రెడ్డి సామాజిక వర్గానికే ఆదరణ
15 ఎన్నికల్లో 11 సార్లు వారికే పట్టం
బీఎన్‌ఆర్ కుటుంబానికి ఐదుసార్లు
ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతో పాటు అన్ని సామాజిక వర్గాలకు నిలయమైన అనంతపుంర అర్బన్ శాసనసభా నియోజక వర్గం రాజకీయ చైతన్యానికి నిదర్శనం. 1952లో ఏర్పడిన ఈనియోజక వర్గంలో ఇప్పటివరకు రెండు ఉప ఎన్నికలతో సహా 15 సార్లు ఎన్నికలు జరిగాయి. గతంలో మునిసిపాలిటీతో పాటు బుక్కరాయసముద్రం, రాప్తాడు, అనంతపురం రూరల్ మండలాలు నియోజక వర్గంలో ఉండేవి. 2009లో నియోజక వర్గాల పునర్విభజన తరువాత నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 50 డివిజన్లతో పాటు రూరల్ మండల పరిధిలోని ఎ.నారాయణపురం, రుద్రంపేట, రాజీవ్‌కాలనీ, రూరల్ పంచాయతీలు మాత్రమే నియోజక వర్గం పరిధిలోకి వచ్చాయి. బుక్కరాయసముద్రం, రాప్తాడు, రూరల్ మండలంలోని ఇతర పంచాయతీలు వేర్వేరు నియోజక వర్గాల పరిధిలోకి వెళ్లాయి. నియోజక వర్గంలో గ్రామీణ ప్రాంత ఓటర్లు కేవలం 24 వేల మంది ఉన్నారు. మిగతా 2.17 లక్షల మంది నగరంలో ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం పరితపించే అభ్యర్థిని ఎన్నుకుంటూ.. పట్టించుకోని నాయకున్ని పక్కనపెడుతూ వస్తున్నారు.
{పధానంగా తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, మురికికాలువలు,
పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ లాంటి సమస్యలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి.
బలిజలు, ముస్లింలు, ఆర్యవైశ్యులు, రెడ్లు, కమ్మ, క్రిస్టియన్ వర్గాలతో పాటు
{శామిక వర్గాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల ప్రాబల్యం ఎక్కువ.
అనంత అభివృద్ధిలో ‘వైఎస్’ మార్‌క
అనంతపురం ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. తాత్కాలికంగా కాకుండా కనీసం 40 ఏళ్ల పాటు దాహార్తి సమస్య ఏర్పడకుండా పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) నుంచి ఒక టీఎంసీ నీళ్లు అనంతపురం నగరానికి తీసుకురావడానికి రూ.67 కోట్లు వెచ్చించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో రహదారుల నిర్మాణం, అనంతపురం-తాడిపత్రి రహదారికి రూ.55 కోట్లు వెచ్చించి బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. వర్షం వస్తే మురుగునీరు రోడ్లు, నివాసాల్లోకి రాకుండా ఉండేందుకు నగరంలో ప్రధాన వంకలైన మరువవంక, నడిమివంకలకు రూ.56 కోట్లు మంజూరు చేసిన కరకట్టలు నిర్మించారు. వైఎస్ హయాంలో నగరంలోని పేద వర్గాలకు ఇందిరమ్మ పథకం కింద 2,200 ఇళ్లు నిర్మించి ఇచ్చారు. వేలాది మంది అభాగ్యులు, వద్దులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్లు మంజూరు చేశారు. ఇలా అర్బన్ నియోజక వర్గం అభివద్ధికి మహానేత వైఎస్ హయాంలో బాటలు వేశారు. ఫలితంగా ప్రజలు వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి మరోమారు పట్టం కట్టేందుకు ఎదురుచూస్తున్నారు.
బీఎన్‌ఆర్ కుటుంబంపై విశ్వాసం
ప్రస్తుత ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి, ఆయన సోదరుడు బి.నారాయణరెడ్డి (బీఎన్‌ఆర్)కు నియోజక వర్గ ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారు. గురునాథరెడ్డి రెండుసార్లు, బి.నారాయణరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గురునాథ్‌రెడ్డి కుటుంబం వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో ఉండటంతో ఈ నియోజక వర్గం ఇపుడు వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా మారింది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత జరిగిన తొలి రెండు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. రాను రాను తెలుగుదేశం పార్టీ బలహీనపడుతూ ప్రత్యర్థులకు భారీ మెజార్టీ కట్టబెడుతున్నారు. 1985, 1989 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలుపొందగా ఆ తరువాత పొత్తులో భాగంగా 1994 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి అనంతపురం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బీఎన్‌ఆర్ కుటుంబ సభ్యులు వరుసగా విజయాలు నమోదు చేస్తున్నారు.
దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాకమునుపే ప్రచారపర్వంలో దూసుకుపోతోంది. పార్టీ అభ్యర్థి బి.గురునాథరెడ్డి మరోసారి ఫ్యాన్ గాలిని రెపరెపలాడించే దిశగా పయనిస్తున్నారు. బలిజ, రెడ్లు, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్, ఆర్యవైశ్యులు, ఉద్యోగ వర్గాల, శ్రామికుతో పాటు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ వర్గాల ఓట్లు ఎక్కువగా వైఎస్సార్‌సీపీకి పడే సూచనలు ఉన్నాయి. ప్రజాసమస్యలపై తక్షణం స్పందించే గుణం ఉండటంతో గురునాథరెడ్డిని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారు.
బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ డీలా
నోటిఫికేషన్ విడుదలైనా ఇంకా అభ్యర్థి ఎంపికలో నెలకొన్న గందరగోళం వల్ల టీడీపీ, బీజేపీలు డీలా పడగా... కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. టీడీపీలో నెలకొన్న కుమ్ములాటల వల్ల ఈ సారి పొత్తులో భాగంగా అర్బన్ సీటు బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతున్నా ఇప్పటికే తేలకపోవడంతో ఆయా పార్టీల శిబిరాల్లో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. టీడీపీలో ఎవరికి టికెట్టు ఇచ్చినా మరోవర్గం సహకరించే పరిస్థితి లేదు. లేదా బీజేపీకి ఇచ్చినా టీడీపీ వర్గాల నుంచి సహకారం ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇరు పార్టీలు, ఇరు వర్గాల నడుమ ఆశించిన సఖ్యత లేకపోవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఢీకొట్టే పరిస్థితి కనిపించడం లేదు
రాజకీయ చైతన్య ప్రతీక
Published Sun, Apr 13 2014 3:33 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement