ఒంటరి పోరు చేతకాకే పొత్తు
Published Wed, Apr 9 2014 2:34 AM | Last Updated on Fri, Aug 10 2018 6:45 PM
గుర్ల, న్యూస్‌లైన్ : టీడీపీకి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తాలేకనే బీజేపీతో పొత్తు పెట్టుకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. వచ్చే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని తెలిపారు. మం గళవారం ఆయన గుర్ల మండలంలోని చోడవరం, గుజ్జంగివలస, పాలవలస గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 13 మంది ముఖ్యమంత్రులుగా పని చేశారని, వారితో బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పాటుపడిన ముఖ్యమంత్రి ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని చెప్పారు. అర్హులందరికీ రేషన్‌కార్డులు ఇవ్వడమే కాకుండా పేదలకు లక్షలాది రూపాయలతో కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య అందేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు.
108, 104 వాహనాలతో ప్ర భుత్వ వైద్య సేవలను పేదల దరికి చేర్చారన్నారు.ఆయన తరువాత మళ్లీ ఆ పథకాలు పూర్తిస్థారుులో అ మలు చేసే సత్తా ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మా త్రమే ఉందన్నారు. పార్టీ చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి బె ల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసే ఎనిమిది పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వ చ్చేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పార్టీ ఉత్తరాంధ్ర విద్యార్థి సేవా నాయకుడు డాక్టర్ సుంకరి రమణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయూలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుర్ల మండల జెడ్పీటీసీ అభ్యర్థి అ ట్టాడ సరోజిని, పార్టీ నాయకులు మావూరి శంకరరావు, పల్లి కృష్ణ, గుజ్జంగివలస ఎంపీటీసీ అభ్యర్థి కూనుబిల్లి లక్ష్మి, కూనుబిల్లి శ్రీరాములు, పాలవలస ఎంపీటీసీ అభ్యర్థి పెనుమజ్జి అన్నపూర్ణ, రౌతు రామునాయుడు,రౌతు సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement