‘సార్వత్రిక ’ఖర్చులకూ లెక్కుంది...! | general election nominations in expense | Sakshi
Sakshi News home page

‘సార్వత్రిక ’ఖర్చులకూ లెక్కుంది...!

Published Tue, Apr 8 2014 1:04 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

‘సార్వత్రిక ’ఖర్చులకూ లెక్కుంది...! - Sakshi

‘సార్వత్రిక ’ఖర్చులకూ లెక్కుంది...!

జిల్లాలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయా అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.

సాక్షి, నల్లగొండ  : జిల్లాలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయా అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలను సేకరించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను ఐ అండ్ పీఆర్ రేట్లకు అనుగుణంగానే లెక్కించనున్నారు. ఈ బాధ్యత ఎన్నికల వ్యయ పరిశీలకులపై ఉంది. ఇందుకు జిల్లా అధికారులు ప్రచార ఖర్చులను ఏ విధంగా లెక్కించాలో ఓ ప్రణాళికను రూపొం దించి ఎన్నికల వ్యయ పరిశీలకులకు అందజేశారు.


సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నాలుగైదు రోజులు గడుస్తుండడంతో వివిధ రాజకీయ పార్టీల అధినేతలు జిల్లాలో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొనున్నారు. అయితే.. ఈ సభ ఖర్చులను కూడా లెక్కలోకి తీసుకోనున్నారు. లెక్కప్రకారం ఆయా అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చుల వివరాలను సేకరిస్తారు.

ఈ లెక్కని వ్యయ పరిశీలకులు రిజిష్ట్రర్‌లో నమోదు చేసి జిల్లా స్థాయి ఎన్నికల అధికారులకు తెలియజేస్తారు. స్థానిక అభ్యర్థుల ఖర్చులను కూడా ఇలాగే లెక్కిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఆయా అభ్యర్థుల ప్రచార ఖర్చును ఈ కింది విధంగా లెక్కిస్తారు.
 
 
 టెంట్‌హౌస్ వస్తువులు..

 షామియానాకు రూ.150 నుంచి ఆయా సైజ్‌లను బట్టి రూ.1800 ఉంటుంది.
 ఫ్యాన్ రోజుకు రూ.100, రెడ్‌కార్పెట్ రోజుకు రూ.50 నుంచి రూ.80 వరకు..
 కూలర్‌కు రూ.350, ఒక్కో కుర్చీకి రోజుకు రూ.7, వీఐపీ కుర్చీకి రూ.70.
 సోఫాసెట్‌కు రూ.550 నుంచి రూ.700 వరకు..

 లైటింగ్ వస్తువులు..

 మైక్రోఫోన్‌తో కూడిన 100 వాట్ల అహూజా ఆంప్లిఫయర్‌కు  రూ.1100..
 మైక్రోఫోన్‌తో కూడిన 250 వాట్ల అహూజా ఆంప్లిఫయర్‌కు రూ.2500..
 మైక్రోఫోన్‌తో కూడిన 400 వాట్ల అహూజా ఆంప్లిఫయర్, రెండు లౌడ్ స్పీకర్లకు రూ.3,800
 ఆయా వాట్లను, లౌడ్ స్పీకర్లను బట్టి రూ.1,25,000 వరకు ఉంది.

 ఆడియో క్యాసెట్‌కు రూ. 50..

 వెయ్యి మందితో ఓ హాలులో సమావేశం నిర్వహిస్తే రూ. 2500..
 20 వేల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే రూ.39 వేలు, రెండు లక్షల మందితో బహిరంగసభ నిర్వహిస్తే రూ.1.50 లక్షలు.
 ఫోకస్ లైట్‌కు రూ.80, పగలు వెలిగే లైట్‌కు రూ.250 నుంచి రూ.300

 టిఫిన్

 వాటర్ బ్యారెల్ రూ.30, పులిహోరా ప్యాకెట్ రూ.15, పెద్ద సమోసా రూ.11, ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా రూ.20, ఎగ్ బిర్యానీ రూ.80, చికెన్ బిర్యానీ రూ.110, మటన్ బిర్యానీ రూ.185, కాఫీ రూ.8, లీటర్ వాటర్ బాటిల్ రూ.20.

 హోటల్ రూంలు..

 స్టాండెడ్ రూం ఏసీతో రూ.1400, సాధారణ రూం రూ.650..
 ఎగ్జిక్యూటివ్ రూం ఏసీతో రూ.2100, సాధారణ రూం రూ.1400..
 సైట్ రూమ్‌కు ఏసీతో రూ.3 వేలు, సాధారణ రూం రూ.1800..
 
 
 డెకొరేషన్ వస్తువులు..

 సభ ప్రాంగణానికి రూ.వెయ్యి నుంచి రూ. 1500.
ఒక్కో జెండాకు రూ.30, ప్లాస్టిక్ జెండాకు రూ.40, పోస్టర్‌కు రూ.30.
 
 అద్దె వస్తువులు..


 డీవీడీకి రూ.20, సీడీకి రూ.10, జీబు, మ్యాక్స్‌కు రూ.వెయ్యి, డ్రైవర్‌కు రూ.200.
 సుమో, క్వాలీస్‌కు 1300, డ్రైవర్‌కు రూ.300, కారు రూ.900, ఇన్నోవాకు రూ.2 వేలు..
బస్‌కు రూ.5 వేలు, చిన్న బస్సుకు రూ.3,500, లారీకి రూ.3 వేలు, ఐషర్‌కు రూ.2500, లేబర్ చార్జి రోజుకు రూ.238, మిల్స్ ప్లేట్‌కు రూ.40.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement