గ్రామీణ బ్యాంకులకు గెలుపు బాట వేయాలంటే? | Rural banks in order to win the trail | Sakshi
Sakshi News home page

గ్రామీణ బ్యాంకులకు గెలుపు బాట వేయాలంటే?

Published Thu, Jun 26 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

గ్రామీణ బ్యాంకులకు గెలుపు బాట వేయాలంటే?

గ్రామీణ బ్యాంకులకు గెలుపు బాట వేయాలంటే?

 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్ ఏ ఆఫీసర్లు (స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3); గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్ల (బహుళ విధులు) ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) ఉమ్మడి రాత పరీక్ష నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని బ్యాంకులు: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, దక్కన్ గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణబ్యాంకు.
 
 అర్హతలు:
 ఆఫీస్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం అవసరం. కంప్యూటర్ పరిజ్ఞానం అభిలషణీయం. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు సడలింపు ఉంటుంది.ఆఫీసర్ స్కేల్ 1: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హజ్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, పిసీకల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ గ్రాడ్యుయేట్లకు ప్రాధాన్యమిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానం అభిలషణీయం. వయసు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
 
 ఆఫీసర్ స్కేల్ 2 (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత. నిర్దేశ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ప్రాధాన్యమిస్తారు. బ్యాంకు లేదా ఏదైనా ఆర్థిక సంస్థలో రెండేళ్ల ఆఫీసర్ అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 (స్పెషలిస్టు ఆఫీసర్లు): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టులకు లక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/కంప్యూటర్‌సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాంచిల్లో డిగ్రీ లేదా తత్సమాన అర్హత. అఞ, ్కఏ్క, ఇ++, చఠ్చి, గఆ, గఇ, వంటి వాటిలో సర్టిఫికెట్ అభిలషణీయం. చార్టర్డ్ అకౌంటెంట్ పోస్టు కోసం సీఏ, లా ఆఫీసర్‌కు గుర్తింపు విశ్వవిద్యాలయం నుంచి లా డీగ్రీ ఉండాలి. ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చరల్ ఆఫీసర్ పోస్టులకు కూడా సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ ఉండాలి. అనుభవం అవసరం. వయసు 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
 
 ఆఫీసర్ స్కేల్ 3: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత. ఏదైనా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల్లో కనీసం ఐదేళ్ల అనుభం అవసరం.    ఎంపిక విధానం: ఉమ్మడి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు జరుగుతాయి. ఉమ్మడి పరీక్షను ఐబీపీఎస్ నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ కోసం ఖాళీలను బట్టి ఆయా బ్యాంకులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయి. అప్పుడు మళ్లీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.పరీక్ష విధానం: ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు. ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా పరీక్ష నిర్వహిస్తారు. హిందీ/ఇంగ్లిష్ మాధ్యమంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత విధిస్తారు.
 
 ప్రిపరేషన్ ప్రణాళిక
 రీజనింగ్:అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్; నాన్ వెర్బల్ రీజనింగ్ తదితర అంశాలుంటాయి. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. దీంతో సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.
 
 న్యూమరికల్ ఎబిలిటీ:
 ప్రాథమిక క్యాలిక్యులేషన్ నైపుణ్యాలను పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. కూడికలు, తీసివేతలు, వర్గాలు, ఘనాలు, వర్గమూలాలు, ఘనమూలాలు వంటి వాటికి సంబంధించి 15-20 ప్రశ్నలు వస్తాయి. శాతాలు, భిన్నాలు, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, అనుపాతాలు, లాభనష్టాలు, భాగస్వామ్యం, కాలం-పని, కాలం-దూరం తదితర అంశాలకు సంబంధించి సమస్యల్ని సాధన చేయాలి. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని ప్రాథమిక గణిత అంశాలను పరిశీలించాలి. సూత్రాలు, వాటి ఆధారంగా సమస్యలను సాధించాలి. షార్ట్‌కట్స్‌ను ఉపయోగించి సమస్యల్ని సాధిస్తే సమయం ఆదా అవుతుంది.
 
 జనరల్ అవేర్‌నెస్:
 జనరల్ అవేర్‌నెస్‌లో అధిక మార్కులు సాధించాలంటే సమకాలీన అంశాలు, ఆర్థిక-సామాజిక-రాజకీయ పరిణామాలపై దృష్టిసారించాలి. రోజూ దినపత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం-వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా విధానాలు, ఆర్‌బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు-కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి అవార్డులు, పుస్తకాలు-రచయితలు, క్రీడలు-విజేతలు తదితరాలను చదవాలి.
 
 ఇంగ్లిష్ లాంగ్వేజ్:
 గ్రామీణ నేపథ్యం ఉన్న వారు క్లిష్టంగా భావించే విభాగం జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబ్యులరీ, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వొకాబ్యులరీపై అవగాహనతో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. వొకాబ్యులరీపై పట్టుసాధించేందుకు ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతూ వాటిలో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదాలను అధ్యయనం చేయాలి. బేసిక్ గ్రామర్, సబ్జెక్ట్ - వెర్బ్ సంబంధం, టెన్సెస్‌పై అవగాహన ఉండాలి. మొత్తంమీద పదో తరగతి స్థాయిలోని గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకుంటే ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడం సులువే.
 
 కంప్యూటర్ నాలెడ్జ్:
 కంప్యూటర్ అవేర్‌నెస్‌కు సంబంధించి బేసిక్ కంప్యూటర్ పదజాలం, హార్‌‌డవేర్ అండ్ సాఫ్ట్‌వేర్ బేసిక్స్, కంప్యూటర్ ఉపయోగాలు, కంప్యూటర్ భాగాలు, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్, వర్‌‌డ, ఎక్స్‌సెల్, పవర్‌పాయింట్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. పత్రికల్లోని సైన్స్ అండ్ టెక్నాలజీ పేజీలను చదవడం ద్వారా కొత్త ఆవిష్కరణలను గుర్తించవచ్చు.
 
 రిఫరెన్స్:
 ఆర్‌ఎస్ అగర్వాల్:
 డేటా అనాలిసిస్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, రీజనింగ్.
 టాటా మెక్‌గ్రాహిల్: ఆబ్జెక్టివ్ ఇంగ్లిష్
 (హరి మోహన్ ప్రసాద్, ఉమారాణి సిన్హా).
 అరిహంత్ పబ్లికేషన్స్: జనరల్ అవేర్‌నెస్.
 
 గుర్తుంచుకోండి:
 పరీక్ష సన్నద్ధతకు రోజువారీ ప్రణాళికను రూపొందించుకోవాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి.దినపత్రికలు చదవడం, న్యూస్‌బులెటన్లను చూడటం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించవచ్చు.గత ప్రశ్నపత్రాలను సేకరించి, ప్రశ్నల స్వరూపాన్ని గమనించి సన్నద్ధతకు వ్యూహాలను రచించుకోవాలి. విజయానికి సాధనకు మించిన మేలైన మార్గం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకే వీలైనన్ని మోడల్ పేపర్లను సేకరించి, సాధన చేయాలి.
 
 ప్రాక్టీస్‌కు మించిన మెరుగైన మార్గం లేదు
 తొలుత అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథమిక అంశాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. తర్వాత విశ్లేషణాత్మకంగా అన్ని అంశాలనూ చదవాలి. రీజనల్ రూరల్ బ్యాంక్ పరీక్షలో విజయానికి ప్రాక్టీస్‌ను మించిన మెరుగైన మార్గం లేదు. వీలైనన్ని మోడల్ పేపర్లు సాధన చేయడం ప్రధానం. నేను కిరణ్ ప్రకాశన్ టెస్ట్ సిరీస్ సాధన చేశాను. రోజుకు ఒకట్రెండు పేపర్లు చేశాను. దీనివల్ల మన బలాలు, బలహీనతలేంటో తెలుస్తాయి. వాటినిబట్టి ప్రిపరేషన్ ప్రణాళికలో మార్పులు చేసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోసం దినపత్రికలు, ఎడ్యుకేషన్ వెబ్‌సైట్లపై ఆధారపడ్డాను. కోచింగ్ సెంటర్‌లో ప్రతి నెలా ఇచ్చిన జీకే బుక్‌లెట్ ఎంతో ఉపయోగపడింది. దినపత్రికల్లోని బిజినెస్ పేజీ లు చదవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో వస్తున్న మార్పులను తెలుసుకోవచ్చు.బ్యాంకింగ్ పదజాలంపై కూడా పట్టు చిక్కుతుంది. పరీక్షలో తొలుత తేలిగ్గా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. నేను తొలు త కంప్యూటర్ అవేర్‌నెస్, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లిష్.. ఈ క్రమంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాను.
 - పి.ఉదయ్ కిరణ్ రావు,
 స్కేల్ 1 ఆఫీసర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ
 వికాస్ బ్యాంకు: ఆర్‌ఆర్‌బీ-2013 విజేత.
 
 ముఖ్య తేదీలు
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జూలై 9, 2014.
 ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు:
 జూన్ 18, 2014- జూలై 9, 2014.
 ఆఫ్‌లైన్‌లో ఫీజు చెల్లింపు:
 జూన్ 20, 2014- జూలై 14, 2014.
 ఆఫీసర్ విభాగం పరీక్ష: సెప్టెంబర్ 6/7, 2014.
 ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష: సెప్టెంబర్ 13, 14, 20, 21.
 ఫలితాల వెల్లడి: నవంబర్ 5, 2014.
 ఆన్‌లైన్‌లో ఆఫీసర్, అసిస్టెంట్ పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి.
 ఫీజు: ఆఫీసర్ (స్కేల్ 1, 2, 3)-ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.600. ఆఫీస్ అసిస్టెంట్- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎక్స్‌ఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100, ఇతరులకు రూ.600.
 వెబ్‌సైట్: www.ibps.in
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement