‘నిషేధాజ్ఞల నడుమ వారణాసి’ | Priyanka Gandhi Slams PM Modi Over Varanasi Situation | Sakshi
Sakshi News home page

‘నిషేధాజ్ఞల నడుమ వారణాసి’

Published Thu, Jan 2 2020 5:38 PM | Last Updated on Thu, Jan 2 2020 5:38 PM

Priyanka Gandhi Slams PM Modi Over Varanasi Situation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. తన సొంత నియోజకవర్గం వారణాసిలో 365 రోజులకు 359 రోజులు సెక్షన్‌ 144 అమల్లో ఉండగా ఆయన దేశ ప్రజలకు భయపడాల్సిన అవసరం లేదని ఎలా చెబుతారని ఎద్దేవా చేశారు.

తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఏడాది పొడవునా నిషేధాజ్ఞలు అమలవుతుంటే ప్రధాని ఇక దేశ ప్రజలకు ఏం భరోసా ఇవ్వగలరని ఆమె ప్రశ్నించారు. 2019లో 359 రోజుల పాటు వారణాసిలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని బెనారస్‌ హిందూ యూనివర్సిటీ విద్యార్ధి ఒకరు చెప్పారని మీడియాలో వెలువడిన కథనాన్ని ప్రియాంక గాంధీ ఉటంకిస్తూ ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement