
12 నుంచి వైఎస్ఆర్ సీపీ జనభేరీ
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనభేరీ ఈనెల 12వ తేదీ నుంచి పునఃప్రారంభం కానుంది. ఈనెల 11వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పురస్కరించుకొని భద్రత నేపథ్యంలో 'జనభేరి'ని ఒకరోజు వాయిదా వేసుకోవాలని ఆయా జిల్లాల అధికార యంత్రాంగం, పోలీసు అధికారులు సూచించారు.
కాగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికల ప్రచారం కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 11వ తేదీ నుంచి వైఎస్‌ఆర్ జనభేరి ప్రారంభించాల్సి ఉంది. అయితే అధికారుల సూచనలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పర్యటనలు వాయిదా పడ్డాయి.