నేను తలచుకున్నప్పుడు పోటీ చేస్తా | I will contest when i want to, says priyanka gandhi | Sakshi
Sakshi News home page

నేను తలచుకున్నప్పుడు పోటీ చేస్తా

Published Tue, Apr 15 2014 2:40 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నేను తలచుకున్నప్పుడు పోటీ చేస్తా - Sakshi

నేను తలచుకున్నప్పుడు పోటీ చేస్తా

న్యూఢిల్లీ: వారణాసిలో నరేంద్రమోడీపై తాను పోటీ చేయాలని భావించినట్లు వచ్చిన వార్తలను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక తోసిపుచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ తన నిర్ణయానికి అడ్డుపడిందనటంలో నిజం లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయం తన వ్యక్తిగతమని స్పష్టం చేశారు.

ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే కుటుంబం మొత్తం తనకు అండగా నిలుస్తుందని చెప్పారు. కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా వారణాసి నుంచి బరిలోకి దిగటంపై ప్రియాంక ఆసక్తి చూపిట్లు మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రచార సారథ్య బాధ్యతలు చేపట్టాలని, ఎన్నికల్లో పోటీ చేయాలని పలు సందర్భాల్లో సోదరుడు రాహుల్ తనను కోరినట్లు వెల్లడించారు. అయితే తాను పోటీ చేయాలని భావించినప్పుడే తన నిర్ణయాన్ని మార్చుకుంటానని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement