హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పెద్దల తీరుపై ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీ-ఫారంల విషయంలో పొన్నాల దామోదర రాజనర్సింహ, దామోదర రాజనర్సింహ, డీకే అరుణ అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.
దళిత ఎమ్మెల్యే అయిన తనకే పార్టీలో న్యాయం జరగటం లేదని అబ్రహాం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పెద్దలు ఇక సామాజిక న్యాయం ఎలా సాధిస్తారని ఆయన సూటిగా ప్రశ్నించారు. పార్టీలో కొనసాగాలా? వద్దా అనే అంశంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అబ్రహాం తెలిపారు.