ప్రధాని అభ్యర్థులతో వీరప్పన్ మేనల్లుడి ఢీ | nephew of veerappan contests in amethi and varanasi | Sakshi
Sakshi News home page

ప్రధాని అభ్యర్థులతో వీరప్పన్ మేనల్లుడి ఢీ

Published Tue, Apr 29 2014 8:53 AM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

ప్రధాని అభ్యర్థులతో వీరప్పన్ మేనల్లుడి ఢీ - Sakshi

ప్రధాని అభ్యర్థులతో వీరప్పన్ మేనల్లుడి ఢీ

ప్రధానమంత్రి అభ్యర్థులే తన టార్గెట్ అని, వాళ్లను ఓడించాలనే గట్టిగా అనుకుంటున్నానని అంటున్నాడు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మేనల్లుడు. ఈయన పేరు పి.ఎన్. రామచంద్రన్. ఒకప్పుడు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను గడగడ వణికించి, చివరకు ఎస్టీఎఫ్ చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరప్పన్కు తాను స్వయానా మేనల్లుడినని ఆయన చెప్పుకొంటున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసితో పాటు అమేథీలో కూడా ఈయన పోటీ చేస్తున్నాడు.

వారణాసిలో పోటీ చేస్తున్న నరేంద్ర మోడీ, అమేథీలో బరిలో ఉన్న రాహుల్ గాంధీ.. ఇద్దరూ ఆయా పార్టీలకు సంబంధించిన ప్రధానమంత్రి అభ్యర్థులు కాబట్టే వాళ్లతో ఢీకొంటున్నట్లు ఆయన చెబుతున్నాడు. తానెప్పుడూ ప్రజా జీవితంలోనే ఉన్నానని, వ్యక్తిగతంగా చూసినప్పుడు మోడీ, రాహుల్ గాంధీ ఇద్దరూ మంచివాళ్లే అయినా, వాళ్ల పార్టీలు మాత్రం మంచివి కావని శ్రీరామచంద్రన్ చెప్పాడు. తాను నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్.. ఈ ముగ్గురినీ ఓడించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement