కాంగ్రెస్ పాలన కుంభకోణాలమయం | Credited to the bjp:Sivarajsing Chauhan | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పాలన కుంభకోణాలమయం

Published Mon, Apr 28 2014 12:48 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కాంగ్రెస్ పాలన కుంభకోణాలమయం - Sakshi

కాంగ్రెస్ పాలన కుంభకోణాలమయం

తెలంగాణ ఘనత బీజేపీదే: మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్

 జనగామ/హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పాలన పూర్తిగా కుంభకోణాలమయంగా మారిందని.. మోసపూరిత కాంగ్రెస్‌ను ఓడించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ కోరారు. సోనియాగాంధీ చేతిలో మన్మోహన్‌సింగ్ కీలుబొమ్మలా మారి ప్రధాని పదవి పరువు మంటగలిపారని ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లోని కార్వాన్ నియోజకవర్గంలో, వరంగల్‌జిల్లా జనగామలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు.

 తెలంగాణ తెచ్చిన ఘనత బీజేపీదేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మంచినీళ్లు కూడా దొరకడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ మాటే మరిచిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, ఎంఐఎం పాలనలో గ్రేటర్ హైదరాబాద్ ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఎంఐఎం, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే మతోన్మాదానికి వేసినట్టేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement