కాంగ్రెస్ ‘ఐడియా’! | congress idea | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ ‘ఐడియా’!

Published Sun, Apr 6 2014 2:23 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

congress idea

పసునూరు మధు
 
 ‘ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది’... ఇది ఓ మొబైల్ కంపెనీ యాడ్. దేశవ్యాప్తంగా ఈ యాడ్ పాపులర్ అయిందనో ఏమో కానీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కూడా ఓ ఐడియా కనిపెట్టింది. దాని పేరుతోనే 2014 ఎన్నికల హామీల ప్రణాళికను రూపొందిస్తోంది.  ఇదేమిటనుకుంటు న్నారా?... ఐడియా... అంటే ఇంక్లూజివ్ డీసెంట్ర లైజ్డ్ ఎకనామిక్ ఎజెండా (సమ్మిళిత వికేంద్రీకరణ ఆర్దిక నమూనా). ఈ ఐడియాతో రాబోయే ఐదేళ్ల కాలంలో తెలంగాణ భవిష్యత్తునే మార్చి ‘బంగారు తెలంగాణ’ కు బాటలు వేస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చెబుతోంది. ‘ఇంక్లూజివ్ డెవలప్ మెంట్’ అనగానే చంద్రబాబు తన పాలన కాలంలో రూపొందించిన అనేకానేక బ్యూరోక్రటిక్ డాక్యు మెంట్లు గుర్తొస్తాయి. ప్రపంచ బ్యాంకు మార్గ దర్శ కాల ఆధారంగా పాలసీ డాక్యుమెంట్లు రూపొం దేవి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలకు సం బంధించిన వ్యూహాలు, ఎత్తుగడలు, టికెట్ల ఖరారు లోనూ తన ముద్ర చూపిస్తున్న ఏఐసీసీ నేత, మాజీ బ్యూరో క్రాట్ కొప్పుల రాజు ముద్ర పార్టీ మేనిఫెస్టో పై కూడా కనిపిస్తోంది.నిజానికి టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ డి.శ్రీధర్‌బాబు, కో-ఛైర్మన్ మల్లు భట్టివిక్ర మార్క గత నెల రోజులుగా తెలంగాణలోని విద్యార్ధి, యువజన, ఉద్యోగ, ఉపాధ్యాయ, రాజ కీయ జేఏసీ నాయకులు, రైతు, మహిళా, ప్రజా సం ఘాలతో పాటు విద్యావేత్తలు, మేధావులు, ఆర్థిక రంగ నిపుణులతో చర్చిస్తున్నారు.
 
 అభిప్రాయాలు, సూచనల ఆధారంగా మేనిఫెస్టోలోని అంశాలను రాజకీయ కోణంలో పొందుపరిచారు. కానీ కొప్పుల రాజు బ్యూరోక్రటిక్ దృక్కోణం మేనిఫెస్టోలోని అంశాలను మార్చేస్తోంది. ఉదాహరణకు... పలు సార్లు నేతలు చర్చించిన మీదట రూపొందించిన  ముసాయిదా ప్రణాళికలో రూ. వెయ్యి చొప్పున వృ ద్ధులు, వితంతువులకు సామాజిక పెన్షన్లు అనే అం శాన్ని చేర్చారు. కొప్పుల రాజుతో సమావేశమ య్యాక కొత్త కొర్రీ ఒకటి పడింది.
 
 తెలంగాణలో 27 లక్షల మంది ఫించన్లు ఇస్తున్న నేపథ్యంలో అంతమందికి రూ. వెయ్యి చొప్పున చెల్లించాలంటే తెలంగాణ బడ్జెట్ సహకరించదనే నిర్ణయానికి వచ్చారు. తీరా దాన్ని తుది మేనిఫెస్టోలో రూ. 500లకే పరిమితం చేయబోతున్నారు. చంద్రబాబు రైతు రుణాల మాఫీ పేరిట ఒక రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా అమలు చేయలేని హామీని ఊదరగొడుతున్నారు. దానికి విరుగుడుగా ఏ హామీ ఇద్దామని ఆలోచించీ, ఆలోచించీ కాంగ్రెస్ చివరకు ఒక్కో రైతుకు 10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఇస్తే సరిపోతుందని తేల్చేసింది. ఉద్యోగులందరికీ ‘స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్, చెరువుల పునరుద్ధరణ, నిరుద్యోగులకు ఒకసారి ప్రయోజనంగా 40 ఏళ్ల వయో పరిమితి, ఉచిత కరెంటు కోసం సౌరశక్తి యూనిట్లు స్థాపన, మూడేళ్ల  వైద్య కోర్సు వంటి అంశాలూ పొందుపరిచిన ఈ మేనిఫెస్టో ముసాయిదాను టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా ఆమోదించారు. ఈ ఎన్నికల ప్రణాళికకు  అధిష్టానం ఆమోదం తెలడపమే తరువాయి. ఆ తరువాతే విడుదల!

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement