హీరోయిన్ వింధ్యపై ఈసీ కేసులు | Cases filed against Tamil actress Vindhya | Sakshi
Sakshi News home page

హీరోయిన్ వింధ్యపై ఈసీ కేసులు

Published Sat, Apr 12 2014 7:46 PM | Last Updated on Wed, Apr 3 2019 9:17 PM

హీరోయిన్ వింధ్యపై ఈసీ కేసులు - Sakshi

హీరోయిన్ వింధ్యపై ఈసీ కేసులు

తమిళ హీరోయిన్ వింధ్య సహా పలువురు అన్నాడీఎంకే కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముందస్తు అనుమతులు తీసుకోకుండా చెన్నై నగరంలో ప్రచారం చేసినందుకు ఈ కేసులు నమోదు చేశారు. తమిళనాడులో అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే తరఫున పలువురు సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. వారిలో వింధ్య కూడా ఒకరు. పార్టీ అభ్యర్థి మహేంద్రన్ తరఫున ఆమె ప్రచారానికి వెళ్లారు.

అయితే ముందుగా ఎన్నికల కమిషన్ నుంచి ఆమె అందుకు కావల్సిన అనుమతి తీసుకోలేదు. దీనిపై ఎన్నికల కమిషన్ నుంచి ఫిర్యాదులు రావడంతో తాము కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వింధ్యతో పాటు అన్నాడీఎంకే కార్యకర్తలు, సభ నిర్వాహకులపై ఈ కేసులు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement