అమ్మకు, తమ్ముడికి మాత్రమే...
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ నేతలు ఇది చేదువార్తే. ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకు పోతున్న బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రియాంకా గాంధీని ప్రచార బరిలోకి దించాలని కాంగ్రెస్ నేతల చేస్తున్న విజ్ఞప్తులు ఫలించేలా అవకాశాలు కనిపించటం లేదు. ప్రియాంకా మాత్రం తల్లి, సోదరుడి నియోజకవర్గాలకు మాత్రమే పరిమితం కానున్నారు. కేవలం తాను సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీల తరపున మాత్రమే ప్రచారం చేయనున్నట్లు ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు.
లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌లో గురువారం ప్రియాంక తన భర్త రాబర్ట్ వాధ్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ తరపున ప్రచారం చేయబోతున్నారనే వార్తలపై స్పందించిన ప్రియాంక.... తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్‌గాంధీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఇతర నాయకుల తరపున ప్రచారం చేయబోనని చెప్పారు.