హైదరాబాద్‌ను భాగ్ నగరమని మొదటగా పేర్కొంది? | First mention City of Hyderabad Bagh | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ను భాగ్ నగరమని మొదటగా పేర్కొంది?

Published Thu, Oct 30 2014 4:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

హైదరాబాద్‌ను భాగ్ నగరమని మొదటగా పేర్కొంది? - Sakshi

హైదరాబాద్‌ను భాగ్ నగరమని మొదటగా పేర్కొంది?

1.    గోల్కొండ కుతుబ్‌షాహీల పాలనకు ఆధ్యుడు?
     1) ఇబ్రహీం కుతుబ్‌షా    2) అబుల్ హసన్ తానీషా
     3) సుల్తాన్ కులీకుతుబ్‌షా    4) జంషేడ్
 
 2.    కుతుబ్ షాగా పేరొందిన మొదటి గోల్కొండ రాజు?
     1) సుల్తాన్ కులీ    2) ఇబ్రహీం
     3) అబ్దుల్లా        4) అబుల్ హసన్
 
 3.    కుతుబ్ షాహీలు ఏ దేశానికి చెందిన వారు?
     1) పర్షియా        2) సౌదీ అరేబియా
     3) టర్కీ        4) కజకిస్థాన్
 
 4.    బహమనీ సుల్తాన్‌ల కాలంలో తెలంగాణ ప్రాంత గవర్నర్‌గా వ్యవహరించే వారిని ఏమని పిలిచేవారు?
     1) నిజాం ఉల్ ముల్క్    2) కుతుబ్ ఉల్ ముల్క్
     3) కుతుబ్ షా    4) తానీషా
 
 5.    వరంగల్ కోటపై దండెత్తి కుతుబ్ షాహీలకు సవాల్ విసిరింది?
     1) వేమారెడ్డి        2) రామయ్య
     3) సీతయ్య        4) నరసింహారెడ్డి
 
 6.    భారతదేశ చరిత్రలో తెలుగు వారంతా మొదటిసారిగా ఏ రాజుల కాలంలో ఒకే రాజ్యం కిందకు వచ్చారు?
     1) బహమనీ సుల్తాన్‌లు    2) కాకతీయులు
     3) విజయనగర రాజులు    4) కుతుబ్ షాహీలు
 7.    ‘ఆంధ్ర సుల్తాన్‌లు’గా ప్రసిద్ధి చెందింది?
     1) బహమనీ సుల్తాన్‌లు    2) అసఫ్ జాహీలు
     3) కుతుబ్ షాహీలు    4) నిజాం షాహీలు
 
 8.    సుల్తాన్ కులీ కుతుబ్ షా దగ్గర సైన్యాధికారిగా పని
 చేసిన విజయనగర రాజు?
     1) తిరుమలరాయలు    2) అళియ రామరాయలు
     3) వెంకటపతిరాయలు    4) ఎవరూ కాదు
 
 9.    ‘సుల్తాన్ కులీ’ అంటే?
     1) సుల్తాన్ బానిస    2) సుల్తాన్ అనుచరుడు
     3) సుల్తాన్ ఆశీస్సులు కలవాడు
     4) సుల్తాన్ అధికార ముద్ర కలవాడు
 
 10.     గోల్కొండ కుతుబ్ షాహీల పాలనా కాలం?
     1) 1518 - 1687    2) 1545 - 1628
     3) 1563 - 1694    4) 1556 - 1652
 
 11.    కులీ కుతుబ్‌షా గోల్కొండ చుట్టూ పక్కల ప్రాంతానికి ఏ పేరు పెట్టాడు?
     1) హైదరాబాద్    2) సికింద్రాబాద్
     3) సుల్తాన్‌పూర్    4) మహ్మాదా నగరం
 
 12.    అళియ రామరాయల ఆశ్రయం పొందిన కుతుబ్ షాహీల రాజు?
     1) జంషేద్    2) ఇబ్రహీం    3) సుబాన్    4) కుత్బుద్దీన్
 
 13.    తెలుగు సాహిత్యకారులు ఏవరిని ‘మల్కిభరాముడి’ గా కీర్తించారు?
     1) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
     2) సుల్తాన్ మహ్మద్ కుతుబ్‌షా
     3) ఇబ్రహీం కుతుబ్‌షా    4) అబుల్ హసన్ తానీషా
 
 14.    హుస్సేన్‌సాగర్ చెరువును, మూసీ నదిపై మొదటిసారిగా వంతెనను నిర్మించింది?
     1) ఇబ్రహీం కుతుబ్‌షా    2) అబ్దుల్లా కుతుబ్‌షా
     3) అబుల్ హసన్ కుతుబ్ షా    4) జంషేద్
 
 15.    గోల్కొండను పాలించిన వారిలో మొట్టమొదటగా నాణేలను ముద్రించింది?
     1) నిజాం ఉల్ - ముల్క్    2) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
     3) ఇబ్రహీం కుతుబ్‌షా    4) మహ్మద్ కుతుబ్ షా
 
 16.    హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారు?
     1) ఇబ్రహీం కుతుబ్ షా
     2) మహ్మద్ కులీ కుతుబ్ షా
     3) మహ్మద్ కుతుబ్ షా    4) సుల్తాన్ కులీకుతుబ్ షా
 
 17.    హైదరాబాద్ నగర నిర్మాణం ఏ సంవత్సరంలో జరిగింది?
     1) 1590    2) 1591    3) 1592    4) 1593
 18.    చార్మినార్ నిర్మాత?
     1) ఇబ్రహీం కుతుబ్ షా
     2) మహ్మద్ కులీ కుతుబ్ షా
     3) అబుల్ హసన్ తానీషా
     4) సుల్తాన్ కులీ కుతుబ్ షా
 
 19.    హైదరాబాద్ నగర పూర్వం పేరైన భాగ్యనగరానికి ‘భాగమతి’కీ ఎలాంటి సంబంధం లేదని అభిప్రాయపడిన ప్రఖ్యాత చరిత్రకారుడు?
     1) ఫైజీ        2) షేర్వాణీ
     3) టావెర్నియర్    4) ఫెరిష్టా
 
 20.    ఏ కుతుబ్ షా కాలంలో గోల్కొండకు మొఘల్ చక్రవర్తి అక్బర్ తన రాయబారిని పంపాడు?
     1) మహ్మద్ కుతుబ్ షా    2) మహ్మద్ కులీ కుతుబ్ షా
     3) ఇబ్రహీం కుతుబ్ షా    4) అబ్దుల్లా కుతుబ్‌షా
 
 21.    {Mీ.శ. 1611లో ఇంగ్ల్లిష్ ఈస్టిండియా కంపెనీ వారికి మచిలీపట్టణంలో వర్తక స్థావరం ఏర్పర్చుకోవడానికి అనుమతిచ్చిన రాజు?
     1) శ్రీకృష్ణదేవరాయలు    2) అళియ రామరాయలు
     3) ఇబ్రహీం కుతుబ్ షా
     4) మహ్మద్ కులీ కుతుబ్ షా
 
 22.    మొఘల్ యువరాజు షాజహాన్ గోల్కొండ రాజ్యంలో ఆశ్రయం పొందిన సమయంలో రాజుగా ఉన్న కుతుబ్ షా?
     1) ఇబ్రహీం        2) అబ్దుల్లా
     3) మహ్మద్        4) అబుల్‌హాసన్
 
 23.    మొఘల్ చక్రవర్తి షాజహాన్‌తో ‘ఇంకియాద్ నామా’ (విధేయత పత్రం)ను కుదుర్చుకున్న గోల్కొండ రాజు?
     1) అబుల్ హసన్ తానీషా    2) అబ్దుల్లా కుతుబ్ షా
     3) మహ్మద్ కులీ కుతుబ్ షా    4) ఎవరూ కాదు
 
 24.    {Mీ.శ. 1656లో గోల్కొండ కోటపై స్వయంగా దాడి
 చేసిన మొఘల్ చక్రవర్తి?
     1) ఔరంగజేబు    2) షాజహాన్
     3) జహంగీర్    4) అక్బర్
 
 25.    అబుల్ హసన్ కుతుబ్ షా వద్ద మాదన్న నిర్వర్తించిన పదవి?
     1) మీర్ ఖాసిం    2) మీర్ జుమ్లా
     3) హజీబ్        4) తరఫ్ దార్
 
 26.    దక్కన్‌లో మొఘలుల దండయాత్రను ప్రతిఘటించడానికి అబుల్ హసన్ కుతుబ్ షా ఎవరితో సంధి చేసుకున్నాడు?
     1) బీజాపూర్ సుల్తాన్    2) విజయనగర రాజులు
     3) ఈస్టిండియా కంపెనీ    4) శివాజీ
 
 27.    గోల్కొండలో కుతుబ్ షాల పాలన ఏ సంవత్సరంలో అంతమైంది?
     1) 1687    2) 1694    3) 1684    4) 1697
 
 28.    హైదరాబాద్‌ను భాగ్ నగరమని (తోటల నగరం) మొట్టమొదటగా పేర్కొంది?
     1) గోల్కొండలోని విదేశీ రాయబారులు
     2) దక్కన్‌లోని మొఘల్ అధికారులు
     3) ముస్లిం చరిత్రకారులు
     4) గోల్కొండ సుల్తాన్‌లు
 
 29.     ఏ కుతుబ్ షా పాలనా కాలం నుంచి గోల్కొండ రాజ్య పతనం ప్రారంభమైంది?
     1) మహ్మద్ కులీ కుతుబ్ షా
     2) మహ్మద్ కుతుబ్ షా
     3) అబ్దుల్లా కుతుబ్‌షా     4) అబుల్ హసన్ తానీషా
 
 30.    చివరి కుతుబ్ షా పాలకుడు?
     1) సుబాన్ కుతుబ్ షా    2) అబ్దుల్లా కుతుబ్‌షా
     3) మహ్మద్ కుతుబ్ షా    4) అబుల్ హాసన్ తానీషా
 
 31.    ఇబ్రహీం కుతుబ్‌షా ఆస్థాన కవి?
     1) క్షేత్రయ్య        2) అన్నమయ్య
     3) సోమయాజీ    4) అద్దంకి గంగాధర కవి
 
 32.    ‘యయాతి చరిత్ర’ను రాసిన పొన్నెగంటి తెలగ నార్యుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు?
     1) మహ్మద్ కులీ కుతుబ్ షా
     2) అబుల్ హాసన్ తానీషా
     3) ఇబ్రహీం కుతుబ్ షా    4) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
 
 33.    కుతుబ్ షాహీల పాలనా కాలానికి చెందిన ప్రసిద్ధ తెలుగు కవి?
     1) అన్నమయ్య    2) నన్నయ్య
     3) యోగి వేమన    4) బద్దెన
 
 34.    ఆంగ్ల భాషా సాహిత్య కర్త ‘ఛాసర్’తో పోల్చదగ్గ గోల్కొండ సుల్తాన్?
     1) ఇబ్రహీం కుతుబ్ షా
 
     2) మహ్మద్ కులీ కుతుబ్ షా
     3) అబుల్ హసన్ తానీషా    4) మహ్మద్ కుతుబ్ షా
 35.    మువ్వ గోపాల పదాల సృష్టికర్త?
     1) భక్తరామదాసు    2) అన్నమయ్య
     3) క్షేత్రయ్య        4) వేమన్న
 
 36.    హైదరాబాద్‌లోని పురాతన కట్టడాలు ఎక్కువగా ఏ రకమైన సంస్కృతికి సంబంధించినవి?
     1) ఇండో - ఆర్యన్    2) ఇండో - పర్షియన్
     3) ఇండో - గ్రీక్
     4) ఇండో - యూరోపియన్
 
 37.    హైదరాబాద్ నగర నిర్మాణం ఏ అధికారి పర్యవేక్షణలో జరిగింది?
     1) మీర్‌జుమ్లా సయ్యద్ జాఫ్రీ
     2) మీర్ జుమ్లా మాదన్న
     3) పీష్వా మీర్ ముమిన్ అస్త్రబరి
     4) పీష్వామీర్ ముమిన్ అమల్ గుజర్
 
 38.    కుతుబ్ షాల పాలనలో రాజుకు సలహా సహాయ సహకారాలను అందించే ముఖ్య కార్యనిర్వాహక వర్గాన్ని ఏమని పిలిచేవారు?
     1) మజ్లీస్        2) కార్కుం
     3) అమిల్ గుజార్‌‌ల    4) చిహల్ గనీ
 
 39.    ‘మీర్ జుమ్లా’ అంటే?
     1) ముఖ్య సైనికాధికారి    2) ప్రధానమంత్రి
     3) సైనిక మంత్రి    4) రెవెన్యూ మంత్రి
 
 40.    కుతుబ్‌షాల కాలంలో పట్టణంలో పన్ను వసూలు హక్కును పొందిన వ్యక్తిని ఏమనేవారు?
     1) కోత్వాల్        2) సార్ఖెల్
     3) దాబిర్        4) హవల్దార్
 41.    కుతుబ్ షాల పతనానంతరం క్రీ.శ. 1687లో
 
 గోల్కొండ రాజ్య పాలన మొఘలుల పాలనలోకి వెళ్లింది. అ సమయంలో దక్కన్ గవర్నర్?
     1) జాఫర్ జంగ్    2) ఫీరోజ్ జంగ్
     3) సికిందర్ జంగ్    4) నాజర్ జంగ్
 
 42.    నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు?
     1) ముబారిజ్ ఖాన్    2) అఫ్జల్ ఖాన్
     3) చిన్‌క్లిచ్‌ఖాన్    4) అమీర్‌ఖాన్
 
 43.    నిజాం ఉల్ ముల్క్ ఏ యుద్ధంలో గెలవడం వల్ల గోల్కొండ రాజ్యంపై పూర్తి ఆధిపత్యం వహించాడు?
     1) రాక్షసతంగడీ    2) షఖర్ ఖేరో
     3) వినుకొండ    4) దౌలతాబాద్
 
 44.    మొఘల్ చక్రవర్తి మహ్మద్ షా, నిజాం ఉల్ ముల్క్‌నకు ఇచ్చిన బిరుదు?
     1) నిజాం షా    2) కుతుబ్ షా
     3) ముకరంజా    4) ఆసఫ్ జా
 
 45.    తెలంగాణాలో అసఫ్ జాహీల పాలన ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
     1) 1724     2) 1726     3) 1725     4) 1728
 46.    స్వయంగా కవి అయిన కుతుబ్ షాహీ రాజు?
     1) సుల్తాన్ కులీ కుతుబ్ షా
     2) మహ్మద్ కుతుబ్ షా    3) అబుల్ హసన్ తానీషా
     4) ఇబ్రహీం కుతుబ్ షా
 
 47.     కుతుబ్ షాహీల కాలంలో ఆయుధాల తయారీకి ప్రసిద్ధి చెందిన పట్టణం?
     1) సికింద్రాబాద్    2) దేవరకొండ
     3) నిర్మల్        4) కంభం మెట్టు
 
 48.    క్షేత్రయ్య తన రచనలను ఏ కుతుబ్ షాహీ రాజుకు అంకితమిచ్చాడు?
     1) ఇబ్రహీం కుతుబ్ షా    2) అబుల్ హసన్ తానీషా
     3) అబ్దుల్లా కుతుబ్ షా
     4) మహ్మద్ కులీ కుతుబ్‌షా
 
 49.    ‘దాశరథి శతకం’ రాసింది?
     1) అద్దంకి గంగాధర కవి    2) గోనా బుద్ధారెడ్డి
     3) కంచర్ల గోపన్న    4) క్షేత్రయ్య
 
 సమాధానాలు
 1) 3;    2) 2;    3) 1;    4) 2;    5) 3;
 6) 4;    7) 3;    8) 2;    9) 1;    10) 1;
 11) 4;    12) 2;    13) 3;    14) 1;    15) 3;
 16) 2;    17) 2;    18) 2;    19) 2;    20) 2;
 21) 4;    22) 3;    23) 2;    24) 1;    25) 2;
 26) 4;    27) 1;    28) 2;    29) 2;    30) 4;
 31) 4;    32) 3;    33) 3;    34) 2;    35) 3;
 36) 2;    37) 3;    38) 1;    39) 2;    40) 4;
 41) 1;    42) 3;    43) 2;    44) 4;    45) 1;
 46) 2;    47) 3;    48) 2;    49) 3.
 
 గతంలో వచ్చిన ప్రశ్నలు
 1.    తానీషాగా ఏ కుతుబ్ షాని పిలిచే వారు?
     1) అబ్దుల్లా కుతుబ్‌షా
     2) ఇబ్రహీం కుతుబ్ షా
     3) సుల్తాన్ కులీ కుతుబ్ షా
     4) అబుల్ హసన్ కుతుబ్ షా
 
 2.    వైజయంతీ విలాసాన్ని రచించిన కవి?
     1) కందుకూరి రుద్రకవి
     2) అద్దంకి గంగాధర కవి
     3) సరంగు తమ్మయ మంత్రి
     4) పట్ట మెట్ట సోమయాజీ
 
 3.    కందుకూరి రుద్రకవి ఏ కుతుబ్ షా రాజు కాలానికి చెందినవాడు?    
     1) సుల్తాన్ కులీ కుతుబ్ షా
     2) ఇబ్రహీం కుతుబ్ షా
     3) మహ్మద్ కులీ కుతుబ్ షా
     4) అబుల్ హాసన్ తానీషా
 
 4.    ‘మహత్‌సిబ్’ అనే అధికారి ప్రధాన విధి?
     1) ఆదాయ వ్యయాల గణన
     2) రాజు ముఖ్య సలహాదారు
     3) మత సంబంధ ప్రచారం
     4) నైతిక విలువల ప్రచారం
 
 సమాధానాలు
     1) 4;    2) 3;    3) 2;    4) 4.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement