
ఎన్‌టీఎస్‌ఈతో ప్రతిభకు పట్టం.. ఉన్నత విద్యకు ఉపకారం..
జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ).. దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గనిర్దేశనం చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ. ఇదంతా ఒక ఎత్తయితే మరోవైపు పదో తరగతి స్థాయిలో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ)ను నిర్వహిస్తోంది. తాజాగా ఈ పరీక్షకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో పరీక్ష విధానం, విజయానికి
సన్నద్ధత, ఉపకారవేతనాల తీరుతెన్నులపై ప్రత్యేక కథనం..
దేశంలో పాఠశాల విద్యను నాణ్యవంతంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఎన్‌సీఈఆర్‌టీ.. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ఉన్నత విద్య దిశగా వారిని ప్రోత్సహించేందుకు ఆర్థిక సహాయం అందిస్తోంది. దీనివల్ల వారి ప్రతిభ ఇనుమడించి ప్రత్యక్షంగా వారికి, పరోక్షంగా సమాజానికి మేలు చేకూరుతుందన్నది మండలి భావన. తొలిసారిగా 1963లో జాతీయ విజ్ఞానశాస్త్ర ప్రతిభా అన్వేషణ పథకాన్ని ప్రారంభించి, 11వ తరగతికి చెందిన విద్యార్థులకు 10 స్కాలర్‌షిప్‌లను అందజేసింది. తర్వాతి కాలంలో దీని పేరును జాతీయ ప్రతిభా అన్వేషణ పథకంగా మార్చారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు స్కాలర్‌షిప్‌ల సంఖ్యనూ పెంచుతున్నారు.
పదో తరగతి విద్యార్థులకు:
ప్రస్తుతం రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతాల్లో గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (ఎన్‌టీఎస్‌ఈ)కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్షను విద్యార్థి చదువుతున్న పాఠశాల ఉన్న రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నిర్వహిస్తుంది. ఇందులో ఎంపికైన వారు జాతీయ స్థాయిలో ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించే రెండో దశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు నేరుగా రెండో దశ పరీక్ష రాసేందుకు అర్హులు. రెండో దశ పరీక్షకు విద్యార్థులను అర్హులను చేసేందుకు ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతానికి ప్రత్యేక కోటా ఉంటుంది. తుది దశ పరీక్ష పూర్తయిన తర్వాత, స్కాలర్‌షిప్ అర్హుల ఎంపికకు మాత్రం ఎలాంటి కోటా ఉండదు.
పరీక్ష విధానం తొలి దశ పరీక్ష:
తొలిదశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలుంటాయి. అవి.. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (ఎంఏటీ); లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్; ఆప్టిట్యూడ్ టెస్ట్. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షను ఇంగ్లిష్/ హిందీ/ తెలుగు/ ఉర్దూ మాధ్యమంలో రాయవచ్చు. పరీక్ష కాల వ్యవధి మూడు గంటలు.
విభాగం ప్రశ్నలు మార్కులు
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 50
లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్ 40 40
ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 90
మొత్తం 180 180
లాంగ్వేజ్ కాంప్రెహెన్షివ్ టెస్ట్‌కు సంబంధించి అభ్యర్థులు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ విభాగం అర్హత విభాగం మాత్రమే. ఇందులోని మార్కులు మెరిట్ జాబితా తయారీకి పరిగణనలోకి తీసుకోరు.
రెండో దశ పరీక్ష:
విభాగం ప్రశ్నలు మార్కులు సమయం
మెంటల్ ఎబిలిటీ 50 50 45 ని.
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్
ఎ) లాంగ్వేజ్ టెస్ట్ 50 50 45ని.
బి) సైన్స్, మ్యాథమెటిక్స్,
సోషల్ సెన్సైస్ 100 100 90 ని.
తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు.
ఉపకారవేతనం- అందే విధానం:
జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష ద్వారా వెయ్యి మంది ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు.
ఎంపికైన వారికి ఇంటర్మీడియెట్ రెండేళ్లలో నెలకు రూ.1,250 అందజేస్తారు. అండర్‌గ్రాడ్యుయేట్, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు నెలకు రూ.2,000 ఇస్తారు.పీహెచ్‌డీలో చేరితే యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఉపకారవేతనం మొత్తాన్ని నిర్ధరిస్తారు.ఇప్పటి వరకు స్కాలర్‌షిప్ కింద నెలకు రూ.500 మాత్రమే అందజేసేవారు. ఈ ఏడాది నుంచి స్కాలర్‌షిప్ మొత్తాన్ని పెంచారు.
రిజర్వేషన్:
కేటగిరీ స్కాలర్‌షిప్‌ల్లో రిజర్వేషన్
ఎస్సీ విద్యార్థులు 15 శాతం
ఎస్టీ విద్యార్థులు 7.5 శాతం
ఫిజికల్లీ చాలెంజ్డ్ 3 శాతం
ముఖ్య తేదీలు:పాఠశాల ఉపాధ్యాయుడు/ఉపాధ్యాయినికి దరఖాస్తు అందించడానికి గడువు: సెప్టెంబర్ 1, 2014.
డీఈవో కార్యాలయాలకు సమర్పించేందుకు గడువు: సెప్టెంబర్ 3, 2014.మొదటి దశ పరీక్ష: నవంబర్ 2, 2014.రెండో దశ పరీక్ష: మే 10, 2015.దరఖాస్తు విధానం: దరఖాస్తులు సంబంధిత జిల్లా డీఈవో కార్యాలయాల్లో లభిస్తాయి. లేదంటే bseap. org, bsetelangana.orgË ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫీజు రూ.100 చలానాతో పాటు పూర్తిచేసిన దరఖాస్తును పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయినికి అందజేయాలి. వీరు దరఖాస్తులను డీఈవో కార్యాలయానికి సమర్పిస్తారు.
ప్రిపరేషన్ టిప్స్
సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన అంశాలను ముందు చదవాలి.ప్రిపరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను అధ్యయనం చేయాలి.గత ప్రశ్నపత్రాలతో పాటు నమూనా ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.అర్థం కాని విషయాలను స్నేహితులు, ఉపాధ్యాయులతో చర్చించి, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు సంకోచించకూడదు.ఎన్‌టీఎస్ పరీక్షకు సిద్ధమయ్యేందుకు అందుబాటులో ఉన్న సమయాన్నిబట్టి ఎవరికి వారు సొంతంగా ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవాలి. రీజనింగ్‌కు సంబంధించి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక ప్రామాణిక పుస్తకంలోని సమస్యలను ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది.తొమ్మిదో తరగతి ప్రారంభం నుంచి స్కాలర్‌షిప్ పరీక్షలో విజేతగా నిలిచేందుకు సిద్ధంకావాలి.
తొలి దశలో విజయానికి..
మెంటల్ ఎబిలిటీ టెస్ట్:జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్షకు సిద్ధమయ్యే క్రమంలో విద్యార్థులు ప్రధానంగా పెంపొందించుకోవాల్సిన నైపుణ్యం.. విశ్లేషణాత్మక ఆలోచన (అ్చడ్టజీఛ్చి ఖీజిజీజుజీజ). విజ్ఞానం సముపార్జించి, పరీక్షలో విజయం సాధించేందుకు ఇదే ఉత్తమ సాధనం. రేషియో-ప్రొపోర్షన్స్-యావరేజెస్; ప్రాఫిట్ అండ్ లాస్; టైమ్ అండ్ డిస్టెన్స్; ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్; సింపుల్ ఇంట్రస్ట్; సెట్స్-వెన్ డయాగ్రమ్స్ తదితర అంశాలతో పాటు ఆైఈకఅ ఆధారిత ప్రశ్నలు వస్తాయి. అందువల్ల ఈ అంశాలపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఈ విభాగాలపై పట్టు సాధించాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని ప్రశ్నలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
వెర్బల్ రీజనింగ్‌కు సంబంధించి బ్లడ్ రిలేషన్స్; సిరీస్; వర్డ్ రిలేషన్‌షిప్; కోడింగ్-డీకోడింగ్; డెరైక్షన్స్; కేలండర్ తదితర అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. నాన్ వెర్బల్ రీజనింగ్‌లో మిర్రర్ ఇమేజస్;ఫిగర్ మ్యాట్రిక్స్; అనాలజీ; పేప ర్ ఫోల్డింగ్ వంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. మొత్తం ప్రశ్నల్లో దాదాపు 10 నాన్ వెర్బల్, 15 వరకు వెర్బల్ రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. పటాల ఆధారిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి.తేలికపాటి డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి పూర్తిస్థాయిలో స్కోర్ సాధించేందుకు ఇవి ఉపయోగపడతాయి.
Pointing to a photograph, a man said, "I have no brother or sister but that man's father is my fathers's son'' Whose photograph was it:
1) His nephew's 2) His Fatehrs's
3) His son's 4) His own
స్కాలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్:ఇందులో సోషల్ సెన్సైస్; సెన్సైస్; మ్యాథమెటిక్స్‌లకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. గత పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి, సబ్జెక్టుల వారీగా ముఖ్యమైన అంశాలను గుర్తించి, వాటిని క్షుణ్నంగా చదవాలి. సబ్జెక్టుల్లోని ముఖ్యమైన భావనలను నోట్సులో రాసుకొని, వాటిని వీలున్నప్పుడు పునశ్చరణ చేయాలి. సోషల్ సెన్సైస్‌కు సంబంధించి జాగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్స్, హిస్టరీ అంశాలను ప్రాధాన్య క్రమంలో అధ్యయనం చేయాలి.
The angle between the bisectors of the two acute angles of a right angle triange is..
1) 900 2) 1121/20
3) 1350 4) 1200
Ans: 3
Of which revolution was the motto "Liberty, Equality, Fraternity''..
1) The Britain Revolution
2) The American Revolution
3) The Russian Revolution
4) The French Revolution