అనారోగ్యం పాలైన ఉమాభారతి | Umabharti takes ill during campaign | Sakshi

అనారోగ్యం పాలైన ఉమాభారతి

Published Sat, Apr 5 2014 4:26 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

అనారోగ్యం పాలైన ఉమాభారతి - Sakshi

అనారోగ్యం పాలైన ఉమాభారతి

బిజెపి సీనియర్ ఉపాధ్యక్షురాలు, ఫైర్ బ్రాండ్ నేత ఉమాభారతి హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఒక ఎన్నికల సభలో పాల్గొంటుండగా ఆమె అనారోగ్యం పాలయ్యారు. దీంతో టికమ్ గఢ్ లోని ఓర్ఛా నగరంలో ఆమె కార్యక్రమం రద్దయింది.


ఉమాభారతిని వెంటనే భోపాల్ లోని ఆమె నివాసానికి తీసుకువెళ్లారు. ఆమె జ్వరం, మూత్రపిండాల నొప్పితో బాధపడుతున్నారని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని వైద్యులు ప్రకటించారు. శుక్రవారం నాడు నాలుగు కిలోమీటర్ల దూరం ఊరేగింపుగా నడుస్తూ వచ్చినందువల్ల ఆమె అనారోగ్యానికి గురయ్యారని, అయితే దాన్ని పట్టించుకోకుండా గునా, మాలథౌన్, ఝాన్సీ వంటి ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లారు. ఆమె కోలుకున్న వెంటనే పార్టీ ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement