హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలు ఎవరొచ్చినా పొత్తులపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి మధు అన్నారు. సీపీఐతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశముందని చెప్పారు.
5 లోక్సభ, 48 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు మధు చెప్పారు. నాలుగు రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు. అవసరమైతే పోత్తుల్లో భాగంగా ప్రకటించిన స్థానాలు సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మధు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకోవడానికి చర్చలు జరిపేందుకు సిద్ధమని మధు చెప్పారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు.
బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో పొత్తుకు సిద్ధం: సీపీఎం
Published Sat, Apr 5 2014 4:05 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement