
గణిత శాస్త్రం టెట్ + డీఎస్సీ పేపర్ - 1,2
1. అభ్యసన చేసిన భావనలకు తుదిరూపం ఇవ్వడానికి ఉపయోగించే బోధనా పద్ధతి?
ఎ) నిగమన పద్ధతి బి) ఆగమన పద్ధతి
సి) విశ్లేషణ పద్ధతి డి) అన్వేషణ పద్ధతి
2. కిండర్‌గార్టెన్ పద్ధతిని రూపొందించిన వారు?
ఎ) మాంటిస్సోరి బి) ప్రోబెల్
సి) రూసో డి) డబ్ల్యూ.బి.వైట్
3. {Vంథ రచనలో రచయితలు ఎక్కువగా ఉపయోగించే పద్ధతి ?
ఎ) అన్వేషణ పద్ధతి బి) ఆగమన పద్ధతి
సి) విశ్లేషణ పద్ధతి డి) సంశ్లేషణ పద్దతి
4. నిగమనపద్ధతి సూత్రం కానిది?
ఎ) సూత్రం నుంచి ఉదాహరణకు
బి) తెలిసిన విషయాల నుంచి తెలియని
విషయాలకు
సి) అమూర్తం నుంచి మూర్తానికి
డి) సామాన్యం నుంచి ప్రత్యేకానికి
5. ఆగమన పద్ధతి లక్షణం?
ఎ) తార్కిక పద్ధతి
బి) ఇంటి పనిని తగ్గిస్తుంది
సి) మనోవైజ్ఞానిక పద్ధతి డి) పైవన్నీ
6. హూరిస్టిక్ అనే పదానికి మూలపదం ఏ భాషకు చెందినది?
ఎ) ఫ్రెంచ్ బి) గ్రీక్
సి) లాటిన్ డి) ఇంగ్లిష్
7. కిండర్ గార్టెన్ పద్ధతిలో జరగనిది?
ఎ) నృత్యం చేయడం
బి) కథలు చెప్పడం సి) పాటలు పాడటం
డి) ఆటలు ఆడటం
8. సమస్యా పరిష్కార పద్ధతిలో ముఖ్యమైన సోపానం?
ఎ) సమాచారాన్ని వ్యవస్థీకరించడం
బి) సమస్యను నిర్వచించడం
సి) ఫలితాన్ని సరిచూడటం
డి) సమస్యను గుర్తించడం
9. {పాథమిక, ప్రాథమికోన్నత స్థాయిల కంటే ఉన్నతస్థాయి విద్యార్థులకు తగినది?
ఎ) అన్వేషణ పద్ధతి బి) ప్రాజెక్టు పద్ధతి
సి) నిగమన పద్ధతి డి) సంశ్లేషణ పద్ధతి
10. విశ్లేషణ పద్ధతి గుణం కానిది?
ఎ) తార్కిక విధానం బి) సుదీర్ఘమైనది
సి) సంపూర్ణ అవగాహన పెరుగుతుంది.
డి) అన్ని సోపానాలకు తగిన కారణం, సమర్థన ఉంటాయి
11. పాఠశాల దినోత్సవ నిర్వహణను ఈ ప్రకల్పనగా భావిస్తారు?
ఎ) జీవిత ఉపయోగ ప్రకల్పన
బి) ఆనందదాయక ప్రకల్పన
సి) మేధా సంబంధమైన ప్రకల్పన
డి) నిర్మాణాత్మక ప్రకల్పన
12. కృత్యాధార పద్ధతిలో బోధించడానికి సూత్రం కానిది?
ఎ) వైయక్తిక భేదాలను గుర్తించడం
బి) స్థానిక పరిసరాలను ఉపయోగించడం
సి) వస్తువులను వర్గీకరించడం
డి) ఉపాధ్యాయుడు రూపొందించిన
అభ్యసన ప్రక్రియలు కల్పించాలి
13. అన్వేషణ పద్ధతిలోని ఒక దోషం?
ఎ) విద్యార్థికి అన్వేషణ వైఖరి ఉండాలి
బి) మందకొడి విధానం
సి) వైయక్తిక భేదాలకనుగుణంగా
ఉంటుంది
డి) విద్యార్థి క్రియాత్మక భాగస్వామి
14. ఆగమన పద్ధతి నియమం?
ఎ) ప్రత్యేకం నుంచి సామాన్యానికి
బి) ఉదాహరణ నుంచి సూత్రానికి
సి) మూర్తం నుంచి అమూర్తానికి
డి) పైవన్నీ
15. విద్యకు, జీవితానికి గల అవినాభావ సంబంధాన్ని చూపే పద్ధతి?
ఎ) ప్రయోగశాల పద్ధతి
బి) సమస్యా పరిష్కార పద్ధతి
సి) ప్రకల్పన పద్ధతి డి) అన్వేషణ పద్ధతి
16. ఆగమన పద్ధతిని ప్రచారం చేసినవారు?
ఎ) యంగ్ బి) పెస్టాలజీ
సి) కిల్‌పాట్రిక్ డి) బెలార్‌డ
17. నిగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు?
ఎ) యంగ్ బి) ఆర్‌మస్ట్రాంగ్
సి) కొమినియన్ డి) పెస్టాలజీ
సమాధానాలు
1) ఎ 2) బి 3) డి 4) బి 5) డి 6) బి 7) ఎ 8) డి 9) సి 10) బి 11) ఎ 12) సి 13) బి 14) డి 15) సి 16) బి 17) సి