క్లర్క్స్ కామన్ రిటెన్ ఎగ్జామినేషన్ (సీడబ్ల్యూఈ).. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(ఎస్‌బీఐ, దాని అనుబంధ బ్యాంకుల్లో మినహా) క్లరికల్ ఉద్యోగాల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు నిర్వహించే పరీక్ష. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తోంది. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆయా బ్యాంకుల్లో 2017 మార్చి వరకు క్లరికల్ ఉద్యోగాలు పొందడానికి అర్హులు.
మార్పులివీ:
ఐబీపీఎస్ గత సీడబ్ల్యూఈలో ఒకే రాత పరీక్ష ఉండేది. దానిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వివిధ బ్యాంకులు నోటిఫికేషన్లు జారీ చేసిన సమయంలో దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు. ఈసారి పరీక్ష రూపురేఖలు మారాయి. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతోంది. అవి.. ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ. నోడల్ బ్యాంకుల సహకారంతో ఐబీపీఎస్ కామన్ ఇంటర్వ్యూ నిర్వహించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాల ఆధారంగా రిక్రూట్‌మెంట్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తమకు అనువైన రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత:
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమానం. కంప్యూటర్ ఆపరేషన్స్/లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్/ డిప్లొమా/డిగ్రీ తప్పనిసరి. దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర అధికార భాషా పరిజ్ఞానం ఉండాలి.
వయసు: 2015 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
ఎంపిక:
ఎంపిక ప్రక్రియను 3 దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. గంట వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. దీన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో 3 సెక్షన్లు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. ఇందులో అర్హత సాధిస్తే మెయిన్ పరీక్షకు అనుమతిస్తారు.
రెండో దశలో మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇందులో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు.
మూడో దశ ఇంటర్వ్యూ. 100 మార్కులకు ఉంటుంది. కనీసం 40 శాతం మార్కులు(ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ - 35 శాతం) వచ్చిన అభ్యర్థులను ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. 2016-17లో బ్యాంకుల అవసరాల నిమిత్తం ఎంతమంది ఉద్యోగులు కావాలో ఐబీపీఎస్‌కు వచ్చిన ఖాళీల సమాచారం ఆధారంగా ప్రొవిజనల్ అలాట్‌మెంట్ ఇస్తారు. మెరిట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా బ్యాంకులు అభ్యర్థులను నియమించుకుంటాయి.
పరీక్ష విధానం:ప్రిలిమ్స్(గంట):
విభాగం {పశ్నలు మార్కులు
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30
న్యూమెరికల్ ఎబిలిటీ 35 35
రీజనింగ్ ఎబిలిటీ 35 35
మొత్తం 100 100
మెయిన్(రెండు గంటలు):
విభాగం {పశ్నలు మార్కులు
రీజనింగ్ 40 40
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 40
జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్
రంగానికి ప్రాధాన్యం) 40 40
కంప్యూటర్ నాలెడ్జ్ 40 40
మొత్తం 200 200
దరఖాస్తు లభ్యత: ఐబీపీఎస్ వెబ్‌సైట్‌లో 2015 ఆగస్టు 11 నుంచి సెప్టెంబర్ 1 వరకు అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100. దరఖాస్తు రుసుంను ఆన్‌లైన్‌లో క్రెడిట్/ డెబిట్/ నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి.దరఖాస్తు విధానం: ఐబీపీఎస్ వెబ్‌సైట్ ఠీఠీఠీ.జీఛఞట.జీలో లాగిన్ అయి క్లరికల్ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన వివరాలు, ఫొటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
పరీక్షా కేంద్రాలు:
ఆంధ్రప్రదేశ్: చీరాల, చిత్తూరు, గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 2015 ఆగస్టు 11
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 2015 సెప్టెంబర్ 1
ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2015 డిసెంబర్ 5, డిసెంబర్ 6, డిసెంబర్ 12, డిసెంబర్ 13
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల విడుదల: 2015 డిసెంబర్
మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష: 2016 జనవరి 2, జనవరి 3
ఇంటర్వ్యూ: 2016 ఫిబ్రవరి
ప్రొవిజనల్ అలాట్‌మెంట్: 2016 ఏప్రిల్
వెబ్‌సైట్: www.ibps.in
బ్యాంకింగ్‌లో సుస్థిర కెరీర్‌కు ఐబీపీఎస్ క్లరికల్
Published Thu, Jul 30 2015 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement
Advertisement