లక్ష్యం జేఈఈ అడ్వాన్స్‌డ్.. | TARGET JEE Advanced 2016 | Sakshi
Sakshi News home page

లక్ష్యం జేఈఈ అడ్వాన్స్‌డ్..

Published Fri, Apr 29 2016 3:52 AM | Last Updated on Sun, Sep 3 2017 10:58 PM

లక్ష్యం జేఈఈ అడ్వాన్స్‌డ్..

లక్ష్యం జేఈఈ అడ్వాన్స్‌డ్..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)నిర్వహించిన జేఈఈ మెయిన్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి.ఇక విద్యార్థుల తదుపరి లక్ష్యం ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ప్రవేశాలకు వీలుకల్పించే‘జేఈఈ అడ్వాన్స్‌డ్’! ఇందులో ప్రతిభ కనబరిస్తే ఉన్నత కెరీర్‌కు వేదికదొరికినట్లే! ఇంతటి కీలకమైన పరీక్షలో విజయానికి మార్గాలపై ఫోకస్..

జేఈఈ-మెయిన్‌లో ఉత్తీర్ణులైన మొదటి రెండు లక్షల మంది (అన్ని కేటగిరీలు కలుపుకొని) జేఈఈ-అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులు.

జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (2016) మార్గదర్శకాలకు అనుగుణంగా ఏడు జోనల్ ఐఐటీలు అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తున్నాయి.

ఈ ఏడాది ఐఐటీ గువహటి 2016, మే 22న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహించనుంది.

జాతీయ ప్రాధాన్య సంస్థలుగా గుర్తింపు పొందిన ఐఐటీలతో పాటు ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్‌ఎం)లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష వీలుకల్పిస్తుంది.

అడ్వాన్స్‌డ్ పరీక్ష విధానం
అడ్వాన్స్‌డ్ పరీక్ష రెండు పేపర్లు (పేపర్-1, పేపర్-2)గా ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అయితే మార్కులు, ప్రశ్నల సంఖ్య పరంగా ఏటా మార్పులు జరుగుతుంటాయి. నిర్దిష్ట మార్కింగ్ విధానం లేదు. 2015లో పేపర్-1లో 60 ప్రశ్నలు (మార్కులు 264); పేపర్- 2లో 60 ప్రశ్నలు (మార్కులు 264) అడిగారు. నెగెటివ్ మార్కింగ్ విషయంలోనూ నిర్దిష్ట విధానం ఉండదు.

‘అడ్వాన్స్‌డ్’లో విజయానికి సూచనలు
అడ్వాన్స్‌డ్‌లో 40-45 శాతం మార్కులు తెచ్చుకోగలిగితే ఐఐటీలో సీటు సాధించవచ్చు. అందువల్ల 60-70 శాతం చాప్టర్లను కచ్చితంగా చదివితే లక్ష్యం నెరవేరుతుంది.

జేఈఈ మెయిన్‌లోని మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు చాలా వరకు బేసిక్ కాన్సెప్టుల ఆధారంగా ఉంటున్నాయి. సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు మాత్రం సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆన్సర్, ప్యాసేజ్ టైప్, మ్యాట్రిక్స్ మేచింగ్, ఇంటీజర్ టైప్ ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులు వీటి కోణంలో ప్రిపరేషన్ కొనసాగించాలి.

అడ్వాన్స్‌డ్‌లోని చాలా ప్రశ్నలు కజ్ఠ్ఛీఛీ ఇౌఛ్ఛిఞ్టటలో ఉండి, కఠినంగా ఉంటాయి. అందువల్ల తొలుత బేసిక్స్‌పై పట్టు సాధించి, తర్వాత వివిధ స్థాయిల్లో ప్రశ్నలను సాధించాలి. ప్రశ్నలు, వాటి అనువర్తనాలను ప్రాక్టీస్ చేయాలి.

కొన్ని చాప్టర్లను ఎంపిక చేసుకొని, వాటిని 100 శాతం కచ్చితత్వంతో చదివితే మంచి విజయావకాశాలు ఉంటాయి. వీలైనన్ని ప్రాక్టీస్ పరీక్షలు రాయాలి. గత ప్రశ్నపత్రాలను తప్పనిసరిగా సాధన చేయాలి.

ప్రస్తుతం అన్ని చాప్టర్లను చదివేకంటే 70-80 శాతం చాప్టర్లను 100 శాతం కచ్చితత్వంతో అధ్యయనం చేయడం మంచిది. అడ్వాన్స్‌డ్‌కు సమాంతరంగా ఎంసెట్, బిట్‌శాట్, విట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ వంటి వాటికి ప్రిపరేషన్ par సాగించాలి.ఙ-  ఎం.ఎన్.రావు, సీనియర్ ఫ్యాకల్టీ, శ్రీ చైతన్య విద్యాసంస్థలు

పరీక్షలో 55 నుంచి 60 శాతం మార్కులు పొందే విధంగా కృషి చేయాలి.  కాన్సెప్టులపై క్షుణ్నమైన అవగాహన, అప్లికేషన్ దృక్పథం అలవరచుకుంటే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు par గుర్తించవచ్చు.ఙ- ఆంటోని,
జేఈఈ కోర్స్ డెరైక్టర్,
టైమ్ ఇన్‌స్టిట్యూట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement