‘ఇతని తల్లి, మా నాన్న ఏకైక కుమారుడి భార్య’...
పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలో అర్థమెటిక్- రీజనింగ్ విభాగాల నుంచి దాదాపుగా 50 శాతం ప్రశ్నలు వస్తాయి. అంటే దాదాపు సగం మార్కులు విశ్లేషణ సామర్థ్యం మీదనే ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా రీజనింగ్ విభాగంలో.. వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనే రెండు అంశాలు ఉంటాయి. ఇందులో వెర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ రీజనింగ్‌లో.. సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, తార్కిక వెన్ చిత్రాలు, సిల్లాయిజమ్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కాబట్టి ఈ విభాగంపై ఎక్కువగా దృష్టి సారించాలి. మాదిరి ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇందులో మంచి స్కోర్ సాధించవచ్చు. ఈ నేపథ్యంలో బ్లడ్ రిలేషన్‌స (రక్త సంబంధాలు) విభాగం కోసం ఏ విధంగా సిద్ధం కావాలో సూచనలు..
రీజనింగ్
అందరికీ సుపరిచితమైన అంశం రక్త సంబంధాలు. ఎవరికి ఎవరు ఏమవుతారు అనే అంశం అందరికీ తెలుసు. కానీ రక్త సంబంధాలు దేశ వ్యాప్తంగా అన్నిచోట్ల ఒకే విధంగా ఉండవు.ఉదాహరణకు మన ప్రాంతంలో అమ్మ సోదరుని కొడుకును బావమరిది అని, అమ్మ సోదరుని కూతురుని మరదలు అని అంటాం. కానీ ఉత్తర భారతదేశంలో వీరిని సోదరుడు, సోదరిగా భావిస్తారు. కానీ పరీక్ష పరంగా మాత్రం వీరిని కజిన్ అని చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన మరో అంశం..‘కజిన్’ అనే పదానికి తెలుగులో సరైన పదం లేదు. కాబట్టి పరీక్షలో ‘కజిన్’ అని మాత్రమే ఇస్తారు. అమ్మ సోదరి పిల్లల్ని లేదా నాన్న సోదరుని పిల్లల్ని మనం సోదరుడు, సోదరిగా భావించినప్పటికీ పరీక్షల దృష్ట్యా కజిన్ అనేదే సరైన సమాధానం అవుతుంది. ఆంగ్లంలో అంకుల్ అనే పదానికి తెలుగులో చాలా అర్థాలు ఉన్నాయి. సాధారణంగా అమ్మ సోదరుడు (మామ) లేదా నాన్న సోదరుడు (పెదనాన్న లేదా చిన్నాన్న) అంకుల్ అవుతాడు.అదేవిధంగా ఆంగ్లంలో ఆంటీ అనే పదాన్ని తెలుగులో అమ్మ సోదరి (పెద్దమ్మ లేదా చిన్నమ్మ) లేదా నాన్న సోదరి (అత్త)ని పిలవడానికి ఉపయోగిస్తాం.ఒక అబ్బాయి తన అమ్మ లేదా నాన్న ఏకైక కొడుకు అని చెబితే ఆ వ్యక్తిగానే తీసుకోవాలి. ఒక అబ్బాయి తన అమ్మ లేదా నాన్న ఏకైక కూతురు అని చెబితే ఆ అమ్మాయిని, చెప్పిన అబ్బాయికి సోదరిగా భావించాలి.
పరీక్షల్లో అడిగే వరుసలు
అమ్మ సోదరి - పెద్దమ్మ/చిన్నమ్మ(ఆంటీ)
నాన్న సోదరి - అత్త (ఆంటీ)
అమ్మ సోదరుడు - మామ (అంకుల్)
నాన్న సోదరుడు - పెదనాన్న / చిన్నాన్న (అంకుల్)
సోదరుడు లేదా సోదరి - తోడపుట్టినవారు / అమ్మా, నాన్న పిల్లలు అమ్మ లేదా నాన్నల సోదరుడు లేదా సోదరి పిల్లలు - కజిన్
బావ/బావమరిది - భార్య లేదా భర్త సోదరుడు లేదా సోదరి భర్త
వదిన/మరదలు- భార్య లేదా భర్త సోదరి లేదా
సోదరుని భార్య
కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం
1.ఒక వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తిని పరిచయం చేస్తూ అతను, తన నాన్న ఏకైక కుమారుడు అని చెప్పాడు. అయితే అతనికి ఫోటోలో ఉన్న వ్యక్తి ఏమవుతాడు?
తన నాన్న ఏకైక కొడుకు అంటే అతనే కాబట్టి ఫోటోలో ఉంది తన ఫోటోనే.
2.అ ఏకైక కొడుకు ఆ అయితే ఆకి అ ఏమవుతాడు?
అ ఏకైక కొడుకు ఆ. కానీ ఇక్కడ అ లింగం తెలియదు. కాబట్టి అ తల్లి లేదా తండ్రి కావచ్చు. కాబట్టి సరైన సమాధానం చెప్పలేం.
3.రాధ ఎదరుగా వస్తున్న అబ్బాయిని పరిచయం చేస్తూ, అతను నా సోదరి తండ్రి ఏకైక కొడుకు అని చెప్పాడు. అయితే రాధకు అతను ఏమవుతాడు?
రాధ సోదరి తండ్రి రాధకు తండ్రి అవుతారు. రాధ తండ్రి కొడుకు, రాధకు సోదరుడు అవుతాడు.
4.ఒక ఛాయా చిత్రం చూపి ఒకతను ఈ విధంగా చెప్పాడు. ‘నాకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెల్లు కానీ లేరు. కానీ ఆ మానవుని తండ్రి, నా తండ్రి కొడుకు’ ఇది ఎవరి ఛాయా చిత్రం?
నాకు అన్నదమ్ములు, అక్కా చెల్లెల్లు కానీ లేదు అనే వాక్యం ద్వారా అతను, తన తల్లిదండ్రులకు ఏకైక కొడుకు అని తెలుస్తుంది. ఇందులో రెండో వాక్యం ఆ మానవుని తండ్రి, నా తండ్రి కొడుకు అని చెప్పాడు. అంటే ఆ మానవుని తండ్రి అతనే అని అర్థమవుతుంది.
5.శివ ఎదురుగా వస్తున్న అమ్మాయిని పరిచయం చేస్తూ, ఆమె మా అమ్మ సోదరుని కూతురు అని చెప్పాడు. అయితే శివకు ఆ అమ్మాయి ఏమవుతుంది?
అమ్మ సోదరుడు మామ. మామ కూతురు మరదలు. కానీ పరీక్ష దృష్ట్యా కజిన్ అనేదే సరైన సమాధానం.
6.మధు ఒకమ్మాయిని పరిచయం చేస్తూ, ఆ అమ్మాయి తల్లి, నా తండ్రి ఏకైక కుమారుడి భార్య అని చెప్పాడు. అయితే ఆ అమ్మాయి మధుకు ఏమవుతుంది?
మధు అమ్మాయిని పరిచయం చేస్తూ, అమ్మాయి తల్లి గురించి చెప్పాడు. ఆ అమ్మాయి తల్లి, మధు తండ్రి ఏకైక కొడుకు భార్య అని చెప్పాడు. మధు తండ్రి ఏకైక కొడుకు అంటే అతనే అవుతాడు. అంటే ఆ అమ్మాయి తల్లి మధు భార్య అవుతుంది.
ఙ ఆ అమ్మాయి మధుకు కూతురు అవుతుంది.
7.ధీరజ్, ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ, అతని ఏకైక సోదరుడు, నా కూతురు తండ్రికి అని చెప్పాడు. అయితే ధీరజ్‌కు ఆ వ్యక్తి ఏమవుతాడు?
ధీరజ్ కూతురి తండ్రికి తండ్రి అంటే ధీరజ్‌కు తండ్రి అవుతాడు. కాబట్టి ధీరజ్ తండ్రి, తాను పరిచయం చేస్తున్న వ్యక్తికి సోదరుడు. అంటే ధీరజ్ పరిచయం చేస్తున్న వ్యక్తి, తన తండ్రి సోదరుడు. కాబట్టి అతను ధీరజ్‌కు పెదనాన్న/ చిన్నాన్న (అంకుల్) అవుతాడు.
8.అ,ఆ సోదరులు. ఇ, ఈ సోదరీమణులు. అ కూతురు ఇ. అయితే ఈకి ఆ ఏమవుతాడు?
ఇ, ఈ సోదరీమణులు. అ కూతురు ఇ. కాబట్టి ఇ, ఈ ఇద్దరు అ కూతుళ్లు.
ఈ తండ్రి సోదరుడు ఆ. కాబట్టి ఈకి ఆ పెదనాన్న/చిన్నాన్న (అంకుల్) అవుతాడు.
9.వినయ్, రాజును పరిచయం చేస్తూ, ఇతను మానాన్న ఏకైక కొడుకు కొడుకు అని చెప్పాడు. అయితే వినయ్‌కు రాజు ఏమవుతాడు?
వినయ్ నాన్న ఏకైక కొడుకు అంటే వినయ్ అవుతాడు.
వినయ్‌కు రాజు కొడుకు అవుతాడు.
10.హర్ష, ఆదిత్యను పరిచయం చేస్తూ, ‘ఇతని తల్లి, మా నాన్న ఏకైక కొడుకు భార్య’ అని చెప్పాడు. అయితే హర్షకు ఆదిత్య ఏమవుతాడు?
హర్ష నాన్న ఏకైక కొడుకు భార్య అంటే హర్ష భార్య అవుతుంది. ఆదిత్య తల్లి, హర్ష భార్య ఒక్కరే. అంటే హర్షకు ఆదిత్య కొడుకు అవుతాడు.
11.రవి, మధును పరిచయం చేస్తూ, ఇతను నా కూతురు తండ్రి సోదరుడు అని చెప్పాడు. అయితే రవికి మధు ఏమవుతాడు?
రవి కూతురు తండ్రి అంటే రవి అవుతాడు.
ఙ రవికి మధు సోదరుడు అవుతాడు.
రక్త సంబంధాల్లో కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా కూడా ప్రశ్నలు అడుగుతారు. కొన్నిప్రశ్నలను పరిశీలిద్దాం.
12.ఒక కుటుంబంలో భార్యాభర్త ఉన్నారు. వారికి ముగ్గురు కొడుకులు. ప్రతీ కొడుక్కి ఇద్దరు సోదరీమణులు. అయితే ఆ కుటుంబంలో ఎంతమంది మగవారు, ఎంతమంది ఆడవారు?
ప్రతి కొడుక్కి ఇద్దరు సోదరీమణులు అంటే 3ప2 = 6 అనేది సరైంది కాదు. వారి ముగ్గురికి కలిపి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అంటే ప్రతీ కొడుక్కి ఇద్దరు సోదరీమణులుగా చెప్పుకోవచ్చు. ఆ కుటుంబంలోని ఆడ, మగ సభ్యుల సంఖ్యను కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు.