రాహుల్ ర్యాలీ ట్వీట్ తో కాంగ్రెస్ పప్పులో కాలు
రాహుల్ ర్యాలీ ట్వీట్ తో కాంగ్రెస్ పప్పులో కాలు
Published Sat, May 10 2014 2:13 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
వారణాసిలో రాహుల్ గాంధీ రోడ్ షో అంటూ కాంగ్రెస్ ఎప్పటిదో పాత ఫోటో ఒక దాన్ని ట్విటర్ లో పెట్టి, కొన్ని గంటలకే ట్వీట్ ను డెలీట్ చేసింది. ఆ ఫోటో లో ఉన్న జనాన్ని చూసి అందరూ అబ్బురపడిపోయారు. కొన్ని దిన పత్రికలు ఆ ఫోటోను తమ నెట్ ఎడిషన్లలోకి ఎక్కించేశాయి కూడా.
అయితే అంతలోనే బిజెపి ఇంటర్ నెట్ టీమ్ రంగంలోకి దిగి, కోల్ కతాలో కాంగ్రెస్ ర్యాలీ ఫోటోలనే వారణాసి ఫోటోలుగా చెలామణీ చేసేస్తున్నారంటూ ట్వీట్ల వాన మొదలుపెట్టింది. అప్పటి ఫోటో, ఇప్పటి ఫోటోలను పక్క పక్కన పెట్టి మరీ ట్వీట్లు చేసింది. అసలు రాహుల్ గాంధీ ర్యాలీ లో పాల్గొనకముందే ఈ ఫోటోలు ఎలా వచ్చాయని కూడా ప్రశ్నించింది.
దాంతో మేల్కొన్న కాంగ్రెస్ ఈ ఫోటోలను తక్షణం ఉపసంహరించుకుంది. అసలు ర్యాలీ ఫోటోలను ట్వీట్ చేసింది. మొత్తం మీద నెట్ ఫైట్ లో కాంగ్రెస్ మరో సారి పప్పులో కాలేసింది.
Advertisement
Advertisement