వారణాసిలో ప్రచారానికి వెళ్లను | I am not campaign in Varanasi : Priyanka Gandhi | Sakshi
Sakshi News home page

వారణాసిలో ప్రచారానికి వెళ్లను

Published Sat, Apr 26 2014 7:13 PM | Last Updated on Sat, Mar 9 2019 3:34 PM

భర్త వథేరా, సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీతో ప్రియాంక గాంధీ - Sakshi

భర్త వథేరా, సోదరుడు రాహుల్, తల్లి సోనియా గాంధీతో ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ: ఉత్తప్రదేశ్లోని వారణాసిలో తాను ప్రచారానికి వెళ్లనని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతో ఈ స్థానానికి ప్రధాన్యత పెరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. ప్రముఖులు పోటీ చేస్తున్న వారణాసిలో కూడా ప్రియాంక గాంధీ ప్రచారం చేస్తారని భావించారు. అయితే తాను అక్కడ ప్రచారం చేయడంమలేదని ఆమె తెలిపారు.


తల్లి సోనియా గాంధీ పోటీ చేస్తున్న  రాయ్‌బరేలీ, సోదరుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ నియోజకవర్గాలకే పరిమితమవుతానని ప్రియాంక  స్పష్టం చేశారు. రాహుల్ ముందుచూపుగల నేత అంటూ కితాబు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement