స్వీయ చరిత్ర
ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన, సాహితీ ప్రక్రియల్లో స్వీయ చరిత్ర ఒకటి. స్వీయ చరిత్రనే ఆత్మకథ అని కూడా పిలుస్తారు. తెలుగులో స్వీయ చరిత్రకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం.
నిర్వచనాలు: స్వీయచరిత్ర అంటే ఆత్మకథనం. ఆత్మ కథను రాయడం చాలా కష్టం.
తమ గురించి తాము రాసుకునే దాన్ని ఆత్మకథ అంటారు.
సమాజంలోని విభిన్న రంగాల్లో విశిష్టమైన సేవ చేసినవారు తమ అనుభవాలను, జ్ఞాపకాలను భావితరాలకు అందించే ప్రయత్నమే స్వీయచరిత్ర.
స్వీయచరిత్ర ప్రత్యక్ష కథనం. జీవిత చరిత్ర పరోక్ష కథనం.
జీవిత చరిత్ర
ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో జీవిత చరిత్ర ఒకటి. బయోగ్రఫీ అనే ఆంగ్ల పదానికి సమానార్థకంగా తెలుగులో జీవితచరిత్ర అనే పదం స్థిరపడింది.
స్వీయచరిత్ర ఆత్మాశ్రయం అయితే జీవిత చరిత్ర పరాశ్రయం.
లోకంలో మహాపురుషుల విశిష్టతను అందరికీ తెలియజేయడం కోసం రాసేది జీవితచరిత్ర.
చారిత్రక, రాజకీయ, సాంస్కృతిక, వైజ్ఞా నిక, సామాజిక, కళా రంగాల్లో ప్రముఖ పాత్ర నిర్వహించిన వ్యక్తుల జీవితాలను గురించి తెలిపే రచనల్ని జీవిత చరిత్రలు అంటారు.
కవులు, రాజకీయ నాయకులు, శాస్త్రజ్ఞులు .. ఇలా ఎవరికి సంబంధించిన జీవిత వ్యక్తిత్వాలనైనా ఇతరులకు తెలిసేలా మరొకరు రాయడమే జీవిత చరిత్ర.
జీవిత చరిత్రలో కల్పనకు తావు లేదు. వాస్తవాలను యథాతథంగా రాసినప్పుడే జీవిత చరిత్రకు ప్రామాణికత ఉంటుంది.
తెలుగునాట జీవిత చరిత్ర ప్రక్రియకు ఆద్యుడు - కందుకూరి వీరేశలింగం.
తెలుగు సాహిత్యంలో ఎక్కువ జీవిత చరిత్రలు రాసినవారు - గొర్రెపాటి వెంకట సుబ్బయ్య
వ్యాసం
ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన వచన సాహితీ ప్రక్రియల్లో సూక్ష్మమైంది, క్లిష్టతరమైంది వ్యాసం.
ఆంగ్లంలో ఉటట్చడ అనే పదానికి తెలుగులో సమానార్థక పదం వ్యాసం.
తెలుగులో వ్యాసం అనే పదానికి విభాగం లేదా విస్తరించు అనే అర్థాలు ఉన్నాయి.
{పపంచంలో వ్యాసం మొదటిసారిగా ఫ్రెంచి సాహిత్యంలో వచ్చింది.
{పపంచ సాహిత్యంలో వ్యాస ప్రక్రియకు ఆద్యుడు - మాన్‌టైన్ (16వ శతాబ్దం)
వ్యాసాన్ని హిందీలో నిబంధ్, ప్రబంధ్, లలిత ప్రబంధ్ అని వ్యవహరిస్తారు.
వ్యాసాన్ని ఒడియా, పంజాబీ, మలయాళీ భాషల్లో నిబంధ్, ప్రబంధ్ అని పిలుస్తారు.
నిర్వచనాలు: ఏదైనా ఒక అంశంపై విరివిగా రాయడం వ్యాసం. - శబ్ద రత్నాకరం
కవికి గీటురాయి గద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం - రామచంద్ర శుక్లా
వ్యాసమంటే విషయ విశ్లేషణ - ఇలువలూరి కామేశ్వరరావు
విమర్శ
విమర్శ అనే పదాన్ని ఆంగ్లంలో ఇటజ్టీజీఛిజీటఝ అంటారు. విమర్శ అనేది సంస్కృత పదం. మృశ్ అనే ధాతువుకు పరామర్శించడం, ఆలోచించడం, పరిశీలించడం, చర్చించడం, వివేచించడం లాంటి అర్థాలున్నాయి. ప్రస్తుతం విమర్శ, సమీక్ష, మీమాంస, సమాలోచన, అనుశీలన, పరిశీలన మొదలైన పదాలన్నింటినీ సమానార్థకాలుగా ఉపయోగిస్తున్నారు.
విమర్శ సృజనాత్మక ప్రక్రియ కాదు. ఒక సృజనాత్మక ప్రక్రియను నిశితంగా విపులీకరిం చేది విమర్శ. దీనిపై సంస్కృత, పాశ్చాత్య భాషల ప్రభావం బాగా కనిపిస్తుంది. తెలుగులో ఆధునిక విమర్శకు ఆద్యుడు కందుకూరి వీరేశలింగం. వివేకవర్థని లాంటి పత్రికల ద్వారా విమర్శకు ఆయన ఎనలేని సేవ చేశారు. 1876లో కందుకూరి వీరేశలింగం.. కొక్కొండ వెంకటరత్నం రాసిన విగ్రహతంత్రం అనే గ్రంథంపై ‘విగ్రహతంత్ర విమర్శనం’ అనే పేరుతో ఆధునిక విమర్శకు శ్రీకారం చుట్టారు.
గతంలో అడిగిన ప్రశ్నలు
1. నా జీవనయానం ఎవరి ఆత్మకథ?
1) దాశరథి కృష్ణమాచార్యులు 2) దాశరథి రంగాచార్యులు
3) తాపీ ధర్మారావు 4) టంగుటూరి ప్రకాశం
2. తెలుగులో జీవిత చరిత్ర రచనకు ఆద్యుడు?
1) కందుకూరి వీరేశలింగం 2) కొక్కొండ వెంకటరత్నం
3) గుర్రం జాషువా 4) గురజాడ శ్రీరామమూర్తి
3. ఆధునిక వ్యాసాలను పోలిన తన రచనలకు కందుకూరి వీరేశలింగం ఏమని పేరు పెట్టారు?
1) ప్రమేయాలు 2) సంగ్రహాలు
3) ఉపన్యాసాలు 4) నవ్య వ్యాసాలు
4. తెలుగు తొలి నవలా విమర్శన గ్రంథం?
1) విగ్రహతంత్ర విమర్శనం 2) వివేక చంద్రిక వ్యాఖ్య
3) కవిత్వ తత్త్వవిచారం 4) నవలా శిల్పం
సమాధానాలు: 1) 2; 2) 1; 3) 3; 4) 2.
ముఖ్యమైన స్వీయ చరిత్రలు - రచయితలు
1. స్వీయచరిత్ర (1906) కందుకూరి వీరేశలింగం
2. స్వీయ చరిత్రం (1910) చిలకమర్తి లక్ష్మీనరసింహం
3. జాతక చర్య (పద్య రూపం) తిరుపతి వేంకట కవులు
4. నా కథ (పద్య రూపం) గుర్రం జాషువా
5. అనుభవాలు - జ్ఞాపకాలు }పాద సుబ్రహ్మణ్యశాస్త్రి
6. యాభై సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు
7. నా జీవిత యాత్ర టంగుటూరి ప్రకాశం
8. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు బోయి భీమన్న
9. హంపీ నుంచి హరప్పా దాకా తిరుమల రామచంద్ర
10. కూలీ నుంచి కళాప్రపూర్ణ వరకు యస్.టి. జ్ఞానానంద కవి
11. నా అంతరంగ కథనం బుచ్చిబాబు (శివరాజు
వేంకట సుబ్బారావు)
12. అనంతం (చారిత్రాత్మక ఆత్మకథ) }రంగం శ్రీనివాసరావు
13. నేను - నా దేశం దర్శి చెంచయ్య
14. రాలూ రప్పలూ తాపీ ధర్మారావు
15. నా జీవనయానం దాశరథి రంగాచార్యులు
16. {పజ్ఞా ప్రభాకరం వేటూరి ప్రభాకరశాస్త్రి
17. శతపత్రం గడియారం రామకృష్ణశర్మ
ప్రసిద్ధ జీవిత చరిత్రలు - రచయితలు
1. కందుకూరి వీరేశలింగం 1. విక్టోరియా రాణి చరిత్ర
2. జీసస్ చరిత్ర
3. రాజా రామ్మోహన్‌రాయ్ చరిత్ర
4. ఆంధ్ర కవుల చరిత్ర
2. కొత్తపల్లి వీరభద్రరావు సి.పి.బ్రౌన్ జీవిత చరిత్ర
3. గుర్రం జాషువా (పద్యరూప 1. క్రీస్తు చరిత్ర (1963)
జీవిత చరిత్రలు) 2. నేతాజీ 3. బాపూజీ
4. నిడదవోలు వెంకట్రావు చిన్నయసూరి
5. గొర్రెపాటి వెంకటసుబ్బయ్య
1. శరత్‌బాబు
2. సరోజినీదేవి
3. కట్టమంచి రామలింగారెడ్డి
4. ఆచార్య రంగ
5. వల్లభాయ్ పటేల్
6. గుంటూరు లక్ష్మీకాంతం నాయన చరిత్ర (శ్రీకావ్యకంఠ గణపతి శాస్త్రి జీవిత చరిత్ర)
7. ముదిగంటి జగ్గన్న నెహ్రూ చరిత్ర
8. తోలేటి వెంకట సుబ్బారావు కందుకూరి వీరేశలింగం జీవిత చరిత్ర (1894)
9. ఉండేలమాల కొండారెడ్డి నేతాజీ జీవిత చరిత్ర (1948)
10. ముదిగొండ వీరభద్రమూర్తి ఆంధ్ర కేసరి
ముఖ్యమైన అంశాలు
తెలుగులో తొలి విమర్శకుడు - కందుకూరి వీరేశలింగం
తెలుగులో తొలి విమర్శన గ్రంథం - విగ్రహతంత్ర విమర్శనం
తెలుగులో తొలి నవలా విమర్శకుడు - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి
తెలుగులో నవలలపై వచ్చిన తొలి విమర్శన గ్రంథం - వివేకచంద్రికా విమర్శనం
‘విమర్శకాగ్రేసర’ అనే బిరుదు ఉన్నవారు - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి
ఆధునిక సాహిత్య విమర్శలో నూతన ధోరణులు ప్రవేశపెట్టినవారు - కట్టమంచి రామలింగారెడ్డి
ఆధునిక విమర్శనాశాస్త్ర పితామహుడు - కట్టమంచి రామలింగారెడ్డి
ప్రసిద్ధ విమర్శ గ్రంథాలు
1. విగ్రహతంత్ర విమర్శనం - కందుకూరి వీరేశలింగం
2. సాహిత్య ప్రయోజనం - కొడవటిగంటి కుటుంబరావు
3. వ్యాసవాహిని, సమీక్షణం - సి.నారాయణ రెడ్డి
4. సాహిత్య కౌముది - గంటూరు శేషేంద్రశర్మ
మాదిరి ప్రశ్నలు
1. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు గ్రంథకర్త?
1) వేదుల సుబ్రహ్మణ్యం 2) జి.వి. సుబ్రహ్మణ్యం
3) జి.వి. కృష్ణారావు 4) నాళం కృష్ణారావు
2. కనుపర్తి వరలక్ష్మమ్మ శారద లేఖలకు ప్రేరణ
1) సాంత్వన లేఖలు 2) వసంత లేఖలు
3) భారతీ లేఖలు 4) ప్రేమ లేఖలు
3. ఇంగ్లిష్‌లోని టాట్లర్‌కు సమానార్థకమైన తెలుగులో వచ్చిన వ్యాసాలు?
1) వదరుబోతు 2) సాక్షి
3) లక్ష్మీరంజన వ్యాసావళి 4) బారిస్టరు గారి బాతాఖానీ
4. సత్య కథనానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన సాహిత్య ప్రక్రియ?
1) కథానిక 2) నవల
3) ఆత్మకథ 4) గల్పిక
5. ఆంగ్ల సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో వచ్చిన తొలి వ్యాస సంపుటి ‘హిత సూచని’లో వ్యాసానికి బదులుగా వాడిన పదం?
1) వచన ప్రబంధం 2) ప్రమేయం
3) గద్య ప్రబంధం 4) సంగ్రహములు
6. ఆత్మకథను ‘నా కథ’ పేరుతో పద్య రూపంలో రచించిన కవి?
1) విశ్వనాథ సత్యనారాయణ 2) నాయని సుబ్బారావు
3) గుర్రం జాషువా 4) కరుణశ్రీ
7. తెలుగులో ప్రసిద్ధ ఆత్మకథగా నిలిచిన ‘నేను - నా దేశం’ ఎవరిది?
1) టంగుటూరి ప్రకాశం 2) గుంటూరు శేషేంద్రశర్మ
3) తిరుమల రామచంద్ర 4) దర్శి చెంచయ్య
8. తెలుగునాట పాఠకులను కడుపుబ్బా నవ్వించిన ‘జంఘాలశాస్త్రి’ పాత్ర ఏ రచనలోనిది?
1) శారద లేఖలు 2) వసంత లేఖలు
3) సాక్షి వ్యాసాలు 4) కన్యాశుల్కం
9. తెలుగులో ఆధునిక విమర్శనా ధోరణులను ప్రవేశపెట్టిన ‘కవిత్వతత్త్వ విచారం’ అనే పరిశోధన గ్రంథాన్ని ఎవరు రాశారు?
1) కట్టమంచి రామలింగారెడ్డి 2) కందుకూరి వీరేశలింగం
3) విశ్వనాథ సత్యనారాయణ 4) దేవులపల్లి రామానుజరావు
10. ‘కవికి గీటురాయి గద్యమైతే - గద్యానికి గీటురాయి వ్యాసం’ అని ఎవరన్నారు?
1) ఇలవలూరి కామేశ్వరరావు 2) శ్రీరామచంద్ర శుక్లా
3) శ్రీరామచంద్ర వర్మ 4) వల్లంపాటి వెంకటసుబ్బయ్య
సమాధానాలు: 1) 2; 2) 2; 3) 1; 4) 3; 5) 2; 6) 3; 7) 4; 8) 3; 9) 1; 10) 2.
తెలుగులో జీవిత చరిత్ర రచనకు ఆద్యుడు?
Published Fri, Nov 7 2014 10:38 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement