ఆ నియోజకవర్గంలో 34 నామినేషన్ల తిరస్కరణ | 34 nominations rejected in varanasi | Sakshi
Sakshi News home page

ఆ నియోజకవర్గంలో 34 నామినేషన్ల తిరస్కరణ

Published Sat, Apr 26 2014 3:10 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

వారణాసి - Sakshi

వారణాసి

వారణాసి: ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఆధ్యాత్మికంగానే కాకుండా, ఇప్పుడు ఎన్నికల పరంగా కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ లోక్సభ నియోజకవర్గంలో 34 నామినేషన్లను ఎన్నికల అధికారులు  తిరస్కరించారు. వారణాసి బరిలో ప్రస్తుతం 44 మంది అభ్యర్థులు ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి పోటీ చేస్తుండటంతో రాజకీయంగా ఈ స్థానానికి ప్రధాన్యత ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ పోటీ చేస్తున్నారు.


ఈ నెల 28 వరకు ఇక్కడ నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.  చివరి విడతలో మే 12న యూపీలో ఎన్నికలు నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement