బోధన్,న్యూస్‌లైన్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణపాలన కేవలం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే పార్టీ విధానం, నినాదమన్నారు. మంగళవారం మండలంలోని సంగెం , మినార్‌పల్లి, భవానీపేట్, ఊట్‌పల్లి, అమ్దాపూర్, బెల్లాల్, ఎరాజ్‌పల్లి గ్రామాల్లో ఆయ న ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామా ల్లో పార్టీ ఎన్నికల ప్రణాళికలోని అంశాలను వివరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సంక్షేమ పథకాల ఫలాలు అన్ని వర్గాలవారి దరికి చేరాయన్నారు.అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా పింఛన్, రేషన్‌కార్డులు, ఇంది రమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో లబ్ధి చేకూర్చాన్నారు. ఆ మహానేత మరణానంతరం రైతులను పట్టించుకున్న వారే కరువయ్యారన్నారు. పండించిన పంటలకు మ ద్దతు ధర అందక ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. మద్దతు ధర అందని ద్రాక్షగానే మిగిలిందన్నారు.
పుట్టెడు కష్టాలతో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడులను అమ్ముకునేందుకు పడి గాపులు పడాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని, హామీలను పార్టీ అధికారంలోకి రాగానే అమలు చేసి చూపిస్తామన్నారు. ప్రజా సే వ చేయాలనే సంకల్పంతో ఎన్నికల బరిలో నిలిచాన ని, తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని అన్నారు. ఈ ప్రాంత ప్ర జల కష్ట సుఖాలు, సమస్యల పై పూర్తి అవగాహన ఉం దని, ఎన్నికల్లో గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దీన్‌దయాల్, నాయకులు ఆనందర్ రెడ్డి, ఇన్నారెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ సీపీతోనే సువర్ణ పాలన
Published Wed, Apr 23 2014 1:56 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement