కాశీలో నరేంద్ర మోడీకి 'సన్నాయి' నొక్కులు | Bismillah Khan's family shuns Modi, attends Rahul rally | Sakshi
Sakshi News home page

కాశీలో నరేంద్ర మోడీకి 'సన్నాయి' నొక్కులు

Published Sat, May 10 2014 12:29 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

కాశీలో నరేంద్ర మోడీకి 'సన్నాయి' నొక్కులు - Sakshi

కాశీలో నరేంద్ర మోడీకి 'సన్నాయి' నొక్కులు

వారణాసిలో నరేంద్ర మోడీ నామినేషన్ కు మద్దతునిచ్చే విషయంలో దూరందూరంగా ఉన్న షెహనాయి సామ్రాట్ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కుటుంబం వారణాసి రాహుల్ గాంధీ రోడ్ షో లో దర్శనమివ్వడంతో నరేంద్ర మోడీకి షాక్ తగిలింది. తాము ఏ రాజకీయ పార్టీ తోటూ కలిసి పనిచేయబోమని మోడీకి చెప్పిన బిస్మిల్లా ఖాన్ మనవడు అష్ఫాక్ హైదర్ కాంగ్రెస్ ర్యాలీలో పాల్గొన్నారు. 
 
రాహుల్ గాంధీ రోడ్ షోలో భారీ సంఖ్యలో జనం వచ్చారు. శుక్రవారం అరవింద కేజరీవాల్ రోడ్ షో లోనూ జనం భారీగా వచ్చారు. అంతకు ముందు నరేంద్ర మోడీ షోలకూ జనం బాగా వచ్చారు. అయితే దేశం యావత్తూ గర్వించే బనారసీ ఘరానా షహనాయి వాదకుడు బిస్మిల్లా ఖాన్ కుటుంబం రాహుల్ ర్యాలీలో పాల్గొనడం మోడీకి, ఆయన అనుచరులకు మింగుడు పడటం లేదు. ముస్లింలు మోడీని ఇంకా క్షమించలేదన్న విషయాన్ని బిస్మిల్లా ఖాన్ కుటుంబం తిరస్కరణ రుజువు చేస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement