'ఎన్నికల కోడ్తో సామాన్యుడికీ ఇబ్బందే'
ఎన్నికల కోడ్తో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు సామన్య ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారని సాక్షాత్తు కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారు. ఆయనెవరో కాదు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్. ఈ ఇబ్బందుల విషయాన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చర్చించాలని కూడా ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో కోడ్ అంటూ నిబంధనలు విధించడం వల్ల ఏ ఒక్క పనీ జరగడంలేదని, ఎన్నికల సమయంలో మాత్రం పార్టీలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా, తర్వాత మర్చిపోతున్నాయని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. కొత్త ప్రాజెక్టులు ఏవైనా ప్రారంభిస్తున్నట్లు ప్రకటిస్తే, అది ఓటర్లను ఆకర్షించినట్లు అవుతుందని చెప్పడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయన్నారు.