ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ | Study in India | Sakshi
Sakshi News home page

ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ

Published Fri, Sep 23 2016 3:38 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 PM

ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ - Sakshi

ఓయూకు విదేశీ విద్యార్థుల వెల్లువ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో చేరేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రధానంగా 2011 - 2012 విద్యా సంవత్సరం నుంచి విదేశీ విద్యార్థులు పెరుగుతున్నారు. 2011 - 12లో ఈ సంఖ్య 50 ఉండగా.. గతేడాది (2015- 16) 1210కి చేరింది. 2011 నుంచి గతేడాది వరకు  నమోదైన విదేశీ విద్యార్థుల సంఖ్య 4038. వీరిలో 3,323 మంది విద్యార్థులు కాగా 715 మంది విద్యార్థినులు. ఈ విద్యా సంవత్సరంలో యూజీ కోర్సుల్లో దాదాపు 1500 మందికిపైగా విద్యార్థులకు ప్రొవిజినల్ అడ్మిషన్లు జారీ చేశారు. పీజీ, స్పెషల్ ఇంగ్లిష్ కోర్సుల్లోనూ వీరి సంఖ్య ఎక్కువగానే ఉంది. యూఎఫ్‌ఆర్‌ఓ లెక్కల ప్రకారం.. 2013-14 విద్యా సంవత్సరంలో అత్యధికంగా యూజీ, పీజీ కోర్సుల్లో కలిపి 2,645 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 1367 మంది విద్యార్థులు, 1278 విద్యార్థినులు ఉన్నారు.
 
  ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్
 ప్రవేశాలు పొందిన విద్యార్థుల్లో కొందరిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) స్పాన్సర్ చేస్తోంది. మిగిలినవారు సెల్ఫ్ ఫైనాన్‌‌స విధానంలో చేరారు.
 
  క్రేజీ కోర్సులు
 ఓయూలో గతేడాది యూజీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్‌‌స (బీసీఏ) కోర్సులో అత్యధికంగా 602 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. పీజీలో 334 మంది విద్యార్థులతో ఎమ్మెస్సీ టాప్‌లో నిలిచింది. బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బీకామ్)లో  567, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్సీ)లో 439, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(బీబీఏ)లో 357, బీటెక్/బీఈలో 333, ఎంఏలో 242 మంది చేరారు. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)లో 132, పీహెచ్‌డీలో 196 మంది ప్రవేశాలు పొందారు. ఓయూలో ప్రత్యేకంగా విదేశీ విద్యార్థుల కోసం సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లిష్ ఫర్ ఫారిన్ స్టూడెంట్స్ అనే కోర్సు ఉంది. దీని కాలవ్యవధి పది నెలలు.
 
  ఈ దేశాల నుంచి ఎక్కువ
 ఓయూలో చేరిన విద్యార్థుల్లో అత్యధికంగా అఫ్గానిస్తాన్ (593), ఇరాక్ (572), యెమెన్ (474) సోమాలియా (467), సూడాన్ (350), నైజీరియా (169) దేశాల వారు ఉన్నారు. దాదాపు 85 దేశాల విద్యార్థులు ఓయూ పరిధిలోని కాలేజీల్లో చేరుతున్నారు. వీరితోపాటు యూఎస్, యూకే, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇండియన్ ఎన్‌ఆర్‌ఐ విద్యార్థులూ కూడా ప్రవేశం పొందుతున్నారు.
 
 మహారాష్ట్రలోని యూనివర్సిటీ ఆఫ్ పుణె తర్వాత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులు ప్రవేశం పొందుతున్న విశ్వవిద్యాలయంగా ఉస్మానియా యూనివర్సిటీ నిలుస్తోంది.  దేశమేదైనా ఉన్నత విద్యకోసం ఇక్కడికి వచ్చిన విద్యార్థులంతా కలిసిమెలసి ఉంటారు. ఇక్కడ కోర్సులనభ్యసించిన విదేశీ విద్యార్థులకు వారి దేశాల్లో గుర్తింపు, మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
 ప్రొఫెసర్ జి.బి. రెడ్డి, జాయింట్ డెరైక్టర్, యూఎఫ్‌ఆర్‌ఓ, ఉస్మానియా యూనివర్సిటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement