్తాల ఏర్పాటు 2) పంచభుజి
3) హిస్టోగ్రామ్‌లు 4) సమాంతర రేఖలు
2. గణిత క్లబ్‌లో సీనియర్ గణిత ఉపాధ్యాయుడు?
1) అధ్యక్షుడు 2) కోశాధికారి
3) ఉపాధ్యక్షుడు 4) సభ్యుడు కాదు
3. గణిత బోధనా పేటికలో లేని జ్యామితీయ ఘనాకారాలు?
1) స్థూపం 2) పిరమిడ్
3) దీర్ఘఘనం 4) సమఘనం
4. బులిటెన్ బోర్డు ప్రయోజనం?
1) కొత్త సమాచారాన్ని ప్రదర్శించడం
2) చిత్రాలు ప్రదర్శించడం
3) విద్యార్థులు ఫజిల్ ప్రదర్శించడం
4) పైవన్నీ
5. గణితంలో నిర్వచనాలు, సూత్రాలు, సాంకేతిక పదాలు రాసి ప్రదర్శించడానికి ఉపయోగపడేది?
1) వర్‌కషీట్ 2) చార్టు
3) గ్రిడ్ పేపర్ 4) జియోబోర్డు
6. గణిత బోధనలో ఉపయోగపడనవి ?
1) స్కేలు 2) కోణమాణిని
3) నమూనాలు 4) ఏదీకాదు
7. 0 0 ఆకారంలో ఉండే డామినో కార్డు పేరు?
1) 0-0 డామినో కార్డు
2) 1-1 డామినో కార్డు
3) 4-4 డామినో కార్డు
4) 2-4 డామినో కార్డు
8. ఏదైనా విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికి, గుర్తించడానికి వాడేవి?
1) ఫ్లాష్ కార్‌డ్స 2) కృత్యాధార షీట్
3) గ్రాఫ్ 4) డామినోలు
9. గణితంలో సత్యమేకాదు సౌందర్యం కూడా ఉంది అన్నవారు?
1) లైబ్నిజ్ 2) రస్సెల్
3) పైథాగరస్ 4) కాంట్
10. గణితంలో సహపాఠ్య కార్యక్రమాలు నిర్వ హించడానికి ఉపయోగపడేది?
1) సైన్‌స క్లబ్ 2) విద్యాకమిటీ
3) గణిత సంఘం 4) పైవేవీ కావు
11. శాతాలు బోధించడానికి అనువైన ఉపకరణం?
1) గ్రిడ్‌పేపర్ 2) పెగ్‌బోర్డు
3) వర్‌కషీట్ 4) జియోబోర్డు
12. క్యూసనేయర్ పట్టీలకు సంబంధించి సరి కానిది?
1) గుణకారాలను చేయడం
2) ఆరోహణ క్రమాలను అవగాహన పరచడం
3) సంకలనం చేయడం
4) పెద్ద, చిన్న అంకెలను పోల్చడం
13. దీర్ఘచతురస్ర వైశాల్యం కనుగొనడానికి బోధించే అనువైన బోధనోపకరణం?
1) ప్యానెల్ బోర్డు 2) నల్లబల్ల
3) జియోబోర్డు 4) ఏదీకాదు
14. రాష్ర్టస్థాయిలో పాఠ్యపుస్తకాల రూపకల్ప నలో బాధ్యత వహించేది?
1) ఎన్‌సీటీఈ 2) ఎస్‌ఈఆర్‌టీ
3) ఎన్‌సీఈఆర్‌టీ 4) ఆర్‌వీఎం
15. వర్‌కబుక్ ఉపయోగం?
1) విద్యార్థుల అభ్యాసం కోసం
2) చతుర్విద ప్రక్రియల్లో నైపుణ్యం
సాధించడానికి
3) తరగతిలో అభ్యసించిన విషయాలను
శాశ్వతం చేయడానికి 4) పైవన్నీ
16. స్థాన విలువలు బోధించేందుకు అనువైన బోధనోపకరణం?
1) పూసల చట్రం 2) భిన్నాల చట్రం
3) ఘనాకార కడ్డీలు 4) నేపియర్ పట్టీలు
17. గణిత బోధనా పేటికలో ఘనాకార కడ్డీల సంఖ్య?
1) 50 2) 55 3) 100 4) 10
18. అనుభవాల శంఖంలో అగ్రభాగాన ఉండే అంశాలు?
1) మూర్త అంశాలు 2) క్షేత్ర పర్యటనలు
3) ప్రదర్శనలు 4) అమూర్త అంశాలు
19. బోధనాభ్యసన కార్యక్రమంలో మొట్టమొదటి బోధనోపకరణం?
1) నల్లబల్ల 2) పాఠ్యపుస్తకం
3) గణితబోధనా పేటిక 4) వర్‌కబుక్
20. అమూర్త భావనలను మూర్తీకరించడానికి ఉపయోగపడేది?
1) నల్లబల్ల 2) ఆటస్థలం
3) బోధనోపకరణాలు 4) పాఠ్యపుస్తకం
21. తరగతి గదిలో సులభంగా, ఎక్కువగా ఉపయోగించే దృశ్యోపకరణం?
1) చార్టు 2) గ్రాఫ్
3) పాఠ్యపుస్తకం 4) నల్లబల్ల
22. మంద అభ్యాసకులకు ఎక్కువగా ఉపయోగ పడేది?
1) గణిత క్లబ్ 2) తరగతి గది
3) గణిత గ్రంథాలయం
4) సైన్‌స ఫెయిర్
23. గణిత పేటికలో మొత్తం డామినోల సంఖ్య?
1) 55 2) 50 3) 100 4) 45
24. వాస్తవ పరిసరాలను మోడల్‌కు జోడించి తయారు చేసింది?
1) డయోరమ 2) నాటకం
3) చలనచిత్రం 4) మనోరమ
25. ఆరోహణ, అవరోహణ క్రమాలను బోధిం చేందుకు అనువైంది?
1) పూసల చట్రం 2) డామినో కార్‌డ్స
3) నేపియర్ పట్టీలు 4) ఘనాకార కడ్డీలు
26. అభ్యసన అనుభవాలకు, బోధనోపకరణా లకు మధ్య సంబంధాన్ని తెలిపేది?
1) ప్రయోగశాల 2) తరగతి గది
3) ఎడ్గార్‌డేల్ అనుభవాల శంఖు
4) ఆటస్థలం
27. గుణకారాన్ని పునరావృత సంకలనం అని బోధించేందుకు ఉపయోగపడే బోధనోప కరణం?
1) పెగ్‌బోర్డు 2) జియోబోర్డు
3) చార్టు 4) గ్రాఫ్
28. గణితంలో ఆడే క్రీడ?
1) గణిత పదాల అంత్యాక్షరి
2) గణిత క్విజ్
3) వింతచదరాలు 4) పైవన్నీ
29. జ్యామితీయ భావనలు బోధించేందుకు అనువైంది?
1) బులిటెన్ బోర్డు 2) నల్లబల్ల
3) అయస్కాంత బల్ల 4) జియోబోర్డు
30. గుణకారాలను బోధించడానికి ఉపయోగించే బోధనోపకరణం?
1) నేపియర్ పట్టీలు 2) పూసల చట్రం
3) ఘనాకార కడ్డీలు 4) భిన్నాల చట్రం
సమాధానాలు
1) 1; 2) 3; 3) 2; 4) 4; 5) 2;
6) 4; 7) 2; 8) 1; 9) 2; 10)3;
11) 1; 12) 1; 13) 3; 14) 2; 15)4;
16) 1; 17) 3; 18) 4; 19) 2; 20)3;
21) 4; 22) 3; 23) 1; 24) 1; 25)4;
26) 3; 27) 1; 28) 4; 29) 4; 30)1;