‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేసేందుకు కృషిచేస్తా. ప్రజల కష్ట, సుఖాల్లో పాలుపంచుకుంటూ కుటుంబ సభ్యుడిగా సేవ చేయాలన్నదే నా ధ్యేయం’ అని వైఎస్సార్‌సీపీ హుజూర్‌నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.
నియోజకవర్గంలోని మేళ్లచెరువు, మఠంపల్లి మండలాలు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉన్నప్పటికీ సాగు నీరు అందడంలేదు. ఆయకట్టు చివరన ఈ భూము లు ఉండడంతోసాగునీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఎకారాల్లో ఉన్న ఈ భూములన్నింటికీ సాగర్ ఎడమకాలువ ద్వారా, కృష్ణానదిపై లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టడం ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తా.
ప్రతి గ్రామానికి కృష్ణానది ద్వారా తాగునీరు
నియోజకవర్గంలోని 89 గ్రామ పంచాయతీలతో పాటు హుజూర్‌నగర్ నగర పంచాయతీకి కృష్ణానది ద్వారా తాగునీటిని అందించేందుకు కృషి చేస్తా.
జూనియర్‌కళాశాలలు ఏర్పాటు చేయిస్తా
ఐదు మండలాల పరిధిలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ హాస్టళ్లు , జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయిస్తా. తద్వారా విద్యార్థులకు అందుబాటులో విద్యను తీసుకు వస్తా.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా
యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు పాటుపడతా. మఠంపల్లి, మేళ్లచెరువు, నేరేడుచర్ల మండలాల్లో గల సిమెంట్ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చొరవ చూపుతా. అంతేగాక నియోజకవర్గ కేంద్రమైన హుజూర్‌నగర్‌లో ప్రభుత్వం ద్వారా వృత్తి విద్యా కోర్సుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తా.
అర్హులైనవారందరికీ సంక్షేమ పథకాల వర్తింపు
అర్హులైన వారందరికీ పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేసేందుకు కృషి చేస్తా. ప్రభుత్వం ద్వారా రేషన్‌కార్డులు, ఇళ్లు, నివేశన స్థలాలు, ఆరోగ్యశ్రీ కార్డులు ప్రజలకు అందేలా పాటుపడతా. ప్రభుత్వ సహాయం ప్రజలకు చేరువైనప్పుడు మాత్రమే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయిస్తా
మఠంపల్లి, మేళ్లచెరువు మండలాల్లో వేలాది ఎకరాలలో పత్తి, మిర్చి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వారు పండించిన పంటను విక్రయించు కునేందుకు హుజూర్‌నగర్‌లో కొనుగోలు కేంద్రం, మిర్చి నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేయిస్తా.
కుటుంబ సభ్యుడిగా సేవచేస్తా
Published Mon, Apr 28 2014 3:36 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement