విశాఖ:తమ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉంటుందని వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖ లోక్ సభ అభ్యర్థిగా ఉన్న విజయమ్మ శుక్రవారం ఎస్సీ, ఎస్టీ సంఘాలతో సమావేశమైయ్యారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కృషి చేద్దామని ఈ సందర్భంగా ఆమె అన్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం కాగానే ఆ దివంగత నేత వైఎస్సార్ పథకాలన్నీ తిరిగి అమలు చేస్తామన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.