న్యూఢిల్లీ : ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె రాజకీయ అరంగ్రేటం గురించి పలు వార్తలు వినిపించాయి. ఒకానొక దశలో ప్రియాంక గాంధీ.. వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ ఈ వార్తలకు చెక్ పెడుతూ.. కాంగ్రెస్ అజయ్ రాయ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ విషయంపై స్పందించిన ప్రియాంక ‘మొదటి నుంచి నేను చెప్తున్నదొకటే.. పార్టీ ఆదేశాల మేరకే నేను నడుచుకుంటాను. వారణాసి నుంచి పోటీ చేసే అంశంలో కూడా పార్టీ ఆదేశాల మేరకే నడుచుకున్నాను. పోటీ చేయడం గురించి ఉత్తరప్రదేశ్ నాయకులతో.. పార్టీలోని సీనియర్లతో చర్చించాను. ప్రస్తుతం 41 లోక్ సభ స్థానాల బాధ్యత నా మీద ఉంది. వీరంతా నేను తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. ఒకవేళ నేను కూడా పోటీ చేస్తే.. కేవలం ఒక్క నియోజకవర్గం గురించే ఆలోచించాల్సి వస్తుంది. అలా చేస్తే.. ఈ 41 నియోజకవర్గాల అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనవుతారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే పోటీ చేయడం లేద’ని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment